శ్లోకాలు

1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | 35 | 36 | 37 | 38 | 39 | 40 | 41 | 42 | 43 | 44 | 45 | 46 | 47 | 48 | 49 | 50 | 51 | 52 | 53 | 54 | 55 | 56 | 57 | 58 | 59 | 60 | 61 | 62 | 63 | 64 | 65 | 66 | 67 | 68 | 69 | 70 | 71 | 72 | 73 | 74 | 75 | 76 | 77 | 78 | 79 | 80 | 81 | 82 | 83 | 84 | 85 | 86 | 87 | 88 | 89 | 90 | 91 | 92 | 93 | 94 | 95 | 96 | 97 | 98 | 99 | 100 |

updates

"నైష్కర్మ్య సిద్ధి" త్వరలో ఈ బ్లాగు మరింత ముస్తాబు కాగలదు. అప్పటి వరకూ సాధక మిత్రులు అనుభూతి ప్రకాశము అక్షరీకరణ కొనసాగించగలరని మనవి. మంగళకరమగు ఈ కార్యక్రమం నిర్విఘ్నంగా జరుగును గాక!! అక్షర యజ్ఞంలో తొలి అధ్యాయం నందలి 100 శ్లోకాల అవతారిక, దం.ఆ, తాత్పర్యాదుల అక్షరీకరణ దిగ్విజయముగా పూర్తికాబడినది.జయగురుదేవ!!

1-6




దధ్యాసస్య చావిచారితసిద్ధద్వైతవస్తునిమిత్తత్వాత్‌ 
1-6

2 comments:

  1. శ్రీగురుభ్యోన్నమః
    అవ. వస్తువులయందు సుందరత్వాసుందరత్వముల యారోపణమును ననిత్యమైనందున స్వయముగా నివర్తించునని బొడమినసందేహమును పరిహరించుచున్నారు.--
    దం-అ.ఆరోపమునకును ఆపాతముగా దోచుచున్న భేదప్రపంచమే నిమిత్తముగా నున్నందున"నివృత్తిగలుగదు."
    తా.ఒకదానియందు మరియొకవస్తువునైనను, మరియొకవస్తువు ధర్మమునైనను నారోపించుట యధ్యాసమనబడు.ముత్యపుచిప్పనుజూచి దానిని వెండియని దలంచుట,త్రాటినిజూచి యది సర్పమని దలంచుటయును మొదటియధ్యాసమునకు దృష్టాంతము.
    శుద్ధమగు స్ఫటికమునుజూచి యది యెర్రనిస్ఫటికమని యెన్నుట రెండవయధ్యాసమునకు దృష్టాంతము.ఈయధ్యాసమే యారోపమనబడును.ఇట్టి యధ్యాసము భేదప్రపంచము నవలంబించియున్నందున భేదప్రపంచమే యధ్యాసమునకు గారణము.భేదప్రపంచములేక యొకవస్తువే యున్నచో దేనియందేది యారోపింపబడును?భేదప్రపంచము విచారించిచూచిన కనుపడనిదైయుండును.సామాన్యముగ జూచిన ప్రకాశించుచుండును.ఇట్టిభేదప్రపంచమే సుందరత్వాసుందరత్వాద్యధ్యాసమునకు కారణమైనందున భేదప్రపంచము వెలయుచుండువరకు నధ్యాసము నివర్తింపదని భావము.

    ReplyDelete
  2. అవ. వస్తువులయందు సుందరత్వాసుందరత్వముల యారోపణమును ననిత్యమైనందున స్వయముగా నివర్తించునని బొడమినసందేహమును పరిహరించుచున్నారు.--
    దం-అ.ఆరోపమునకును ఆపాతముగా దోచుచున్న భేదప్రపంచమే నిమిత్తముగా నున్నందున"నివృత్తిగలుగదు."
    తా.ఒకదానియందు మరియొకవస్తువునైనను, మరియొకవస్తువు ధర్మమునైనను నారోపించుట యధ్యాసమనబడు.ముత్యపుచిప్పనుజూచి దానిని వెండియని దలంచుట,త్రాటినిజూచి యది సర్పమని దలంచుటయును మొదటియధ్యాసమునకు దృష్టాంతము.
    శుద్ధమగు స్ఫటికమునుజూచి యది యెర్రనిస్ఫటికమని యెన్నుట రెండవయధ్యాసమునకు దృష్టాంతము.ఈయధ్యాసమే యారోపమనబడును.ఇట్టి యధ్యాసము భేదప్రపంచము నవలంబించియున్నందున భేదప్రపంచమే యధ్యాసమునకు గారణము.భేదప్రపంచము లేక యొకవస్తువే యున్నచో దేనియందేది యారోపింపబడును? భేదం ప్రపంచము విచారించిచూచిన కనుపడనిదై యుండును.సామాన్యముగ జూచిన ప్రకాశించుచుండును.ఇట్టి భేదప్రపంచమే సుందరత్వాసుందరత్వాద్యధ్యాసమునకు కారణమైనందున భేదప్రపంచము వెలయుచుండువరకు నధ్యాసము నివర్తింపదని భావము.

    ReplyDelete

గురు స్మరణతో, రామకార్యంగా తలచి, ఆత్మభావనలో స్థిరపడేందుకు కావల్సిన చిత్తశుద్ధికై, ఈ నిష్కామ కర్మ రూప అక్షరయజ్ఞాన్ని, శ్లోక తాత్పర్యాది భావాన్ని చక్కగా అవగాహన చేసికొనుచు చేయ ప్రయత్నిద్దాము..

పైనున్న శ్లోకము యొక్క అవతారికను, తాత్పర్యమును ఈ దిగువ టైపు చేసిన చాలును. శ్లోకము టైపు చేయవలసిన అవసరము లేదు.

సంఖ్యలో ఎన్ని ఎక్కువ చేశాము అనేకంటే, అక్షర దోషములు ఏ ఒక్కటి తలెత్తకుండా రోజుకు ఒక్కరు కనీసం ఒక్కశ్లోకం పూర్తిగా చేసినా చాలును. త్వరితగతిన ఈ గురుకార్యం సఫలీకృతమగునని విన్నవించడమైనది.