అందరికీ నమస్కారమ్!!
our motto
ఈ అక్షరయజ్ఞంలో పాలుపంచుకునేందుకు సన్నద్ధమైన
సత్సంగ సభ్యులకు చిన్న మనవి.
1. ఈ "నైష్కర్మ్య సిద్ధి" గ్రంథం మనకు అందుబాటులో ఉన్నఆన్‌లైన్ కాపీలు రెండూ కూడా పూర్తి స్థాయి స్పష్టతతో లేవు. అంచేత వీటిని పునః టైపు చేసుకోవాల్సిన ఆవశ్యకత ఉన్నది.
2. భగవదనుగ్రహ వశమున.... మొదటి కాపీలో సరిగ్గా, స్పష్టంగా లేని అంశాలను మనం రెండవ కాపీలో పొందేందుకు అనువుగా ఉండుట మన సుకృతఫలమే!
3. sanskrit documents వారి సౌజన్యముతో మనకు ఇందలి శ్లోకములు (సూత్రములు) భాగము ముందుగా టైపు చేసిన ప్రతి అంతర్జాలము ద్వారానే లభించింది.
అంచేత మనము ఇందలి శ్లోక (సూత్ర) భాగమును మరలా టైపు చేయవలసిన అవసరము లేదు.
4. అవ (అవతారిక), దం.ఆ, ఇంకా తాత్పర్యము ఈ మూడింటిని ప్రతీ పేజీలో విధిగా టైపు చేయవలసి వుంటుంది.
5. ఏ చిన్నపాటి అక్షర దోషము లేకుండగా ప్రయత్నిస్తూ టైపు చేయుట అత్యావశ్యకమై వున్నది.
6. మనకు ఎన్నెన్నో పనులు (గురుకార్యములు) వరుసలో చాలా చాలా వున్నవి కనుక ఏ మాత్రము జాప్యము సేయక, ఏ కొంత సమయము దొరకిన ఈ సేవలో మన అమూల్యమైన సమయాన్ని, శక్తిని, శ్రద్ధను, భక్తిని వినియోగించి విశ్వాసపాత్రులుగా ధన్యత నొందుదాము.
7. శక్త్యానుసారముగాను, శక్తి వంచన లేకుండగాను, శీఘ్రగతిన ఈ కార్యక్రమంలో విరివిగా పాల్గొని మన ప్రేమను ఈ రీతిగా ప్రకటించుకుందాము.
8. ఏదో మొక్కుబడి (mechanical) గా కాక... చేసే పనిపై పూర్తి మనంబును నిలిపి, భావమును అవగాహన చేసికొనుచూ ఈ గురుకార్యమును నిర్వహించుట ముఖ్యమై యున్నదని అందరూ అనుక్షణం జ్ఞప్తియందుకుందాము.
జయ గురుదేవ, జయ జయ గురు దేవ!!