శ్లోకాలు
1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | 35 | 36 | 37 | 38 | 39 | 40 | 41 | 42 | 43 | 44 | 45 | 46 | 47 | 48 | 49 | 50 | 51 | 52 | 53 | 54 | 55 | 56 | 57 | 58 | 59 | 60 | 61 | 62 | 63 | 64 | 65 | 66 | 67 | 68 | 69 | 70 | 71 | 72 | 73 | 74 | 75 | 76 | 77 | 78 | 79 | 80 | 81 | 82 | 83 | 84 | 85 | 86 | 87 | 88 | 89 | 90 | 91 | 92 | 93 | 94 | 95 | 96 | 97 | 98 | 99 | 100 |
updates
4 comments:
గురు స్మరణతో, రామకార్యంగా తలచి, ఆత్మభావనలో స్థిరపడేందుకు కావల్సిన చిత్తశుద్ధికై, ఈ నిష్కామ కర్మ రూప అక్షరయజ్ఞాన్ని, శ్లోక తాత్పర్యాది భావాన్ని చక్కగా అవగాహన చేసికొనుచు చేయ ప్రయత్నిద్దాము..
పైనున్న శ్లోకము యొక్క అవతారికను, తాత్పర్యమును ఈ దిగువ టైపు చేసిన చాలును. శ్లోకము టైపు చేయవలసిన అవసరము లేదు.
సంఖ్యలో ఎన్ని ఎక్కువ చేశాము అనేకంటే, అక్షర దోషములు ఏ ఒక్కటి తలెత్తకుండా రోజుకు ఒక్కరు కనీసం ఒక్కశ్లోకం పూర్తిగా చేసినా చాలును. త్వరితగతిన ఈ గురుకార్యం సఫలీకృతమగునని విన్నవించడమైనది.
Subscribe to:
Posts (Atom)
దం_ఆ.వేదములయెక్కసిద్థాంతముఆచార్యులచే జెప్పబడినది .ఆవేద సిద్దాంతము నందు సామర్థ్యము లేనందుననేనేమియు జెప్పజాలను.సూర్యునిచే వ్యాపింప బడిన(ప్రకాశింపజేయబడిన)విషయమునుమిణుగురుపురువుఏమిప్రకాశింపజేయగలదు?
ReplyDeleteతా_అస్మర్యమాణ కర్తృకంబులయునందునపురుషప్రణీతంబులు గాకయుండి
ReplyDeleteభ్రమ,విప్రలంభముమెదలగు దోషములకు దూరమై యన్నింటికిశ్రేష్ఠమగు ప్రమాణగ్రంథములైన వేదములనెల్లచక్కగా శోధించి,యాశోధనచేవెలువడిన సారమునుశారీరికభాష్యాదిగ్రంథములలోబ్రహ్మస్వరూప యాధార్థ్యగోచరంబైనసిధ్ధాంతమునిస్సందియముగామాగురువులచే ప్రతిపాదింపబడియున్నది.
ఆయర్థమున నే నెక్కువగా జెప్పున చెంత మాత్రము లేదు . అంత కధికముగజెప్పుటకును గాని, యంత మాత్రము చెప్పుటకు గాని నేను శక్తుడను గాను. సూర్యుడొక వస్తువును బ్రకాశింప జేయచుండగా మిణుగురుపురు వా వస్తువును తన శక్తిచే సూర్యుని కంటే యెక్కువగగాని యంత మాత్రము గాని ప్రకాశింప జేయదుకదా? శారీరక భాష్యాది గ్రంథములలో మాయా చార్యులు చెప్పిన యర్థము వేదముల యొక్క తాత్పర్యమే గావున దురుక్తముగానేరదు."శ్లో. గుశబ్ద స్వందకారస్యా ద్రుశబ్ద స్తన్నిరోధకః అంధకార నిరోధిత్వాద్గురురిత్యభిధీయతే"అను నిర్వచన ప్రకారము మా గురువులు అజ్ఞానాంధ కారముచే వ్యాపింప బడిన సంసార మహారణ్యంలో బడి దరిగానక యీదులాడుచున్న జనుల యజ్ఞానాంధకారమును బోగోట్టి రక్షించు కొరకు శారీరక భాష్యాది గ్రంథమును తీక్షణమైన సూర్య బింబమును కల్పించి రి.కావున మేక్షేచ్ఛాపరులు కపేక్షితములైన యర్థ ములనన్నిటిని జెప్పిరి గాని కొన్ని టిని చెప్పక పోయినది లేదు కావున దప్రామాణ్య బుద్ధిని జేయందగదనిభావము.గురు శబ్దము లోని'గు'అనునక్షరము అజ్ఞానాంధకారమును జెప్పును.'రు'అను నక్షరముదానియెక్క నివారణ మును జెప్పును.కావున నజ్జానాంధ కారమునునిరాకరించువారు గురువని చెప్పంబడుననినిర్వచన శ్లోకార్థము.
ReplyDeleteదం-అ. వేదములయెక్క సిద్థాంతము ఆచార్యులచే జెప్పబడినది .ఆ వేద సిద్దాంతము నందు సామర్థ్యము లేనందున నేనేమియు జెప్పజాలను. సూర్యునిచే వ్యాపింపబడిన (ప్రకాశింపజేయబడిన) విషయమును మిణుగురుపురువు లేమి ప్రకాశింప జేయగలదు?
ReplyDeleteతా. అస్మర్యమాణ కర్తృకంబులయునందున పురుషప్రణీతంబులు గాకయుండి
భ్రమ, విప్రలంభము మెదలగు దోషములకు దూరమై యన్నింటికి శ్రేష్ఠమగు ప్రమాణ గ్రంథములైన వేదములనెల్ల చక్కగా శోధించి, యాశోధనచే వెలువడిన సారమును శారీరికభాష్యాదిగ్రంథములలో బ్రహ్మస్వరూప యాధార్థ్యగోచరంబైన సిధ్ధాంతము నిస్సందియముగా మాగురువులచే ప్రతిపాదింపబడియున్నది.
ఆ యర్థమున నే నెక్కువగా జెప్పున దెంత మాత్రము లేదు . అంత కధికముగజెప్పుటకును గాని, యంత మాత్రము చెప్పుటకు గాని నేను శక్తుడను గాను. సూర్యుడొక వస్తువును బ్రకాశింప జేయచుండగా మిణుగురుపురు వా వస్తువును తన శక్తిచే సూర్యుని కంటే యెక్కువగగాని యంత మాత్రము గాని ప్రకాశింప జేయదు కదా?
శారీరక భాష్యాది గ్రంథములలో మాయా చార్యులు చెప్పిన యర్థము వేదముల యొక్క తాత్పర్యమే గావున దురుక్తము గానేరదు. "శ్లో. గుశబ్ద స్వంధకారస్యా ద్రుశబ్ద స్తన్నిరోధకః , అంధకార నిరోధిత్వాద్గురు రిత్యభిధీయతే" అను నిర్వచన ప్రకారము మా గురువులు అజ్ఞానాంధ కారముచే వ్యాపింప బడిన సంసార మహారణ్యంలో బడి దరిగానక యీదులాడుచున్న జనుల యజ్ఞానాంధకారమును బోగోట్టి రక్షించు కొరకు శారీరక భాష్యాది గ్రంథమును తీక్షణమైన సూర్య బింబమును కల్పించి రి. కావున మోక్షేచ్ఛాపరులు కపేక్షితములైన యర్థ ములనన్నిటిని జెప్పిరి గాని కొన్ని టిని చెప్పక పోయినది లేదు . కావున వారియం దప్రామాణ్య బుద్ధిని జేయందగదని భావము.
గురు శబ్దము లోని 'గు' అనునక్షరము అజ్ఞానాంధకారమును జెప్పును. 'రు' అను నక్షరము దానియెక్క నివారణ మును జెప్పును. కావున నజ్జానాంధ కారమును నిరాకరించువారు గురువని చెప్పంబడునని నిర్వచన శ్లోకార్థము.