శ్లోకాలు

1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | 35 | 36 | 37 | 38 | 39 | 40 | 41 | 42 | 43 | 44 | 45 | 46 | 47 | 48 | 49 | 50 | 51 | 52 | 53 | 54 | 55 | 56 | 57 | 58 | 59 | 60 | 61 | 62 | 63 | 64 | 65 | 66 | 67 | 68 | 69 | 70 | 71 | 72 | 73 | 74 | 75 | 76 | 77 | 78 | 79 | 80 | 81 | 82 | 83 | 84 | 85 | 86 | 87 | 88 | 89 | 90 | 91 | 92 | 93 | 94 | 95 | 96 | 97 | 98 | 99 | 100 |

updates

"నైష్కర్మ్య సిద్ధి" త్వరలో ఈ బ్లాగు మరింత ముస్తాబు కాగలదు. అప్పటి వరకూ సాధక మిత్రులు అనుభూతి ప్రకాశము అక్షరీకరణ కొనసాగించగలరని మనవి. మంగళకరమగు ఈ కార్యక్రమం నిర్విఘ్నంగా జరుగును గాక!! అక్షర యజ్ఞంలో తొలి అధ్యాయం నందలి 100 శ్లోకాల అవతారిక, దం.ఆ, తాత్పర్యాదుల అక్షరీకరణ దిగ్విజయముగా పూర్తికాబడినది.జయగురుదేవ!!

1-36




దేహారంభకయోశ్చ ధర్మాధర్మయోర్జ్ఞానినా సహ కర్మిణః
సమానౌ చోద్యపరిహారౌ

1-36

2 comments:

  1. అవ.సంచితకర్మల కీవిధముగా పరిహారము కలిగిన గలుగవచ్చును.ప్రారబ్ధకర్మల కేవిధముగ పరిహారము కలుగునని సిద్ధాంతవాది ప్రశ్న జేయునని తలచి పూర్వపక్షవాది పరిహారమును చెప్పుట ఉత్తరశ్లోకతాత్పర్యమని చెప్పుచున్నారు.--
    దం_అ.దేహమును ఆరంభించి(కలుగజేసి) యున్న పుణ్యపాపములవిషయమై ఆక్షేపసమాధానములు తత్త్వజ్ఞానసాధనవాదితోగూడ కర్మసాధనవాదికిని తుల్యములుగ నున్నవి.
    తా.పుణ్యపాపకర్మలు సంచితములు ప్రారబ్దములని రెండు విధములు.అందులో పూర్వజన్మలయందు సంపాదింపబడి ఫలమునిచ్చుట కవకాశమును కనిపెట్టియుండు కర్మలు సంచితములు.వర్తమానశరీరమును కలుగజేసి సుఃఖదుఃఖముల నిచ్చుచున్న కర్మలు ప్రారబ్దములు.వీనిలో సంచితములు నిత్యనైమిత్తికము నాచరించుచు కామ్య నిషిద్ధములను పరిహరించుచున్నందువలన నివర్తించును.ప్రారబ్దకర్మలు వర్తమానశరీరమునందు ఫలమును కలుగజేయుచున్నందున ఏవిధమున నివర్తించునని యన్యులాక్షేపించిన అనుభవము చేతనే నివర్తించునని కర్మలు మోక్షసాధనమని వాదించు నేను సమాధానమును చెప్పెదను.తత్వ జ్ఞానము మోక్షసాధనమని వాదించు నీవును,తత్వజ్ఞానముచే సంచిత కర్మలు నశించినను, ప్రారబ్ద కర్మ లేవిధముగ నశించునని యాక్షేపించినవారలకు అనుభవము చేతనే నశించునని సమాధానమును చెప్పవలసియుండుం గావున ప్రారబ్దవిషయమై శంకాపరిహారములు మనకిరువురకు సమానములని చెప్పుట ఉత్తరశ్లోకతాత్పర్యమని భావము.

    ReplyDelete
  2. అవ. సంచితకర్మల కీవిధముగా పరిహారము కలిగిన గలుగవచ్చును. ప్రారబ్ధకర్మల కేవిధముగ పరిహారము కలుగునని సిద్ధాంతవాది ప్రశ్న జేయునని తలచి పూర్వపక్షవాది పరిహారమును చెప్పుట ఉత్తరశ్లోకతాత్పర్యమని చెప్పుచున్నారు.--


    దం-అ. దేహమును ఆరంభించి(కలుగజేసి) యున్న పుణ్యపాపములవిషయమై ఆక్షేపసమాధానములు తత్త్వజ్ఞానసాధనవాదితోగూడ కర్మసాధనవాదికిని తుల్యములుగ నున్నవి.


    తా.పుణ్యపాపకర్మలు సంచితములు ప్రారబ్దములని రెండు విధములు. అందులో పూర్వజన్మలయందు సంపాదింపబడి ఫలమునిచ్చుట కవకాశమును కనిపెట్టియుండు కర్మలు సంచితములు. వర్తమానశరీరమును కలుగజేసి సుఃఖదుఃఖముల నిచ్చుచున్న కర్మలు ప్రారబ్దములు. 

             వీనిలో సంచితములు నిత్యనైమిత్తికము నాచరించుచు కామ్య నిషిద్ధములను పరిహరించుచున్నందువలన నివర్తించును. ప్రారబ్దకర్మలు వర్తమానశరీరమునందు ఫలమును కలుగజేయుచున్నందున ఏవిధమున నివర్తించునని యన్యులాక్షేపించిన అనుభవము చేతనే నివర్తించునని కర్మలు మోక్షసాధనమని వాదించు నేను సమాధానమును చెప్పెదను. 

                 తత్వ జ్ఞానము మోక్షసాధనమని వాదించు నీవును, తత్వజ్ఞానముచే సంచిత కర్మలు నశించినను, ప్రారబ్ద కర్మ లేవిధముగ నశించునని యాక్షేపించినవారలకు అనుభవము చేతనే నశించునని సమాధానమును చెప్పవలసియుండుం గావున ప్రారబ్దవిషయమై శంకాపరిహారములు మనకిరువురకు సమానములని చెప్పుట ఉత్తరశ్లోకతాత్పర్యమని భావము.

    ReplyDelete

గురు స్మరణతో, రామకార్యంగా తలచి, ఆత్మభావనలో స్థిరపడేందుకు కావల్సిన చిత్తశుద్ధికై, ఈ నిష్కామ కర్మ రూప అక్షరయజ్ఞాన్ని, శ్లోక తాత్పర్యాది భావాన్ని చక్కగా అవగాహన చేసికొనుచు చేయ ప్రయత్నిద్దాము..

పైనున్న శ్లోకము యొక్క అవతారికను, తాత్పర్యమును ఈ దిగువ టైపు చేసిన చాలును. శ్లోకము టైపు చేయవలసిన అవసరము లేదు.

సంఖ్యలో ఎన్ని ఎక్కువ చేశాము అనేకంటే, అక్షర దోషములు ఏ ఒక్కటి తలెత్తకుండా రోజుకు ఒక్కరు కనీసం ఒక్కశ్లోకం పూర్తిగా చేసినా చాలును. త్వరితగతిన ఈ గురుకార్యం సఫలీకృతమగునని విన్నవించడమైనది.