శ్లోకాలు

1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | 35 | 36 | 37 | 38 | 39 | 40 | 41 | 42 | 43 | 44 | 45 | 46 | 47 | 48 | 49 | 50 | 51 | 52 | 53 | 54 | 55 | 56 | 57 | 58 | 59 | 60 | 61 | 62 | 63 | 64 | 65 | 66 | 67 | 68 | 69 | 70 | 71 | 72 | 73 | 74 | 75 | 76 | 77 | 78 | 79 | 80 | 81 | 82 | 83 | 84 | 85 | 86 | 87 | 88 | 89 | 90 | 91 | 92 | 93 | 94 | 95 | 96 | 97 | 98 | 99 | 100 |

updates

"నైష్కర్మ్య సిద్ధి" త్వరలో ఈ బ్లాగు మరింత ముస్తాబు కాగలదు. అప్పటి వరకూ సాధక మిత్రులు అనుభూతి ప్రకాశము అక్షరీకరణ కొనసాగించగలరని మనవి. మంగళకరమగు ఈ కార్యక్రమం నిర్విఘ్నంగా జరుగును గాక!! అక్షర యజ్ఞంలో తొలి అధ్యాయం నందలి 100 శ్లోకాల అవతారిక, దం.ఆ, తాత్పర్యాదుల అక్షరీకరణ దిగ్విజయముగా పూర్తికాబడినది.జయగురుదేవ!!

1-78







1-78

2 comments:

  1. అవ. పూర్వపక్షవాదిసిద్ధాంతవాదుల కిరువురకు నీకర్మప్రవృత్తి నిమిత్త విచారమువలన కలిగెడిఫలమును విభజించి చెప్పుచున్నారు. ------

    దం-ఆ. ఆప్తోపదేశముచేతగాని వేదాంతవచనములచేతగాని పుట్టినదియు యథార్ధమైనదియు నున్నతీరుగానున్న (నిర్వికారమయిన) ఆత్మస్వరూపమును గోచరింపజేయుచున్న సంయక్ జ్ఞానము కర్మలయందు ప్రవర్తించుటకు కారణమని నిశ్చయమైనచో, సర్వకర్మసన్న్యాసమును బోధించుశాస్త్రమును అంగీకరింపబడకపోయినచో, అప్పుడు కర్మలనన్నింటిని పరిత్యజించియున్న మేము భ్రమచేత నేర్పడిన సమ్యక్ జ్ఞానమును మాత్రము అవలంబించియున్నందువలనను, వేదవాక్యములచే బ్రతిపాదింపబడిన కర్మలయొక్క అనుష్ఠానమును త్యజించినందువలనను చెడిపోయినవారల మగుదుము. లేదా యెండమావులనీటిని ద్రావనిచ్ఛయించినవానియొక్క ప్రవృత్తికి కారణమువలె ఆయథార్థమైనపదార్థమును గోచరింపజేయుచున్న భ్రాంతిజ్ఞానమే సర్వకర్మలయందు ప్రవర్తించుటకు నిమిత్తమైనచో నప్పుడు మేము వృద్ధినిబొందుచున్నాము, మీరు చెడిపోవుచున్నారని ప్రయోజనము సిద్ధించును.

    తా. వేదవాక్యములయొక్క విచారముచేతగాని సకలవేదశాస్త్రముల నెఱింగిన మహాపురుషునియొక్క యుపదేశముచేతగాని సమ్యక్ (మంచి) జ్ఞానము పుట్టును. అట్టి జ్ఞానము వాస్తవమై నిష్కల్మషమైన ఆత్మతత్వమును దెలియజేయుచుండును. అటువంటి సమ్యక్ జ్ఞానమే కర్మలయందు ప్రవర్తించుటకు నిమిత్తమని నిశ్చయింపబడినయెడల కర్మత్యాగమునుచేసిన మేము మోక్షమార్గములోనుండి భ్రష్టులమై చెడిపోయినవారల మగుదుము. అదియెటులనిన, సంయక్ జ్ఞానము కర్మలయందు ప్రవర్తింపజేయునేని ఆసంయక్ జ్ఞానమునకు విషయ (గోచర) మైన ఆత్మస్వరూపము కర్తృత్వాదిధర్మశూన్యమని, నిర్వికారమని, నిరంజనమని, స్వయంప్రకాశమని, నిత్యముక్తమని యీవిధముగా విపరీతముగా తెలిసికొని యిట్టి భ్రాంతిజ్ఞానము నవలంబించియుంటిమి. అపౌరుషేయ నిత్యప్రమాణములైన వేదములు ఆయాకర్మల ననుష్ఠింపవలయునని విధించుచున్నప్పటికిని, ఆకర్మలను విడిచితిమి.

    అగ్నిహోత్రాదికర్మల నాచరించుటకు యోగ్యతలేని కుంటివారు, గ్రుడ్డివారు, చెవిటివారు, భార్యాహీనులు మొదలగువారికి విధింపబడిన సన్యాసమును కర్మానుష్ఠానశక్తులమైన మేమాచరించియుంటిమి గావున ఇట్టి మేము సమ్యక్ జ్ఞానమే కర్మప్రవృత్తికారణంబైనయెడల నిశ్చయముగా చెడిపోవుదుము. ఈప్రకారముగాక యెండమావులను జూచి జలమని భ్రమించి ఆజలమును ద్రాగి దాహమును దీర్చుకొనియెదనని ప్రవర్తించువానియొక్క ప్రవృత్తికి భ్రాంతిజ్ఞాన మెటుల నిమిత్తమో అటులే లౌకికవైదికకర్మలయం దన్నిటియందు బ్రవర్తించుటకు మూలము ఆత్మస్వరూపమును యథార్థముగ దెలియజేయక విపరీతముగ దెలియచేయుచున్న భ్రాంతిజ్ఞానమే యని నిశ్చయింపబడినచో ఆత్మస్వరూపయాథార్థ్యజ్ఞానము కలవారమై, ముముక్షువులకందఱకు నవశ్యకర్తవ్యం బని విధింపబడియున్న సర్వకర్మపరిత్యాగపూర్వక పరమహంససన్న్యాసాశ్రమము నంగీకరించియున్న మేము సన్మార్గమందే ప్రవర్తించుచున్నందున వృద్ధినొందుచున్నాము. భ్రాంతిజ్ఞానముచే నావరింపబడి కర్మజడులైయున్న మీరు చెడిపోవుచున్నారు. ఇదియే యీవిచారంబునకు ప్రయోజనమని భావము.

    ReplyDelete
  2. అవ. పూర్వపక్షవాదిసిద్ధాంతవాదుల కిరువురకు నీకర్మప్రవృత్తి నిమిత్త విచారమువలన కలిగెడిఫలమును విభజించి చెప్పుచున్నారు. ------


    దం-ఆ. ఆప్తోపదేశముచేతగాని వేదాంతవచనములచేతగాని పుట్టినదియు యథార్ధమైనదియు నున్నతీరుగానున్న (నిర్వికారమయిన) ఆత్మస్వరూపమును గోచరింపజేయుచున్న సమ్యక్ జ్ఞానము కర్మలయందు ప్రవర్తించుటకు కారణమని నిశ్చయమైనచో, సర్వకర్మసన్న్యాసమును బోధించుశాస్త్రమును అంగీకరింపబడక పోయినచో, అప్పుడు కర్మలనన్నింటిని పరిత్యజించియున్న మేము భ్రమ జ్ఞానమును మాత్రము అవలంబించియున్నందువలనను, వేదవాక్యములచే బ్రతిపాదింపబడిన కర్మలయొక్క అనుష్ఠానమును త్యజించినందువలనను చెడిపోయినవారల మగుదుము. లేదా యెండమావులనీటిని ద్రావనిచ్ఛయించినవానియొక్క ప్రవృత్తికి కారణమువలె ఆ యథార్థమైన పదార్థమును గోచరింపజేయుచున్న భ్రాంతిజ్ఞానమే సర్వకర్మలయందు ప్రవర్తించుటకు నిమిత్తమైనచో నప్పుడు మేము వృద్ధినిబొందుచున్నాము, మీరు చెడిపోవుచున్నారని ప్రయోజనము సిద్ధించును.


    తా. వేదవాక్యములయొక్క విచారముచేతగాని సకలవేదశాస్త్రముల నెఱింగిన మహాపురుషునియొక్క యుపదేశముచేతగాని సమ్యక్ (మంచి) జ్ఞానము పుట్టును. అట్టి జ్ఞానము వాస్తవమై నిష్కల్మషమైన ఆత్మతత్వమును దెలియజేయుచుండును. అటువంటి సమ్యక్ జ్ఞానమే కర్మలయందు ప్రవర్తించుటకు నిమిత్తమని నిశ్చయింపబడినయెడల కర్మత్యాగమునుచేసిన మేము మోక్షమార్గములోనుండి భ్రష్టులమై చెడిపోయినవారల మగుదుము. అదియెటులనిన, సమ్యక్ జ్ఞానము కర్మలయందు ప్రవర్తింపజేయునేని ఆ సమ్యక్ జ్ఞానమునకు విషయ (గోచర) మైన ఆత్మస్వరూపము కర్తృత్వాది ధర్మశూన్యమని, నిర్వికారమని, నిరంజనమని, స్వయంప్రకాశమని, నిత్యముక్తమని యీవిధముగా విపరీతముగా తెలిసికొని యిట్టి భ్రాంతిజ్ఞానము నవలంబించియుంటిమి. అపౌరుషేయ నిత్యప్రమాణములైన వేదములు ఆయాకర్మల ననుష్ఠింపవలయునని విధించుచున్నప్పటికిని, ఆకర్మలను విడిచితిమి.


    అగ్నిహోత్రాదికర్మల నాచరించుటకు యోగ్యతలేని కుంటివారు, గ్రుడ్డివారు, చెవిటివారు, భార్యాహీనులు మొదలగువారికి విధింపబడిన సన్యాసమును కర్మానుష్ఠాన శక్తులమైన మేమాచరించియుంటిమి గావున ఇట్టి మేము సమ్యక్ జ్ఞానమే కర్మప్రవృత్తికారణంబైనయెడల నిశ్చయముగా చెడిపోవుదుము.

             ఈప్రకారముగాక యెండమావులను జూచి జలమని భ్రమించి ఆజలమును ద్రాగి దాహమును దీర్చుకొనియెదనని ప్రవర్తించువానియొక్క ప్రవృత్తికి భ్రాంతిజ్ఞాన మెటుల నిమిత్తమో అటులే లౌకికవైదిక కర్మలయం దన్నిటియందు బ్రవర్తించుటకు మూలము ఆత్మస్వరూపమును యథార్థముగ దెలియజేయక విపరీతముగ దెలియచేయుచున్న భ్రాంతిజ్ఞానమే యని నిశ్చయింపబడినచో ఆత్మస్వరూపయాథార్థ్యజ్ఞానము కలవారమై, ముముక్షువులకందఱకు నవశ్యకర్తవ్యం బని విధింపబడియున్న సర్వకర్మ పరిత్యాగపూర్వక పరమహంస సన్న్యాసాశ్రమము నంగీకరించియున్న మేము సన్మార్గమందే ప్రవర్తించుచున్నందున వృద్ధినొందుచున్నాము.

          భ్రాంతిజ్ఞానముచే నావరింపబడి కర్మజడులైయున్న మీరు చెడిపోవుచున్నారు. ఇదియే యీవిచారంబునకు ప్రయోజనమని భావము.

    ReplyDelete

గురు స్మరణతో, రామకార్యంగా తలచి, ఆత్మభావనలో స్థిరపడేందుకు కావల్సిన చిత్తశుద్ధికై, ఈ నిష్కామ కర్మ రూప అక్షరయజ్ఞాన్ని, శ్లోక తాత్పర్యాది భావాన్ని చక్కగా అవగాహన చేసికొనుచు చేయ ప్రయత్నిద్దాము..

పైనున్న శ్లోకము యొక్క అవతారికను, తాత్పర్యమును ఈ దిగువ టైపు చేసిన చాలును. శ్లోకము టైపు చేయవలసిన అవసరము లేదు.

సంఖ్యలో ఎన్ని ఎక్కువ చేశాము అనేకంటే, అక్షర దోషములు ఏ ఒక్కటి తలెత్తకుండా రోజుకు ఒక్కరు కనీసం ఒక్కశ్లోకం పూర్తిగా చేసినా చాలును. త్వరితగతిన ఈ గురుకార్యం సఫలీకృతమగునని విన్నవించడమైనది.