శ్లోకాలు

1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | 35 | 36 | 37 | 38 | 39 | 40 | 41 | 42 | 43 | 44 | 45 | 46 | 47 | 48 | 49 | 50 | 51 | 52 | 53 | 54 | 55 | 56 | 57 | 58 | 59 | 60 | 61 | 62 | 63 | 64 | 65 | 66 | 67 | 68 | 69 | 70 | 71 | 72 | 73 | 74 | 75 | 76 | 77 | 78 | 79 | 80 | 81 | 82 | 83 | 84 | 85 | 86 | 87 | 88 | 89 | 90 | 91 | 92 | 93 | 94 | 95 | 96 | 97 | 98 | 99 | 100 |

updates

"నైష్కర్మ్య సిద్ధి" త్వరలో ఈ బ్లాగు మరింత ముస్తాబు కాగలదు. అప్పటి వరకూ సాధక మిత్రులు అనుభూతి ప్రకాశము అక్షరీకరణ కొనసాగించగలరని మనవి. మంగళకరమగు ఈ కార్యక్రమం నిర్విఘ్నంగా జరుగును గాక!! అక్షర యజ్ఞంలో తొలి అధ్యాయం నందలి 100 శ్లోకాల అవతారిక, దం.ఆ, తాత్పర్యాదుల అక్షరీకరణ దిగ్విజయముగా పూర్తికాబడినది.జయగురుదేవ!!

1-17




అలబ్ధ్వాతిశయం యస్మాద్వ్యావృత్తాస్తమబాదయః
గరీయసే నమస్తస్మా అవిద్యాగ్రంథిభేదినే 2

1-17

2 comments:

  1. అవ. ఆచార్యులవలన తెలియబడినవిద్యయే శ్రేష్ఠమైనఫలమును పొందించును. ఆచార్యులుగలపురుషుడు బ్రహ్మతత్వము నెఱుంగును.
    దం-అ. తమస్ మొదలగుప్రత్యయములు ఎవనికంటె అన్యులయందు ఉత్క్రుష్టతను (శ్రేష్ఠత్వమును) లభించక మరలిపోయెనో అజ్ఞానముయొక్క దృఢబంధముచేనైనను ఛేదించిన యాగురువుకొఱకు నమస్కారము చేయబడుచున్నది.
    తా. లోకములో తమస్ ప్రత్యయమును నిరతిశయాదిశబ్దములును సర్వప్రకారములచేత శ్రేష్ఠత్వ మెచ్చో పరమావధినొందియుండునో అట్టి వస్తువుయొక్కశ్రేష్ఠత్వమును జెప్పుచుండును. అట్టిశబ్దములే మహాత్మునికంటె అన్యులయందు శ్రేష్ఠత్వ మెక్కుడుగా సిద్ధింపనందున అన్యుల నందఱనువదలి యేమహాత్ముడే సర్వప్రకారములచే నందఱకంటె శ్రేష్ఠుండని చెప్పుచు పర్యవసించెనో అట్టి శ్రీశంకరభగవత్పాదులను నామధేయముగల మాగురువులకొఱకు నమస్కారముజేసెదను. మీగురువులు సర్వప్రకారములచే సర్వశ్రేష్ఠులని మీకేలాగున దెలియవచ్చెననిన, నాయొక్క హృదయము నావరించియున్న యజ్ఞానము దృఢమైనముడివలె నన్నుబంధించి సంసారసముద్రములో ముంచుచుండు నజ్ఞానగ్రంధి యింతవఱ కెవ్వరికిని ఛేదింప శక్యముగాకయుండినదానిని యీమాగురువులుభేదించి చిన్నభిన్నంబులుగా ద్రెంచి నన్ను సంసారసముద్రములోనుండి లేవనెత్తి సుఖింపజేసిరిగావున ఈమాగురువులే సర్వప్రకారములచే సర్వశ్రేష్ఠులని నేనెఱింగితిని. ఇట్టిగురువులకొఱకు నేను నమస్కారంబు లనవరతంబు గావించెదనని భావము. 'ఆత్మనామ గురోర్నామ' ఇత్యాదిధర్మశాస్త్రవచనము తననామమును గురువుయొక్కనామమును తలి దండ్రులనామమును, ఇంకను పూజ్యులగువారినామములను బ్రత్యక్షముగా జెప్పగూడదని చెప్పుచున్నందున నిచ్చో నీగ్రంధకర్త స్వగురునామమును ప్రత్యక్షముగ నుచ్చరింపక పర్యాయముగా జెప్పిరి. ఈగ్రంధకర్తయగు సురేశ్వరాచార్యులు మండనమిశ్రులను నామముగలవారై కుమారిలభట్టాచార్యులకు శిష్యులైయుండి కర్మమీమాంసమం దత్యంతశ్రద్ధగలిగి బ్రహ్మమీమాంసావిద్వేషంబుతో సన్యాసులనినమాత్రముననె మండిపడుచు తత్కాలముననుండిన దండి, బాణ, మురారి, భట్టభాస్కర, ఖండనకా, రోదయనాచార్యాది పండితులనెల్ల నోడించి కర్మమీమాంసామతంబునెల్ల భూమండలంబున ప్రశస్తినొందజేసి తేజరిల్లుచుండ శ్రీశంకరభగవత్పాదు లీమండనమిశ్రునినగరంబునకుం జని సకలశాస్త్రంబులలో నీతనితో నూఱుదినంబులు వాదించి పరాజితుంగావించి వేదాంతమీమాంసాశాస్త్రంబునం దాభిముఖ్యమును గల్పించి పరమహంసపరివ్రాజకుం గావించి కృతార్థునింజేసెనని శంకరవిజయంబునంగలకథ నిచ్చో ననుసంధింపవలయును.

    ReplyDelete
  2. అవ. ఆచార్యులవలన తెలియబడినవిద్యయే శ్రేష్ఠమైనఫలమును పొందించును. ఆచార్యులుగలపురుషుడు బ్రహ్మతత్వము నెఱుంగును.

    దం-అ. తమస్ మొదలగుప్రత్యయములు ఎవనికంటె అన్యులయందు ఉత్క్రుష్టతను (శ్రేష్ఠత్వమును) లభించక మరలిపోయెనో అజ్ఞానముయొక్క దృఢబంధముచేనైనను ఛేదించిన యాగురువుకొఱకు నమస్కారము చేయబడుచున్నది.


    తా. లోకములో తమస్ ప్రత్యయమును నిరతిశయాదిశబ్దములును సర్వప్రకారములచేత శ్రేష్ఠత్వ మెచ్చో పరమావధినొందియుండునో అట్టి వస్తువుయొక్కశ్రేష్ఠత్వమును జెప్పుచుండును. అట్టిశబ్దములే మహాత్మునికంటె అన్యులయందు శ్రేష్ఠత్వ మెక్కుడుగా సిద్ధింపనందున అన్యుల నందఱనువదలి యేమహాత్ముడే సర్వప్రకారములచే నందఱకంటె శ్రేష్ఠుండని చెప్పుచు పర్యవసించెనో అట్టి శ్రీశంకరభగవత్పాదులను నామధేయముగల మాగురువులకొఱకు నమస్కారముజేసెదను. 


    మీగురువులు సర్వప్రకారములచే సర్వశ్రేష్ఠులని మీకేలాగున దెలియవచ్చెననిన, నాయొక్క హృదయము నావరించియున్న యజ్ఞానము దృఢమైనముడివలె నన్నుబంధించి సంసారసముద్రములో ముంచుచుండు నజ్ఞానగ్రంధి యింతవఱ కెవ్వరికిని ఛేదింప శక్యముగాక యుండినదానిని యీమా గురువులు భేదించి చిన్నభిన్నంబులుగా ద్రెంచి నన్ను సంసార సముద్రములోనుండి లేవనెత్తి సుఖింపజేసిరి గావున ఈ మా గురువులే సర్వప్రకారములచే సర్వశ్రేష్ఠులని నేనెఱింగితిని. ఇట్టిగురువులకొఱకు నేను నమస్కారంబు లనవరతంబు గావించెదనని భావము. 


    'ఆత్మనామ గురోర్నామ' ఇత్యాది ధర్మశాస్త్ర వచనము తననామమును గురువుయొక్క నామమును తలి దండ్రులనామమును, ఇంకను పూజ్యులగువారి నామములను బ్రత్యక్షముగా జెప్పగూడదని చెప్పుచున్నందున నిచ్చో నీగ్రంధకర్త స్వగురునామమును ప్రత్యక్షముగ నుచ్చరింపక పర్యాయముగా జెప్పిరి. 

          ఈగ్రంధకర్తయగు సురేశ్వరాచార్యులు మండనమిశ్రులను నామము గలవారై కుమారిలభట్టాచార్యులకు శిష్యులైయుండి కర్మమీమాంస మం దత్యంత శ్రద్ధగలిగి బ్రహ్మమీమాంసావిద్వేషంబుతో సన్యాసులనిన మాత్రముననె మండిపడుచు తత్కాలమున నుండిన దండి, బాణ, మురారి, భట్టభాస్కర, ఖండనకా, రోదయనాచార్యాది పండితులనెల్ల నోడించి కర్మమీమాంసా మతంబునెల్ల భూమండలంబున ప్రశస్తినొందజేసి తేజరిల్లుచుండ శ్రీశంకరభగవత్పాదు లీమండనమిశ్రుని నగరంబునకుం జని సకలశాస్త్రంబులలో నీతనితో నూఱుదినంబులు వాదించి పరాజితుంగావించి వేదాంత మీమాంసా శాస్త్రంబునం దాభిముఖ్యమును గల్పించి పరమహంస పరివ్రాజకుం గావించి కృతార్థునిం జేసెనని శంకరవిజయంబునం గల కథ నిచ్చో ననుసంధింపవలయును.

    ReplyDelete

గురు స్మరణతో, రామకార్యంగా తలచి, ఆత్మభావనలో స్థిరపడేందుకు కావల్సిన చిత్తశుద్ధికై, ఈ నిష్కామ కర్మ రూప అక్షరయజ్ఞాన్ని, శ్లోక తాత్పర్యాది భావాన్ని చక్కగా అవగాహన చేసికొనుచు చేయ ప్రయత్నిద్దాము..

పైనున్న శ్లోకము యొక్క అవతారికను, తాత్పర్యమును ఈ దిగువ టైపు చేసిన చాలును. శ్లోకము టైపు చేయవలసిన అవసరము లేదు.

సంఖ్యలో ఎన్ని ఎక్కువ చేశాము అనేకంటే, అక్షర దోషములు ఏ ఒక్కటి తలెత్తకుండా రోజుకు ఒక్కరు కనీసం ఒక్కశ్లోకం పూర్తిగా చేసినా చాలును. త్వరితగతిన ఈ గురుకార్యం సఫలీకృతమగునని విన్నవించడమైనది.