శ్లోకాలు
1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | 35 | 36 | 37 | 38 | 39 | 40 | 41 | 42 | 43 | 44 | 45 | 46 | 47 | 48 | 49 | 50 | 51 | 52 | 53 | 54 | 55 | 56 | 57 | 58 | 59 | 60 | 61 | 62 | 63 | 64 | 65 | 66 | 67 | 68 | 69 | 70 | 71 | 72 | 73 | 74 | 75 | 76 | 77 | 78 | 79 | 80 | 81 | 82 | 83 | 84 | 85 | 86 | 87 | 88 | 89 | 90 | 91 | 92 | 93 | 94 | 95 | 96 | 97 | 98 | 99 | 100 |
updates
2 comments:
గురు స్మరణతో, రామకార్యంగా తలచి, ఆత్మభావనలో స్థిరపడేందుకు కావల్సిన చిత్తశుద్ధికై, ఈ నిష్కామ కర్మ రూప అక్షరయజ్ఞాన్ని, శ్లోక తాత్పర్యాది భావాన్ని చక్కగా అవగాహన చేసికొనుచు చేయ ప్రయత్నిద్దాము..
పైనున్న శ్లోకము యొక్క అవతారికను, తాత్పర్యమును ఈ దిగువ టైపు చేసిన చాలును. శ్లోకము టైపు చేయవలసిన అవసరము లేదు.
సంఖ్యలో ఎన్ని ఎక్కువ చేశాము అనేకంటే, అక్షర దోషములు ఏ ఒక్కటి తలెత్తకుండా రోజుకు ఒక్కరు కనీసం ఒక్కశ్లోకం పూర్తిగా చేసినా చాలును. త్వరితగతిన ఈ గురుకార్యం సఫలీకృతమగునని విన్నవించడమైనది.
Subscribe to:
Posts (Atom)
అవ. శ్లోకము నుదాహరించుచున్నారు. ----
ReplyDeleteదం-అ. ఆకాశము, వాయువు, తేజస్సు, జలము, భూమి వీనియొక్కస్వరూపము పుష్పమాలికవలన సర్పమువలె యెవని వలన బుట్టెనో అట్టియజ్ఞానాంధకారమును నివర్తింపజేయువాడును, అంతఃకరణమునకు సాక్షియునైన పరమేశ్వరునకు నమస్కారమును జేయుచున్నాను.
తా. పృథివ్యప్తేజోవాయురాకాశంబులను పంచభూతములును, వీనికి కారణములైనసూక్ష్మభూతములైదును, వానికి కారణములగు ప్రకృతిమహదహంకారములును, వీనిచే నిర్మింపబడిన ఏకాదశేన్ద్రియములును పంచప్రాణములును, జరాయుజాండజ స్వేదజోధ్భిజ్జంబులను చతుర్విధభూతములును గలిగి విస్పష్టముగ గన్పట్టుచున్న యీ ప్రపంచమంతయు కనుచీకటిలోబడి యున్నపుష్పమాలికవలన సర్వము ప్రకాశించినటుల యెవనివలన బ్రకాశించుచున్నదో యట్టివాడు పరమాత్మ, అనగా మందాంధకారమున నున్నపుష్పమాలికను జూచినప్పుడు ఇది సర్పమని భ్రాంతియుదయించును. ఆసర్పభ్రాంతికి కారణము పుష్పమాలికయేగదా? ఆప్రకారమే యజ్ఞానావృతమగు పరమాత్మను జూడగా నిదిప్రపంచమని భ్రాంతి గలుగును. అట్టిప్రపంచభ్రాంతికి కారణము పరమాత్మయే యర్థము. అట్టిప్రపంచభ్రాంతికి కారణమై అంధకారమున సూర్యునివలె యజ్ఞానమునంతయు శేషములేక పోగొట్టువాడై జడములగుటచే స్వతఃప్రకాశించుయోగ్యతయు, నన్యములను ప్రకాశింపజేయుయోగ్యతయును లేకయుండిన యంతఃకరణవృత్తులకు ప్రకాశించు యోగ్యతను నన్యవిషయములను ప్రకాశింపజేయుయోగ్యతనుకూడ గలుగజేయుచున్నవాడై, పరమేశ్వరుడని వేదాంతములయందు ప్రసిద్ధముగా జెప్పబడుపరబ్రహ్మకొఱకు నమస్కారమును జేయుదుననిభావము. ఇందులో పరమేశ్వరనమస్కారరూపమైన మంగళము శబ్దశక్తిచేతనేగన్పట్టుచున్నది. జీవాత్మ పరమాత్మైక్యంబనే ప్రకరణమున చెప్పబడువిషయమును, అజ్ఞాననివృత్తియనే ప్రయోజనమును, అర్థశక్తిచే సూచింపబడుచున్నవి. అది యెట్లనిన, అంతఃకరణమునకు సాక్షియగు పరమేశ్వరునికొఱకు అనియే చెప్పినందున జీవాత్మపరమాత్మలయొక్క ఐక్యము సూచింపబడినది. అజ్ఞానాంధకారమును నశింపజేయువాడని చెప్పినందున నజ్ఞాననివృత్తియే ప్రయోజనమని సూచింపబడినది. మావితోబుట్టు మనుష్యాదిభూతములు జరాయుజములని, గ్రుడ్డులలోనుండిబుట్టు పక్షిసర్పాదిభూతము లండజములని, చెమటచేతను ఆవిరిచేతను బుట్టు మళకమత్కుణాదిభూతములు స్వేదజంబులని, భూమిని ఛేదించుకొనిపుట్టు తరుగుల్మలతాదులు ఉద్భిజ్జంబులనియు జెప్పబడును.
1-15
ReplyDeleteఖానిలాగ్న్యబ్ధరిత్ర్యంతం స్రక్ఫణీవోద్గతం యతః
ధ్వాంతచ్ఛిదే నమస్తస్మై హరయే బుద్ధిసాక్షిణే 1
1-15
అవ. శ్లోకము నుదాహరించుచున్నారు. ----
దం-అ. ఆకాశము, వాయువు, తేజస్సు, జలము, భూమి వీనియొక్కస్వరూపము పుష్పమాలికవలన సర్పమువలె యెవని వలన బుట్టెనో అట్టియజ్ఞానాంధకారమును నివర్తింపజేయువాడును, అంతఃకరణమునకు సాక్షియునైన పరమేశ్వరునకు నమస్కారమును జేయుచున్నాను.
తా. పృథివ్యప్తేజోవాయురాకాశంబులను పంచభూతములును, వీనికి కారణములైనసూక్ష్మభూతములైదును, వానికి కారణములగు ప్రకృతిమహదహంకారములును, వీనిచే నిర్మింపబడిన ఏకాదశేన్ద్రియములును పంచప్రాణములును, జరాయుజాండజ స్వేదజోధ్భిజ్జంబులను చతుర్విధభూతములును గలిగి విస్పష్టముగ గన్పట్టుచున్న యీ ప్రపంచమంతయు కనుచీకటిలోబడి యున్నపుష్పమాలికవలన సర్వము ప్రకాశించినటుల యెవనివలన బ్రకాశించుచున్నదో యట్టివాడు పరమాత్మ, అనగా మందాంధకారమున నున్నపుష్పమాలికను జూచినప్పుడు ఇది సర్పమని భ్రాంతియుదయించును. ఆసర్పభ్రాంతికి కారణము పుష్పమాలికయేగదా? ఆప్రకారమే యజ్ఞానావృతమగు పరమాత్మను జూడగా నిదిప్రపంచమని భ్రాంతి గలుగును. అట్టిప్రపంచభ్రాంతికి కారణము పరమాత్మయే యర్థము. అట్టిప్రపంచభ్రాంతికి కారణమై అంధకారమున సూర్యునివలె యజ్ఞానమునంతయు శేషములేక పోగొట్టువాడై జడములగుటచే స్వతఃప్రకాశించుయోగ్యతయు, నన్యములను ప్రకాశింపజేయుయోగ్యతయును లేకయుండిన యంతఃకరణవృత్తులకు ప్రకాశించు యోగ్యతను నన్యవిషయములను ప్రకాశింపజేయుయోగ్యతనుకూడ గలుగజేయుచున్నవాడై, పరమేశ్వరుడని వేదాంతములయందు ప్రసిద్ధముగా జెప్పబడుపరబ్రహ్మకొఱకు నమస్కారమును జేయుదుననిభావము. ఇం
ఇందులో పరమేశ్వర నమస్కార రూపమైన మంగళము శబ్దశక్తిచేతనేగన్పట్టుచున్నది. జీవాత్మ పరమాత్మైక్యంబనే ప్రకరణమున చెప్పబడువిషయమును, అజ్ఞాననివృత్తియనే ప్రయోజనమును, అర్థశక్తిచే సూచింపబడుచున్నవి. అది యెట్లనిన, అంతఃకరణమునకు సాక్షియగు పరమేశ్వరునికొఱకు అనియే చెప్పినందున జీవాత్మపరమాత్మలయొక్క ఐక్యము సూచింపబడినది. అజ్ఞానాంధకారమును నశింపజేయువాడని చెప్పినందున నజ్ఞాననివృత్తియే ప్రయోజనమని సూచింపబడినది. మావితోబుట్టు మనుష్యాదిభూతములు జరాయుజములని, గ్రుడ్డులలోనుండిబుట్టు పక్షిసర్పాదిభూతము లండజములని, చెమటచేతను ఆవిరిచేతను బుట్టు మళకమత్కుణాదిభూతములు స్వేదజంబులని, భూమిని ఛేదించుకొనిపుట్టు తరుగుల్మలతాదులు ఉద్భిజ్జంబులనియు జెప్పబడును.