శ్లోకాలు
1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | 35 | 36 | 37 | 38 | 39 | 40 | 41 | 42 | 43 | 44 | 45 | 46 | 47 | 48 | 49 | 50 | 51 | 52 | 53 | 54 | 55 | 56 | 57 | 58 | 59 | 60 | 61 | 62 | 63 | 64 | 65 | 66 | 67 | 68 | 69 | 70 | 71 | 72 | 73 | 74 | 75 | 76 | 77 | 78 | 79 | 80 | 81 | 82 | 83 | 84 | 85 | 86 | 87 | 88 | 89 | 90 | 91 | 92 | 93 | 94 | 95 | 96 | 97 | 98 | 99 | 100 |
updates
2 comments:
గురు స్మరణతో, రామకార్యంగా తలచి, ఆత్మభావనలో స్థిరపడేందుకు కావల్సిన చిత్తశుద్ధికై, ఈ నిష్కామ కర్మ రూప అక్షరయజ్ఞాన్ని, శ్లోక తాత్పర్యాది భావాన్ని చక్కగా అవగాహన చేసికొనుచు చేయ ప్రయత్నిద్దాము..
పైనున్న శ్లోకము యొక్క అవతారికను, తాత్పర్యమును ఈ దిగువ టైపు చేసిన చాలును. శ్లోకము టైపు చేయవలసిన అవసరము లేదు.
సంఖ్యలో ఎన్ని ఎక్కువ చేశాము అనేకంటే, అక్షర దోషములు ఏ ఒక్కటి తలెత్తకుండా రోజుకు ఒక్కరు కనీసం ఒక్కశ్లోకం పూర్తిగా చేసినా చాలును. త్వరితగతిన ఈ గురుకార్యం సఫలీకృతమగునని విన్నవించడమైనది.
Subscribe to:
Posts (Atom)
దం-అ. నేను ప్రయత్నముచేత పర్యాలోచనమును చేయుచున్న వాడనయ్యును జ్ఞానముయొక్క ప్రతిపాదనమును శ్రుతియందుగాని స్మృతియందుగాని యెచ్చటనైనను జూచినవాడనుగాను. మఱియొకదానియందు మాకు నమ్మకము లేదు.
ReplyDeleteతా . శ్రుతులను స్మృతులను అన్నింటిని నేను పూర్వోత్తరసందర్భమున నవలంభించి విచారించితిని. ఒకేచోటనైనను ఆత్మజ్ఞానమునువిధించిన వాక్యము ఒకటినైనను కాన్పించలేదు. నీవు ఆత్మజ్ఞానమునందు ప్రమాణములని నమ్మియుండిన ఉపనిషత్తులలో గూడ యావజ్జీవము కర్మలను జేయవలయునని విధింపబడియున్నది. ' ఆత్మాన ముపాసీత 'అనెడువాక్య ముపాసనాఖ్యకర్మ విధాయకమని స్పష్టమేగదా. ' ఆత్మవారే ద్రష్టవ్య : కతమ ఆత్మయోయం విజ్ఞానమయ: ప్రాణేషు హృద్యంతర్జ్యోతి : పురుష : ఇత్యాది వాక్యములు జ్యోతిష్టోమాది కర్మలయందు కర్తయగు జీవాత్మయొక్కస్వరూపమును చెప్పుచున్నవి. గాని నీకు సమ్మతమైన కర్మకర్తృత్వాది సకలవిశేషశూన్యమైన ఆత్మస్వరూపమును చెప్పునవిగావు. కావున నాత్మతత్త్వజ్ఞానమునందు ప్రమాణము వాస్తవముగ లేదు. నా బుధ్ధిదోషముచేత చక్కగా శ్రుతిస్మృతులను నేను విచారింపకపోయినందున లేకపోయినదిగాదు. భౌద్ధక్షపణకాదిశాస్త్రంబులలో మోక్షసాధనం బాత్మజ్ఞానమనిచెప్పబడియున్నది. అయినను బౌద్ధాదిశాస్త్రములు బ్రాంతిమూలములై వేద విరుద్ధములుగానున్నందున వానియందు మాకు విశ్వాసములేదు.
అనిచెప్పినయర్థములను మేము ఆదరింపమని భావము. ఓ మైత్రేయీ ! ఆత్మ చూడదగినవాడు ఆత్మ యనగా నెవడుఎవడు విజ్ఞానస్వరూపుడై ప్రాణములయందుండి హృదయములోపల తేజోమయుడై కనపడుచుండెనో ఇతడే ఆత్మ అని శ్రుతుల కర్థము.
అవ. ఓయీ! అజ్ఞానము జ్ఞానము కలిగిన నివర్తించును. ఈయర్థము లోకములో ననుభవసిద్ధమై యున్నదిగదా! కావున నాజ్ఞాననివర్తకమైన జ్ఞానమునందు శ్రుతిస్మృతులలో విధివచనము లేకపోయిన నేమియని సిద్ధాంతవాదివలె మఱియొకడు శంకించుచున్నాడు.
అవ. పూర్వపక్ష వాది తాను వేదాంత వాక్యము యొక్క తాత్పర్యము ను చక్కగా విచారించిన ప్రకారమును శ్లోకముతో చెప్పుచున్నాడు.---
ReplyDeleteదం-అ. నేను ప్రయత్నముచేత పర్యాలోచనమును చేయుచున్న వాడనయ్యును జ్ఞానముయొక్క ప్రతిపాదనమును శ్రుతియందుగాని స్మృతియందుగాని యెచ్చటనైనను జూచినవాడనుగాను. మఱియొకదానియందు మాకు నమ్మకము లేదు.
తా . శ్రుతులను స్మృతులను అన్నింటిని నేను పూర్వోత్తరసందర్భమున నవలంభించి విచారించితిని. ఒకేచోటనైనను ఆత్మజ్ఞానమునువిధించిన వాక్యము ఒకటినైనను కాన్పించలేదు. నీవు ఆత్మజ్ఞానమునందు ప్రమాణములని నమ్మియుండిన ఉపనిషత్తులలో గూడ యావజ్జీవము కర్మలను జేయవలయునని విధింపబడియున్నది.
' ఆత్మాన ముపాసీత 'అనెడువాక్య ముపాసనాఖ్యకర్మ విధాయకమని స్పష్టమేగదా. ' 'ఆత్మావారే ద్రష్టవ్యః కతమ ఆత్మాయోయం విజ్ఞానమయః ప్రాణేషు హృద్యంతర్జ్యోతిః పురుషః' ఇత్యాది వాక్యములు జ్యోతిష్టోమాది కర్మలయందు కర్తయగు జీవాత్మయొక్కస్వరూపమును చెప్పుచున్నవి.
గాని నీకు సమ్మతమైన కర్మకర్తృత్వాది సకలవిశేషశూన్యమైన ఆత్మస్వరూపమును చెప్పునవిగావు. కావున నాత్మతత్త్వజ్ఞానమునందు ప్రమాణము వాస్తవముగ లేదు. నా బుధ్ధిదోషముచేత చక్కగా శ్రుతిస్మృతులను నేను విచారింపకపోయినందున లేకపోయినదిగాదు. బౌద్ధక్షపణకాది శాస్త్రంబులలో మోక్షసాధనం బాత్మజ్ఞానమని చెప్పబడియున్నది. అయినను బౌద్ధాదిశాస్త్రములు బ్రాంతిమూలములై వేద విరుద్ధములుగా నున్నందున వానియందు మాకు విశ్వాసములేదు. అనిచెప్పిన యర్థములను మేము ఆదరింపమని భావము.
ఓ మైత్రేయీ ! ఆత్మ చూడదగినవాడు. ఆత్మ యనగా నెవడు? ఎవడు విజ్ఞానస్వరూపుడై ప్రాణములయందుండి హృదయములోపల తేజోమయుడై కనపడుచుండెనో ఇతడే ఆత్మ అని శ్రుతుల కర్థము.
అవ. ఓయీ! అజ్ఞానము జ్ఞానము కలిగిన నివర్తించును. ఈయర్థము లోకములో ననుభవసిద్ధమై యున్నదిగదా! కావున నాజ్ఞాననివర్తకమైన జ్ఞానమునందు శ్రుతిస్మృతులలో విధివచనము లేకపోయిన నేమియని సిద్ధాంతవాదివలె మఱియొకడు శంకించుచున్నాడు.