శ్లోకాలు

1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | 35 | 36 | 37 | 38 | 39 | 40 | 41 | 42 | 43 | 44 | 45 | 46 | 47 | 48 | 49 | 50 | 51 | 52 | 53 | 54 | 55 | 56 | 57 | 58 | 59 | 60 | 61 | 62 | 63 | 64 | 65 | 66 | 67 | 68 | 69 | 70 | 71 | 72 | 73 | 74 | 75 | 76 | 77 | 78 | 79 | 80 | 81 | 82 | 83 | 84 | 85 | 86 | 87 | 88 | 89 | 90 | 91 | 92 | 93 | 94 | 95 | 96 | 97 | 98 | 99 | 100 |

updates

"నైష్కర్మ్య సిద్ధి" త్వరలో ఈ బ్లాగు మరింత ముస్తాబు కాగలదు. అప్పటి వరకూ సాధక మిత్రులు అనుభూతి ప్రకాశము అక్షరీకరణ కొనసాగించగలరని మనవి. మంగళకరమగు ఈ కార్యక్రమం నిర్విఘ్నంగా జరుగును గాక!! అక్షర యజ్ఞంలో తొలి అధ్యాయం నందలి 100 శ్లోకాల అవతారిక, దం.ఆ, తాత్పర్యాదుల అక్షరీకరణ దిగ్విజయముగా పూర్తికాబడినది.జయగురుదేవ!!

1-21

యత్సిద్ధావిదమః సిద్ధిర్యదసిద్ధౌ న కించన
ప్రత్యగ్ధర్మైకనిష్ఠస్య యాథాత్మ్యం వక్ష్యతే స్ఫుటం 4

1-21

7 comments:

  1. దం.అ. దేని యొక్క ప్రకాశము కలుగు చుండగా దేహేంద్రియాది జడ పదార్థం యొక్క ప్రకాశం కలుగునో దేని యొక్క ప్రకాశం లేనిచో సర్వము కొంచమైనను ప్రకాశింపకయుండునో అట్టి దేహేంద్రియాది సర్వాంతరత్వ సర్వ ప్రపంచాధ్యాసాధిష్ఠానత్వములయందే పర్యంసించిన (అనగా సర్వాంతరమై సర్వ ప్రపంచ సమారోద కారణంబైన) చిదాత్మ యొక్క వాస్తవ స్వరూపము స్పష్టముగా చెప్పబడును.
    తా. దేహేంద్రియాది పదార్ధములనుఘటపటాదిపదార్ధములునుజడములై నందున ప్రకాశించు యోగ్యత లేక యుండును. చిదాత్మ కేవల మజడమై నందున స్వయముగా ప్రకాశించుచుండును. అట్టి చిదాత్మ అంతఃకరణమున ప్రతిఫలించి విస్పష్టముగా ప్రకాశించెనేని అంతఃకరణమును దాని పరిణామ రూపములుగా నుండు వృత్తులను ఆ వృత్తులతో

    ReplyDelete
  2. దం.అ. దేని యొక్క ప్రకాశము కలుగు చుండగా దేహేంద్రియాది జడ పదార్థం యొక్క ప్రకాశం కలుగునో దేని యొక్క ప్రకాశం లేనిచో సర్వము కొంచమైనను ప్రకాశింపకయుండునో అట్టి దేహేంద్రియాది సర్వాంతరత్వ సర్వ ప్రపంచాధ్యాసాధిష్ఠానత్వములయందే పర్యంసించిన (అనగా సర్వాంతరమై సర్వ ప్రపంచ సమారోద కారణంబైన) చిదాత్మ యొక్క వాస్తవ స్వరూపము స్పష్టముగా చెప్పబడును.

    తా. దేహేంద్రియాది పదార్ధములను ఘటపటాది పదార్ధములును జడములై నందున ప్రకాశించు యోగ్యత లేక యుండును. చిదాత్మ కేవల మజడమై నందున స్వయముగా ప్రకాశించుచుండును. అట్టి చిదాత్మ అంతఃకరణమున ప్రతిఫలించి విస్పష్టముగా ప్రకాశించెనేని అంతఃకరణమును దాని పరిణామ రూపములుగా నుండు వృత్తులను ఆ వృత్తులతో

    ReplyDelete
  3. B. ఇందుచే సర్వ ప్రపంచాధ్యానంబున కధిష్టానంబై సర్వపదార్ధప్రకాశకంబై సర్వసాక్షియై స్వయం ప్రకాశమానమై యద్వితీయమై జీవాభిన్నమైన బ్రహ్మ స్వరూపమే యీ ప్రకరణమునకు ప్రతిపాద్య విషయమని చెప్పబడెను. ఇట్టి పరమాత్మ నిరాకారంబైనను సచ్చిదానందాత్మకమైన సామాన్యాకార మొకటియు సర్వసాక్షిత్వ సర్వాధిష్ఠానత్వాద్వితీయత్వాద్యాకార మొకటియు
    రెండాకారములు మాయచే నొందియున్నది. వానిలో సచ్చిదానందాకారము బ్రత్యక్షముగా దెలియబడుచున్నప్పటికిని సర్వసాక్షిత్వాద్యాకారము
    వేదాంతవాక్యవిచారముచేతనే ప్రకాశింపదగియున్నది. కావున చిదాత్మయొక్క భాగము చేత ప్రకాశించి మఱియొక
    భాగమేచే బ్రకాశింపకయున్నందున విషయమనబడును.

    ReplyDelete
  4. C. ఇట్టి చిదాత్మయని చెప్పబడు బ్రహ్మ స్వరూపము ఈశాస్త్రమునకు ప్రతి పాద్య విషయమై ఉన్నది. 'ఘటోస్తి, ఘటోభాతి, ఘటఇష్ఠః,'ఇత్యాది లోక వ్యవహారముల యన్నింటియందును సచ్చిదానందములు ప్రకాశించుచున్నవి.'ఘటోస్తి'ఘటముకలడను వ్యవహారమునందు సత్తయను,' ఘటోబాతి' ఘటము ప్రకాశించుచున్నది యను వ్యవహారమునందు ప్రకాశమని చెప్పబడు చిత్తూను,'ఘటఇష్టః' ఘటము ఇష్టమైనది యనువ్యవహారమునందు ఆనందమును భాసించుచున్నందున బ్రహ్మయొక్క సచ్చిదానందాకారము సామాన్యముగా దెలియబడుచున్నదని అఖండసచ్చిదానందత్వాద్వితీయత్వాద్యాకారము వేదాంతవాక్యవిచారము చేసినగాని దెలియబడదని యెఱుంగునది.

    ReplyDelete
  5. D. సంబంధించిన ఘటపటాదిపదార్ధములను సర్వము ప్రకాశించును. చిదా త్మ నిస్పష్టముగా బ్రకాశింపనిచో దీపములేనిఇంటిలో రాత్రికాలమే పదార్థమును భాసింపనటుల నొక పదార్థముసైతము భాసింపదు. కావున సర్వపదార్థము లకు బ్రకాశికమై దేహేంద్రియాది పదార్థముల కన్నింటికీ సాంతరమై సర్వసాక్షియై దేహేంద్రియాది సర్వప్రపంచాద్యాసాధిష్టానంబైన చిదాత్మ యొక్క స్వరూప యాధార్దము శారీరక భాష్యాదిగ్రంథములలో విస్తారముగా జెప్పబడి యున్నను చిదాత్మస్వరూపనిర్ణయార్థమై కావలసిన సందర్భమంతయు నొక్క చోటను జెప్పబడియుండనందున బుభుత్సువులబుద్ధి చిదాత్మ స్వరూప యదార్థమును త్వరలో దెలియజాలక చిక్కుపడుననియోచించి చిదాత్మ స్వరూపనిర్ణయముకొరకు కావలసినసందర్భంనంతయును నే నీ గ్రంథములో నొక్కచో జేర్చి నిస్పష్టముగా సంగ్రహముగ జెప్పుచున్నానని భావము. ఇందు చే సర్వ

    ReplyDelete
  6. దం.అ. దేని యొక్క ప్రకాశము కలుగు చుండగా దేహేంద్రియాది జడ పదార్థం యొక్క ప్రకాశం కలుగునో దేని యొక్క ప్రకాశం లేనిచో సర్వము కొంచమైనను ప్రకాశింపకయుండునో అట్టి దేహేంద్రియాది సర్వాంతరత్వ సర్వ ప్రపంచాధ్యాసాధిష్ఠానత్వములయందే పర్యంసించిన (అనగా సర్వాంతరమై సర్వ ప్రపంచ సమారోద కారణంబైన) చిదాత్మ యొక్క వాస్తవ స్వరూపము స్పష్టముగా చెప్పబడును.

    తా. దేహేంద్రియాది పదార్ధములను ఘటపటాది పదార్ధములును జడములై నందున ప్రకాశించు యోగ్యత లేక యుండును. చిదాత్మ కేవల మజడమై నందున స్వయముగా ప్రకాశించుచుండును. అట్టి చిదాత్మ అంతఃకరణమున ప్రతిఫలించి విస్పష్టముగా ప్రకాశించెనేని అంతఃకరణమును దాని పరిణామ రూపములుగా నుండు వృత్తులను ఆ వృత్తులతో

    ఇందుచే సర్వ ప్రపంచాధ్యానంబున కధిష్టానంబై సర్వపదార్ధప్రకాశకంబై సర్వసాక్షియై స్వయం ప్రకాశమానమై యద్వితీయమై జీవాభిన్నమైన బ్రహ్మ స్వరూపమే యీ ప్రకరణమునకు ప్రతిపాద్య విషయమని చెప్పబడెను. ఇట్టి పరమాత్మ నిరాకారంబైనను సచ్చిదానందాత్మకమైన సామాన్యాకార మొకటియు సర్వసాక్షిత్వ సర్వాధిష్ఠానత్వా ద్వితీయత్వాద్యాకార మొకటియు

    రెండాకారములు మాయచే నొందియున్నది. వానిలో సచ్చిదానందాకారము బ్రత్యక్షముగా దెలియబడుచున్నప్పటికిని సర్వసాక్షిత్వా ద్యాకారము

    వేదాంతవాక్య విచారము చేతనే ప్రకాశింపదగియున్నది. కావున చిదాత్మయొక్క భాగము చేత ప్రకాశించి మఱియొక భాగముచే బ్రకాశింపక యున్నందున విషయమనబడును.

    ఇట్టి చిదాత్మయని చెప్పబడు బ్రహ్మ స్వరూపము ఈశాస్త్రమునకు ప్రతి పాద్య విషయమై ఉన్నది. 'ఘటోస్తి, ఘటోభాతి, ఘటఇష్ఠః,'ఇత్యాది లోక వ్యవహారముల యన్నింటియందును సచ్చిదానందములు ప్రకాశించుచున్నవి. 'ఘటోస్తి' ఘటము కలదను వ్యవహారము నందు సత్తయను,' ఘటోబాతి' ఘటము ప్రకాశించుచున్నది యను వ్యవహారమునందు ప్రకాశమని చెప్పబడు చిత్తూను, 'ఘటఇష్టః' ఘటము ఇష్టమైనది యను వ్యవహారమునందు ఆనందమును భాసించుచున్నందున బ్రహ్మయొక్క సచ్చిదానందాకారము సామాన్యముగా దెలియబడుచున్నదని అఖండ సచ్చిదానందత్వా ద్వితీయత్వా ద్యాకారము వేదాంతవాక్య విచారము చేసినగాని దెలియబడదని యెఱుంగునది.

     సంబంధించిన ఘటపటాదిపదార్ధములను సర్వము ప్రకాశించును. చిదా త్మ విస్పష్టముగా బ్రకాశింపనిచో దీపము లేని ఇంటిలో రాత్రికాలమే పదార్థమును భాసింపనటుల నొక పదార్థము సైతము భాసింపదు. కావున సర్వపదార్థము లకు బ్రకాశికమై దేహేంద్రియాది పదార్థముల కన్నింటికీ సాంతరమై సర్వసాక్షియై దేహేంద్రియాది సర్వప్రపంచా ద్యాసాధిష్టానంబైన చిదాత్మ యొక్క స్వరూప యాధార్డ్యము శారీరక భాష్యాదిగ్రంథములలో విస్తారముగా జెప్పబడి యున్నను చిదాత్మస్వరూప నిర్ణయార్థమై కావలసిన సందర్భమంతయు నొక్క చోటను జెప్పబడి యుండనందున బుభుత్సువుల బుద్ధి చిదాత్మ స్వరూప యాదార్ఢ్య మును త్వరలో దెలియజాలక చిక్కుపడునని యోచించి చిదాత్మ స్వరూపనిర్ణయము కొరకు కావలసిన సందర్భము నంతయును నే నీ గ్రంథములో నొక్కచో జేర్చి విస్పష్టముగా సంగ్రహముగ జెప్పుచున్నానని భావము. 

    ReplyDelete
  7. జై గురుదేవ@ proof read vertion

    దం.అ. దేని యొక్క ప్రకాశము కలుగు చుండగా దేహేంద్రియాది జడ పదార్థం యొక్క ప్రకాశం కలుగునో దేని యొక్క ప్రకాశం లేనిచో సర్వము కొంచమైనను ప్రకాశింపకయుండునో అట్టి దేహేంద్రియాది సర్వాంతరత్వ సర్వ ప్రపంచాధ్యాసాధిష్ఠానత్వములయందే పర్యంసించిన (అనగా సర్వాంతరమై సర్వ ప్రపంచ సమారోద కారణంబైన) చిదాత్మ యొక్క వాస్తవ స్వరూపము స్పష్టముగా చెప్పబడును.

    తా. దేహేంద్రియాది పదార్ధములను ఘటపటాది పదార్ధములును జడములై నందున ప్రకాశించు యోగ్యత లేక యుండును. చిదాత్మ కేవల మజడమై నందున స్వయముగా ప్రకాశించుచుండును. అట్టి చిదాత్మ అంతఃకరణమున ప్రతిఫలించి విస్పష్టముగా ప్రకాశించెనేని అంతఃకరణమును, దాని పరిణామ రూపములుగా నుండు వృత్తులును ఆ వృత్తులతో సంబంధించిన ఘట పటా ది పదార్థములును సర్వము ప్రకాశించును.

    ఇందుచే సర్వ ప్రపంచాధ్యానంబున కధిష్టానంబై సర్వపదార్ధప్రకాశకంబై సర్వసాక్షియై స్వయం ప్రకాశమానమై యద్వితీయమై జీవాభిన్నమైన బ్రహ్మ స్వరూపమే యీ ప్రకరణమునకు ప్రతిపాద్య విషయమని చెప్పబడెను. ఇట్టి పరమాత్మ నిరాకారంబైనను సచ్చిదానందాత్మకమైన సామాన్యాకార మొకటియు సర్వసాక్షిత్వ సర్వాధిష్ఠానత్వా ద్వితీయత్వాద్యాకార మొకటియు
    రెండాకారములు మాయచే నొందియున్నది. వానిలో సచ్చిదానందాకారము బ్రత్యక్షముగా దెలియబడుచున్నప్పటికిని సర్వసాక్షిత్వా ద్యాకారము
    వేదాంతవాక్య విచారము చేతనే ప్రకాశింపదగియున్నది. కావున చిదాత్మయొక్క భాగము చేత ప్రకాశించి మఱియొక భాగముచే బ్రకాశింపక యున్నందున విషయమనబడును.

    ఇట్టి చిదాత్మయని చెప్పబడు బ్రహ్మ స్వరూపము ఈశాస్త్రమునకు ప్రతి పాద్య విషయమై ఉన్నది. 'ఘటోస్తి, ఘటోభాతి, ఘటఇష్ఠః,'ఇత్యాది లోక వ్యవహారముల యన్నింటియందును సచ్చిదానందములు ప్రకాశించుచున్నవి. 'ఘటోస్తి' ఘటము కలదను వ్యవహారము నందు సత్తయను,' ఘటోబాతి' ఘటము ప్రకాశించుచున్నది యను వ్యవహారమునందు ప్రకాశమని చెప్పబడు చిత్తూను, 'ఘటఇష్టః' ఘటము ఇష్టమైనది యను వ్యవహారమునందు ఆనందమును భాసించుచున్నందున బ్రహ్మయొక్క సచ్చిదానందాకారము సామాన్యముగా దెలియబడుచున్నదని అఖండ సచ్చిదానందత్వా ద్వితీయత్వా ద్యాకారము వేదాంతవాక్య విచారము చేసినగాని దెలియబడదని యెఱుంగునది.

     సంబంధించిన ఘటపటాదిపదార్ధములను సర్వము ప్రకాశించును. చిదా త్మ విస్పష్టముగా బ్రకాశింపనిచో దీపము లేని ఇంటిలో రాత్రికాలమే పదార్థమును భాసింపనటుల నొక పదార్థము సైతము భాసింపదు. కావున సర్వపదార్థము లకు బ్రకాశికమై దేహేంద్రియాది పదార్థముల కన్నింటికీ సాంతరమై సర్వసాక్షియై దేహేంద్రియాది సర్వప్రపంచా ద్యాసాధిష్టానంబైన చిదాత్మ యొక్క స్వరూప యాధార్డ్యము శారీరక భాష్యాదిగ్రంథములలో విస్తారముగా జెప్పబడి యున్నను చిదాత్మస్వరూప నిర్ణయార్థమై కావలసిన సందర్భమంతయు నొక్క చోటను జెప్పబడి యుండనందున బుభుత్సువుల బుద్ధి చిదాత్మ స్వరూప యాదార్ఢ్య మును త్వరలో దెలియజాలక చిక్కుపడునని యోచించి చిదాత్మ స్వరూపనిర్ణయము కొరకు కావలసిన సందర్భము నంతయును నే నీ గ్రంథములో నొక్కచో జేర్చి విస్పష్టముగా సంగ్రహముగ జెప్పుచున్నానని భావము. 

    ReplyDelete

గురు స్మరణతో, రామకార్యంగా తలచి, ఆత్మభావనలో స్థిరపడేందుకు కావల్సిన చిత్తశుద్ధికై, ఈ నిష్కామ కర్మ రూప అక్షరయజ్ఞాన్ని, శ్లోక తాత్పర్యాది భావాన్ని చక్కగా అవగాహన చేసికొనుచు చేయ ప్రయత్నిద్దాము..

పైనున్న శ్లోకము యొక్క అవతారికను, తాత్పర్యమును ఈ దిగువ టైపు చేసిన చాలును. శ్లోకము టైపు చేయవలసిన అవసరము లేదు.

సంఖ్యలో ఎన్ని ఎక్కువ చేశాము అనేకంటే, అక్షర దోషములు ఏ ఒక్కటి తలెత్తకుండా రోజుకు ఒక్కరు కనీసం ఒక్కశ్లోకం పూర్తిగా చేసినా చాలును. త్వరితగతిన ఈ గురుకార్యం సఫలీకృతమగునని విన్నవించడమైనది.