శ్లోకాలు

1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | 35 | 36 | 37 | 38 | 39 | 40 | 41 | 42 | 43 | 44 | 45 | 46 | 47 | 48 | 49 | 50 | 51 | 52 | 53 | 54 | 55 | 56 | 57 | 58 | 59 | 60 | 61 | 62 | 63 | 64 | 65 | 66 | 67 | 68 | 69 | 70 | 71 | 72 | 73 | 74 | 75 | 76 | 77 | 78 | 79 | 80 | 81 | 82 | 83 | 84 | 85 | 86 | 87 | 88 | 89 | 90 | 91 | 92 | 93 | 94 | 95 | 96 | 97 | 98 | 99 | 100 |

updates

"నైష్కర్మ్య సిద్ధి" త్వరలో ఈ బ్లాగు మరింత ముస్తాబు కాగలదు. అప్పటి వరకూ సాధక మిత్రులు అనుభూతి ప్రకాశము అక్షరీకరణ కొనసాగించగలరని మనవి. మంగళకరమగు ఈ కార్యక్రమం నిర్విఘ్నంగా జరుగును గాక!! అక్షర యజ్ఞంలో తొలి అధ్యాయం నందలి 100 శ్లోకాల అవతారిక, దం.ఆ, తాత్పర్యాదుల అక్షరీకరణ దిగ్విజయముగా పూర్తికాబడినది.జయగురుదేవ!!

1-32





ముక్తేః క్రియాభిః సిద్ధత్వాజ్జ్ఞానం తత్ర కరోతి కిం
కథం చేచ్ఛృణు తత్సర్వం ప్రణిధాయ మనో యథా 9

1-32

4 comments:

  1. అవ. పూర్వపక్షం భాట్ట మతము ననుసరించి చేయబడుచున్నది.
    దం.అ. మోక్షము కర్తల చేతనే సిద్ధించుచుండ జ్ఞానము ఆ మోక్షమునం దేమి చేయును? ఏ విధమైనినచో దానినంతయును చెప్పెద. మనస్సును వాస్తవముగా నేకాగ్రముచేసి వినుము.

    ReplyDelete
  2. తా. తత్వజ్ఞానమును, వేదాంతవాక్యశ్రవణముచే సంపాదించుకొనినవారు సైతం "యావజ్జీవ అగ్నిహోత్రం జుహొతి,అహరహ స్సంధ్యా ముపాసీత" మొదలగుశృతివాక్యములచే విధింపబడుతున్న సంధ్యావందనాగ్నిహోత్రాది కర్మల నవశ్యము చేయవలయునుగదా? వాని త్యజించిన "వీరహావవిష" ఇత్యాదిశృతులు మహాపాతకము గలుగుచున్నదనిగదా చెప్పుచున్నవి. కావున నవశ్యకర్తవ్యములైన నిత్యనైమిత్తిక

    ReplyDelete
  3. కర్మల చేతనే మోక్షము సంభవించుచుండగా తత్వజ్ఞానముతో ప్రయోజనము లేనందున తత్వజ్ఞానమే మోక్ష సాధనమని చెప్పదగదు. మోక్షము నిత్యమనిగదా చెప్పబడుచున్నది. అట్టి మోక్షము కర్మలచే సాధింపబడిన అనిత్యముకాదా యని మాక్షేపింపదగదు. ఆత్మ యొక్క స్వరూప స్థానమే మోక్ష మబడును. అది నిత్యసిద్ధము గావున కర్మలచే సాధింపబడినదికాదు .ఆయిన అట్టి స్వరూపావస్థానమునకు అనాది కర్మఫలా నుభవము ప్రతిబంధకమైయున్నది. అట్టి ప్రతిబంధకము నిర్వర్తించిన స్వతస్సిద్ధమైన స్వరూపావస్థానము గోచరించును. ప్రతిబంధకమును నివర్తింపచేయుట కర్మ సాధ్యంబుగాని స్వరూపావస్థానము కర్మసాధ్యము కానేరదు .కావున మోక్షమును కనిత్యమురాదు .ఈయర్థమునంతయు విస్తారముగా నిరూపించెను.సావధానచిత్తులర్తె వినుండని భావము .బ్రతికి యుండు వరకు అగ్నిహోత్రమును చేయవలసినవది. ప్రతిదినమును సంధ్యావందమును చేయవలసినవది. అగ్నిహోత్రము చేయనివాడు బ్రహ్మహత్యచేసిన వాడవుడవువని శ్రుతుల అర్థము.

    ReplyDelete
  4. అవ. పూర్వపక్షం భాట్ట మతము ననుసరించి చేయబడుచున్నది.


    దం.అ. మోక్షము కర్తల చేతనే సిద్ధించుచుండ జ్ఞానము ఆ మోక్షమునం దేమి చేయును? ఏ విధమనినచో దానినంతయును చెప్పెద. మనస్సును వాస్తవముగా నేకాగ్రముచేసి వినుము.


    తా. తత్వజ్ఞానమును, వేదాంతవాక్యశ్రవణముచే సంపాదించుకొనినవారు సైతం "యావజ్జీవ అగ్నిహోత్రం జుహొతి,అహరహ స్సంధ్యా ముపాసీత" మొదలగుశృతివాక్యములచే విధింపబడుతున్న సంధ్యావందనాగ్నిహోత్రాది కర్మల నవశ్యము చేయవలయునుగదా? 

             వాని త్యజించిన "వీరహావవిష" ఇత్యాది శృతులు మహాపాతకము గలుగుచున్నదని గదా చెప్పుచున్నవి. కావున నవశ్య కర్తవ్యములైన నిత్యనైమిత్తిక కర్మల చేతనే మోక్షము సంభవించుచుండగా తత్వజ్ఞానముతో ప్రయోజనము లేనందున తత్వజ్ఞానమే మోక్ష సాధనమని చెప్పదగదు. మోక్షము నిత్యమనిగదా చెప్పబడుచున్నది. 

           అట్టి మోక్షము కర్మలచే సాధింపబడిన అనిత్యముకాదా యని మాక్షేపింపదగదు. ఆత్మ యొక్క స్వరూప స్థానమే మోక్ష మబడును. అది నిత్యసిద్ధము గావున కర్మలచే సాధింపబడినదికాదు . ఆయిన అట్టి స్వరూపావస్థానమునకు అనాది కర్మఫలా నుభవము ప్రతిబంధకమైయున్నది. అట్టి ప్రతిబంధకము నిర్వర్తించిన స్వతస్సిద్ధమైన స్వరూపావస్థానము గోచరించును. ప్రతిబంధకమును నివర్తింపచేయుట కర్మ సాధ్యంబుగాని స్వరూపావస్థానము కర్మసాధ్యము కానేరదు .కావున మోక్షమునకు అనిత్యత్యము రాదు . ఈయర్థమునంతయు విస్తారముగా నిరూపించెను. సావధానచిత్తులర్తె వినుండని భావము . బ్రతికి యుండు వరకు అగ్నిహోత్రమును చేయవలసినవది. ప్రతిదినమును సంధ్యావందమును చేయవలసినవది. అగ్నిహోత్రము చేయనివాడు బ్రహ్మహత్యచేసిన వాడవునని శ్రుతుల అర్థము.


    ReplyDelete

గురు స్మరణతో, రామకార్యంగా తలచి, ఆత్మభావనలో స్థిరపడేందుకు కావల్సిన చిత్తశుద్ధికై, ఈ నిష్కామ కర్మ రూప అక్షరయజ్ఞాన్ని, శ్లోక తాత్పర్యాది భావాన్ని చక్కగా అవగాహన చేసికొనుచు చేయ ప్రయత్నిద్దాము..

పైనున్న శ్లోకము యొక్క అవతారికను, తాత్పర్యమును ఈ దిగువ టైపు చేసిన చాలును. శ్లోకము టైపు చేయవలసిన అవసరము లేదు.

సంఖ్యలో ఎన్ని ఎక్కువ చేశాము అనేకంటే, అక్షర దోషములు ఏ ఒక్కటి తలెత్తకుండా రోజుకు ఒక్కరు కనీసం ఒక్కశ్లోకం పూర్తిగా చేసినా చాలును. త్వరితగతిన ఈ గురుకార్యం సఫలీకృతమగునని విన్నవించడమైనది.