శ్లోకాలు

1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | 35 | 36 | 37 | 38 | 39 | 40 | 41 | 42 | 43 | 44 | 45 | 46 | 47 | 48 | 49 | 50 | 51 | 52 | 53 | 54 | 55 | 56 | 57 | 58 | 59 | 60 | 61 | 62 | 63 | 64 | 65 | 66 | 67 | 68 | 69 | 70 | 71 | 72 | 73 | 74 | 75 | 76 | 77 | 78 | 79 | 80 | 81 | 82 | 83 | 84 | 85 | 86 | 87 | 88 | 89 | 90 | 91 | 92 | 93 | 94 | 95 | 96 | 97 | 98 | 99 | 100 |

updates

"నైష్కర్మ్య సిద్ధి" త్వరలో ఈ బ్లాగు మరింత ముస్తాబు కాగలదు. అప్పటి వరకూ సాధక మిత్రులు అనుభూతి ప్రకాశము అక్షరీకరణ కొనసాగించగలరని మనవి. మంగళకరమగు ఈ కార్యక్రమం నిర్విఘ్నంగా జరుగును గాక!! అక్షర యజ్ఞంలో తొలి అధ్యాయం నందలి 100 శ్లోకాల అవతారిక, దం.ఆ, తాత్పర్యాదుల అక్షరీకరణ దిగ్విజయముగా పూర్తికాబడినది.జయగురుదేవ!!

1-16



స్వసంప్రదాయస్య చోదితప్రమాణపూర్వకత్వజ్ఞాపనాయ
విశిష్టగుణసంబంధసంకీర్తనపూర్వికా గురోర్నమస్కారక్రియా

1-16

2 comments:

  1. adhirupalakshmi3 August 2020 at 02:00

    దం. అ. తనయొక్క విద్యాప్రాప్తికి ఆచార్యులే కారణమని దెలియజేయుకొఱకు యోగ్యంబులైన గుణములయొక్క సంబంధమును జేర్చుట మొదలైనగురువులకు నమస్కారముకూడ జేయబడుచున్నది.
    తా. "ఆచార్యదేవవిదితా విద్యాసాధిష్ఠంప్రాపత్ ఆచార్యవా పురుషోవేద " ఇత్యాది శ్రుతివచనములు, ' సద్గురు కటాక్షముచే బొందంపబడినవిద్యయే ఫలకారి ' యని చెప్పుచున్నది. అట్టి సదాచార్య సంప్రదాయక్రమముగ వచ్చినవిద్యయే లోకములో శిష్టులచే నాదరింపబడుచున్నది. కావున నీగ్రంథకర్త తనకు ప్రాప్తించినదియు నీగ్రంథములో తాను ప్రతిపాదించి బ్రహ్మవిద్య తనకు సదాచార్యోపదేశముచేతనే లభించినదిగాని స్వబుద్ధిచే నూహింపబడినదిగాదనియు దెలియజేయుచు నట్టి సదాచార్యుల మహాగుణములను కీర్తించి వారికి నమస్కారమును జేయుచున్నారు . పరదేవతా నమస్కారమునువలె గురునమస్కారముగూడ నావశ్యకర్తవ్యమని " యస్య దేవే పరాభక్తి: యథా దేవే తథా గురౌ, తస్త్యేతే కథితా హ్యర్ధా: ప్రకాశ్యంతే మహాత్మనః " అని శ్రుతిచెప్పుచున్నది. ఎవనికి పరమేశ్వరునియం దత్యంతభక్తిగలిగివుండునో అట్టి మహాపురుషునకే గురువుచే నుపదేశింపబడిన యర్ధంబులు ప్రకాశించును;
    అనగా ఫలించునని శ్రుత్య ర్థము, స్మృతి . ' ఆచినోతిహి శాస్త్రార్థ నాచారే స్థాపయత్యపి, స్వయమాచరతే యస్మా తస్మా దాచార్య ఉచ్చతే ". అని యాచార్యుల యొక్క లక్షణము స్మృతులయందు చెప్పబడియున్నది. వేదవేదాంగాదిశాస్త్రములయందు గలయర్థము లన్నింటిని బాగుగ విచారించి తెలిసికొని తన్నా యాశ్రయించినశిష్యుల కాయర్థముల నుపదేశించి ననుష్ఠింపజేయుచు తానుసైత యాయర్ధముల ననుష్ఠించువా డా చార్యడనబడునని స్మృతి వాక్యమున కర్థము. ఇందుచేత శాస్త్రప్రతిపాదితమైన యర్ధమును దెలిసి యుపదేశించువారే యాచార్యులుగాని స్వబుద్ధిచేత గొన్ని యర్ధముల నూహించి చెప్పువార లాచార్యులుగారని దెలియబడుచున్నది గ్రంథకర్తయును ఆచార్యపదమును బ్రయోగింపవలసినచోట నుదితప్రమాణపదమును ప్రయోగించి యీ యర్థమునే
    సూచించిరి. ప్రమాణమనగా యదార్థజ్ఞానమును గలుగుజేయువేదాంతవాక్యములు; వానిని ఉపదేశించి తత్వార్ధమును బోధించువార లాచార్యుని యుదిత ప్రమాణశబ్దమున కర్థము.
    అవ. ఆచార్యుల వలన తెలియబడినవిద్యయే శ్రేష్ఠమైనఫలమును పొందించును. ఆచార్యులుగలపురుషుడు బ్రహ్మతత్త్వము నెఱుఁ గును.

    ReplyDelete
  2. అవ. ఇంకను తరువాత శ్లోకమునకు తాత్పర్యమును చెప్పుచున్నారు----


    దం. అ. తనయొక్క విద్యాప్రాప్తికి ఆచార్యులే కారణమని దెలియజేయుకొఱకు యోగ్యంబులైన గుణములయొక్క సంబంధమును జేర్చుట మొదలైనగురువులకు నమస్కారముకూడ జేయబడుచున్నది.

    తా. "ఆచార్యదేవవిదితా విద్యాసాధిష్ఠంప్రాపత్ ఆచార్యవా పురుషోవేద " ఇత్యాది శ్రుతివచనములు, ' సద్గురు కటాక్షముచే బొందంపబడినవిద్యయే ఫలకారి ' యని చెప్పుచున్నది. అట్టి సదాచార్య సంప్రదాయక్రమముగ వచ్చినవిద్యయే లోకములో శిష్టులచే నాదరింపబడుచున్నది. కావున నీగ్రంథకర్త తనకు ప్రాప్తించినదియు నీగ్రంథములో తాను ప్రతిపాదించి బ్రహ్మవిద్య తనకు సదాచార్యోపదేశముచేతనే లభించినదిగాని స్వబుద్ధిచే నూహింపబడినదిగాదనియు దెలియజేయుచు నట్టి సదాచార్యుల మహాగుణములను కీర్తించి వారికి నమస్కారమును జేయుచున్నారు . 

                  పరదేవతా నమస్కారమునువలె గురునమస్కారముగూడ నావశ్యకర్తవ్యమని " యస్య దేవే పరాభక్తి: యథా దేవే తథా గురౌ, తస్త్యేతే కథితా హ్యర్ధా: ప్రకాశ్యంతే మహాత్మనః " అని శ్రుతిచెప్పుచున్నది. ఎవనికి పరమేశ్వరునియం దత్యంతభక్తిగలిగివుండునో అట్టి మహాపురుషునకే గురువుచే నుపదేశింపబడిన యర్ధంబులు ప్రకాశించును;

    అనగా ఫలించునని శ్రుత్య ర్థము.  స్మృతి . ' ఆచినోతిహి శాస్త్రార్థ నాచారే స్థాపయత్యపి, స్వయమాచరతే యస్మా తస్మా దాచార్య ఉచ్చతే ". అని యాచార్యుల యొక్క లక్షణము స్మృతులయందు చెప్పబడియున్నది. వేదవేదాంగాదిశాస్త్రములయందు గలయర్థము లన్నింటిని బాగుగ విచారించి తెలిసికొని తన్నా యాశ్రయించినశిష్యుల కాయర్థముల నుపదేశించి ననుష్ఠింపజేయుచు తానుసైత మా యర్ధముల ననుష్ఠించువా డా చార్యుడన బడునని స్మృతి వాక్యమున కర్థము. ఇందుచేత శాస్త్రప్రతిపాదితమైన యర్ధమును దెలిసి యుపదేశించువారే యాచార్యులుగాని స్వబుద్ధిచేత గొన్ని యర్ధముల నూహించి చెప్పువార లాచార్యులుగారని దెలియబడుచున్నది .  

              గ్రంథకర్తయును ఆచార్యపదమును బ్రయోగింపవలసినచోట నుదితప్రమాణపదమును ప్రయోగించి యీ యర్థమునే

    సూచించిరి. ప్రమాణమనగా యదార్థజ్ఞానమును గలుగుజేయువేదాంతవాక్యములు; వానిని ఉపదేశించి తత్వార్ధమును బోధించువార లాచార్యుని యుదిత ప్రమాణశబ్దమున కర్థము.


    అవ. ఆచార్యుల వలన తెలియబడినవిద్యయే శ్రేష్ఠమైనఫలమును పొందించును. ఆచార్యులుగలపురుషుడు బ్రహ్మతత్త్వము నెఱుఁ గును.


    ReplyDelete

గురు స్మరణతో, రామకార్యంగా తలచి, ఆత్మభావనలో స్థిరపడేందుకు కావల్సిన చిత్తశుద్ధికై, ఈ నిష్కామ కర్మ రూప అక్షరయజ్ఞాన్ని, శ్లోక తాత్పర్యాది భావాన్ని చక్కగా అవగాహన చేసికొనుచు చేయ ప్రయత్నిద్దాము..

పైనున్న శ్లోకము యొక్క అవతారికను, తాత్పర్యమును ఈ దిగువ టైపు చేసిన చాలును. శ్లోకము టైపు చేయవలసిన అవసరము లేదు.

సంఖ్యలో ఎన్ని ఎక్కువ చేశాము అనేకంటే, అక్షర దోషములు ఏ ఒక్కటి తలెత్తకుండా రోజుకు ఒక్కరు కనీసం ఒక్కశ్లోకం పూర్తిగా చేసినా చాలును. త్వరితగతిన ఈ గురుకార్యం సఫలీకృతమగునని విన్నవించడమైనది.