శ్లోకాలు
1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | 35 | 36 | 37 | 38 | 39 | 40 | 41 | 42 | 43 | 44 | 45 | 46 | 47 | 48 | 49 | 50 | 51 | 52 | 53 | 54 | 55 | 56 | 57 | 58 | 59 | 60 | 61 | 62 | 63 | 64 | 65 | 66 | 67 | 68 | 69 | 70 | 71 | 72 | 73 | 74 | 75 | 76 | 77 | 78 | 79 | 80 | 81 | 82 | 83 | 84 | 85 | 86 | 87 | 88 | 89 | 90 | 91 | 92 | 93 | 94 | 95 | 96 | 97 | 98 | 99 | 100 |
updates
2 comments:
గురు స్మరణతో, రామకార్యంగా తలచి, ఆత్మభావనలో స్థిరపడేందుకు కావల్సిన చిత్తశుద్ధికై, ఈ నిష్కామ కర్మ రూప అక్షరయజ్ఞాన్ని, శ్లోక తాత్పర్యాది భావాన్ని చక్కగా అవగాహన చేసికొనుచు చేయ ప్రయత్నిద్దాము..
పైనున్న శ్లోకము యొక్క అవతారికను, తాత్పర్యమును ఈ దిగువ టైపు చేసిన చాలును. శ్లోకము టైపు చేయవలసిన అవసరము లేదు.
సంఖ్యలో ఎన్ని ఎక్కువ చేశాము అనేకంటే, అక్షర దోషములు ఏ ఒక్కటి తలెత్తకుండా రోజుకు ఒక్కరు కనీసం ఒక్కశ్లోకం పూర్తిగా చేసినా చాలును. త్వరితగతిన ఈ గురుకార్యం సఫలీకృతమగునని విన్నవించడమైనది.
Subscribe to:
Posts (Atom)
అవ. ఈయర్థమునే శ్లోకముతో వివరింపుచున్నాడు. ------
ReplyDeleteదం - అ. నిత్యనైమిత్తికకర్మలు పాపము నశించుటయే ఫలముగాగల నైనందున మోక్షముకొఱకు గావు; కామ్యకర్మలును స్వర్గాదిఫలములతో సంబంధించి యున్నందున ఆప్రకారమే మోక్షముకొఱకుగావు.
తా. నిత్యనైమిత్తికకర్మలవలన మోక్షము దొరకునా, లేక కామ్యకర్మల వలన మోక్షముకలుగునా యని విచారింతము; నిత్యనైమిత్తికకర్మలను పాపక్షయమే ఫల మని పూర్వపక్షవాదియొక్క యభిప్రాయము. కావున వానికి మోక్షము ఫలమని చెప్పదగదు. కామ్యకర్మలను తత్తద్విధివాక్యములయందే స్వర్గపశుపుత్రవృష్ట్యన్నాది ఫలములు విధింపబడియున్నందున వానికి మోక్షము ఫలముకానేరదు అని భావము. ఇచ్చట సిద్ధాంతవాదిమతమునందు నిత్యనైమిత్తికకర్మలకు 'కర్మణా పితృలోకః' అనెడి శృతినిబట్టి స్వర్గమే ఫలమై యున్నది. పూర్వపక్షవాదిమతమునందును 'యేనకేనచనయజేత, అనుపహతమనా ఏవ భవతి' అనెడి శృతినిబట్టి పాపక్షయము ఫలమై యున్నది కావున మోక్షము ఫలము కాదని చెప్పినారు. అగ్నిహోత్రాదికర్మచేత పితృలోకము ప్రాప్తించును. ఏద్రవ్యముచేతనైనను యాగము చేయవలయును. పాపములచేత నాక్రమింపబడని చిత్తము కలవాడగును అని శృతిద్వయమున కర్థము.
అవ. ఈయర్థమునే శ్లోకముతో వివరింపుచున్నాడు. ------
ReplyDeleteదం - అ. నిత్యనైమిత్తికకర్మలు పాపము నశించుటయే ఫలముగాగల నైనందున మోక్షముకొఱకు గావు; కామ్యకర్మలును స్వర్గాదిఫలములతో సంబంధించి యున్నందున ఆప్రకారమే మోక్షముకొఱకుగావు.
తా. నిత్యనైమిత్తికకర్మలవలన మోక్షము దొరకునా, లేక కామ్యకర్మల వలన మోక్షముకలుగునా యని విచారింతము; నిత్యనైమిత్తికకర్మలను పాపక్షయమే ఫల మని పూర్వపక్షవాదియొక్క యభిప్రాయము.
కావున వానికి మోక్షము ఫలమని చెప్పదగదు. కామ్యకర్మలను తత్తద్విధి వాక్యములయందే స్వర్గపశుపుత్ర వృష్ట్యన్నాది ఫలములు విధింపబడి యున్నందున వానికి మోక్షము ఫలము కానేరదు అని భావము.
ఇచ్చట సిద్ధాంతవాదిమతమునందు నిత్యనైమిత్తిక కర్మలకు 'కర్మణా పితృలోకః' అనెడి శృతినిబట్టి స్వర్గమే ఫలమై యున్నది. పూర్వపక్షవాది మతమునందును 'యేన కేన చన యజేత, అనుప హతమనా ఏవ భవతి' అనెడి శృతినిబట్టి పాపక్షయము ఫలమై యున్నది , కావున మోక్షము ఫలము కాదని చెప్పినారు. అగ్నిహోత్రాది కర్మచేత పితృలోకము ప్రాప్తించును. ఏద్రవ్యముచేతనైనను యాగము చేయవలయును. పాపములచేత నాక్రమింపబడని చిత్తము కలవాడగును అని శృతిద్వయమున కర్థము.