శ్లోకాలు
1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | 35 | 36 | 37 | 38 | 39 | 40 | 41 | 42 | 43 | 44 | 45 | 46 | 47 | 48 | 49 | 50 | 51 | 52 | 53 | 54 | 55 | 56 | 57 | 58 | 59 | 60 | 61 | 62 | 63 | 64 | 65 | 66 | 67 | 68 | 69 | 70 | 71 | 72 | 73 | 74 | 75 | 76 | 77 | 78 | 79 | 80 | 81 | 82 | 83 | 84 | 85 | 86 | 87 | 88 | 89 | 90 | 91 | 92 | 93 | 94 | 95 | 96 | 97 | 98 | 99 | 100 |
updates
10 comments:
గురు స్మరణతో, రామకార్యంగా తలచి, ఆత్మభావనలో స్థిరపడేందుకు కావల్సిన చిత్తశుద్ధికై, ఈ నిష్కామ కర్మ రూప అక్షరయజ్ఞాన్ని, శ్లోక తాత్పర్యాది భావాన్ని చక్కగా అవగాహన చేసికొనుచు చేయ ప్రయత్నిద్దాము..
పైనున్న శ్లోకము యొక్క అవతారికను, తాత్పర్యమును ఈ దిగువ టైపు చేసిన చాలును. శ్లోకము టైపు చేయవలసిన అవసరము లేదు.
సంఖ్యలో ఎన్ని ఎక్కువ చేశాము అనేకంటే, అక్షర దోషములు ఏ ఒక్కటి తలెత్తకుండా రోజుకు ఒక్కరు కనీసం ఒక్కశ్లోకం పూర్తిగా చేసినా చాలును. త్వరితగతిన ఈ గురుకార్యం సఫలీకృతమగునని విన్నవించడమైనది.
Subscribe to:
Posts (Atom)
శ్రీ గురుభ్యోన్నమః ఈ పేజీ నేను చేస్తున్నాను.
ReplyDeleteఆవ.ఈ విధముగా ప్రయోజనసహితంబైన సంశయమును గనుపరచి నిర్ణయము చేయుచున్నారు.
ReplyDeleteదం అ.అజ్ఞానమువలన అనుకూలవిషయమును పొందగోరు చుండువారికిని ప్రతికూలవిషయమును పరిహరింప గోరుచుండు వారికిని వానియొక్క లాభ పరిత్యాగములే ప్రయోజనముగాగల సాధనములను శాస్త్రము సూర్యునివలె ప్రకాశింపజేయుచున్నవి.
తా. ఆత్మస్వరూపము సర్వకాల సర్వావస్థలయందును నిరస్తనిఖిల
ReplyDeleteదుఃఖమై పరమానందఘనమైయుండు. వీనిలో పరమానందఘనమై యున్నదని యెట్లు తెలియవచ్చు ననిన జాగ్రదవస్థలో ప్రక్చందనవనితా పదార్థములయొక్క సంశ్లేషము సుఖ జనకమైనటులు గాన్పించు చుండిననూ గాఢ సుషుప్తియందు ఏ పదార్థముయొక్క సంశ్లేషము లేకపోయినను మహాసుఖ మనుభవింపబడుచున్నది. నిద్రలోనుండి
లేచినపిదప నింతకాలము మహాసుఖముగా నిదురపోయితినని మనమందరము ననుభవింపుచున్నాముకదా? ఇట్టి సుఖము ఆత్మ స్వరూపమునందుండు సుఖమేగాని విషయజనితసుఖముగాదని నిశ్చయముగా చెప్పవచ్చును.
ఇదిగాక మనకెల్లరకు గృహక్షేత్రపుత్రకళత్రాదులకంటె ఆత్మయందు ప్రేమ హెచ్చుగా గన్పట్టుచున్నది. గృహక్షేత్రపుత్రకళత్రాదులు మన
ReplyDeleteకుపకారములని వానియందు ప్రేమను చేయచున్నాము. ఆత్మయందు నిష్కారణముగగదా ప్రేమనుజేయుచున్నాము గావున ఈ రెండు కారణములనుబట్టి ఆత్మ పరమానంద స్వరూపమని తెలియవలయు.
"ఏషోస్య పరమ ఆనందః, ఆత్మైవానందః" ఇత్యాది శృతి వాక్యములు ఆత్మ పరమాత్మస్వరూపుడని తెలియజేయుచున్నవి. "అసంగోహ్యయం పురుషః ఆత్మా జరో మరో భయో అమృతః తస్య భాసా సర్వమిదం విభాతి" ఇత్యాదిశ్రుతులు ఆత్మస్వరూపము నిర్వికారమని, అసంగమని, స్వప్రకాశమని ప్రతిపాదించి సహజముగా నిరస్తసమస్తానర్థములుకలదని చెప్పుచున్నవి గావున ఇట్టి నిరస్తనిఖిలదుఃఖనిరతి
ReplyDeleteశయానందంబైన ఆత్మస్వరూపము అనాద్యవిద్యాఆవృతంబై యున్నందున దానిని దెలియంజాలక తమకు కొన్ని యనర్థములు సంభవించియున్నవనియు వానిని పరిహరించుకొనవలయునని కొన్ని సుఖవిశేషములు లేవనియు వానిని పొందవలయునని జనులు కోరుచుందురు.
ఇట్టిజనులయొక్క అనాద్యజ్ఞానసిద్ధంబైనకోరిక ననుసరించి తత్తదనర్థ పరిహారంబునకును తత్సుఖప్రాప్తికిని యోగ్యములగుసాధనములను వేదము ప్రకాశింపజేయును.
ReplyDeleteఅనగా నభిమతములగు నాయాగ్రామములకు బోవదలంచి రాత్రివేళ చీకటిచేత తత్తగ్రామమార్గములు దెలియక జిక్కువడుజనులకు సూర్యుడు తాను ఉదయించి ఆయాగ్రామమార్గములను మాత్రము ప్రకాశింపజేయునుగాని మార్గములను నిర్మించుటను మార్గములయందు జనులను నడిపించుటను చేయడుకదా?
ReplyDeleteఆ ప్రకారమే ఆత్మస్వరూప యాదార్థ్యముతెలియక సుఖము అప్రాప్తమని దుఃఖముప్రాప్తమని దలంచి సుఖప్రాప్తికొరకు దుఃఖనివృత్తి కొరకును ప్రయత్నమునుజేయుచు వానికి సాధనములేవియో యెరుంగక చిక్కువడుచున్నవారలకు ఇట్టిసుఖమును పొందుటకిది సాధనమని ఇట్టి దుఃఖమును పోగొట్టుకొనుటకిది సాధనమని మాత్రము ప్రకాశింప జేయును.
ReplyDeleteఇంతమాత్రమేగాని శాస్త్రము తానే మీరు కర్తలు భోక్తలు మీకు బొందదగిన సుఖముగలదు, నిరాకరింపదగిన దుఃఖముగలదు గావున మీరు సుఖమును సంపాదించుకొనుడు, దుఃఖము నిరాకరించుకొనుడు, మీరు వర్ణాశ్రమాదిధర్మములు గలవారని ఈ యీప్రకారము ధర్మము బోథించి జనులను ప్రవృత్తినివృత్తి మార్గములయందు సంచరింపజేయదని భావము.
ReplyDeleteఅవ. ఈ విధముగా ప్రయోజన సహితంబైన సంశయమును గనుపరచి నిర్ణయము చేయుచున్నారు.
ReplyDeleteదం అ.అజ్ఞానమువలన అనుకూలవిషయమును పొందగోరు చుండువారికిని ప్రతికూల విషయమును పరిహరింప గోరుచుండు వారికిని వానియొక్క లాభ పరిత్యాగములే ప్రయోజనముగాగల సాధనములను శాస్త్రము సూర్యునివలె ప్రకాశింపజేయుచున్నవి.
తా. ఆత్మస్వరూపము సర్వకాల సర్వావస్థల యందును నిరస్తనిఖిల దుఃఖమై పరమానంద ఘనమైయుండు. వీనిలో పరమానంద ఘనమై యున్నదని యెట్లు తెలియవచ్చు ననిన జాగ్రదవస్థలో స్రక్చందన వనితా పదార్థముల యొక్క సంశ్లేషము సుఖ జనకమైనటులు గాన్పించు చుండిననూ , గాఢ సుషుప్తియందు ఏ పదార్థముయొక్క సంశ్లేషము లేకపోయినను మహాసుఖ మనుభవింప బడుచున్నది.
నిద్రలోనుండి లేచినపిదప నింతకాలము మహాసుఖముగా నిదురపోయితినని మనమందరము ననుభవింపుచున్నాము కదా? ఇట్టి సుఖము ఆత్మ స్వరూపమునందుండు సుఖమేగాని విషయ జనిత సుఖము గాదని నిశ్చయముగా చెప్పవచ్చును.
ఇదిగాక మన కెల్లరకు గృహక్షేత్ర పుత్రకళత్రాదుల కంటె ఆత్మయందు ప్రేమ హెచ్చుగా గన్పట్టుచున్నది. గృహక్షేత్ర పుత్రకళత్రాదులు మనకుపకారములని వాని యందు ప్రేమను చేయచున్నాము. ఆత్మయందు నిష్కారణముగ గదా ప్రేమను జేయుచున్నాము గావున ఈ రెండు కారణములను బట్టి ఆత్మ పరమానంద స్వరూపమని తెలియవలయును.
"ఏషోస్య పరమ ఆనందః, ఆత్మైవానందః" ఇత్యాది శృతి వాక్యములు ఆత్మ పరమాత్మస్వరూపుడని తెలియజేయుచున్నవి. "అసంగోహ్యయం పురుషః ఆత్మా జరో మరో భయో అమృతః తస్య భాసా సర్వమిదం విభాతి" ఇత్యాదిశ్రుతులు ఆత్మస్వరూపము నిర్వికారమని, అసంగమని, స్వప్రకాశమని ప్రతిపాదించి సహజముగా నిరస్త సమస్తానర్థములు కలదని చెప్పుచున్నవి గావున ఇట్టి నిరస్త నిఖిల దుఃఖనిరతిశయానందంబైన ఆత్మస్వరూపము అనాద్యవిద్యావృతంబై యున్నందున దానిని దెలియంజాలక తమకు కొన్ని యనర్థములు సంభవించి యున్నవనియు వానిని పరిహరించు కొనవలయునని కొన్ని సుఖవిశేషములు లేవనియు వానిని పొందవలయునని జనులు కోరుచుందురు.
ఇట్టిజనులయొక్క అనాద్యజ్ఞానసిద్ధంబైనకోరిక ననుసరించి తత్తదనర్థ పరిహారంబునకును తత్సుఖప్రాప్తికిని యోగ్యములగు సాధనములను వేదము ప్రకాశింపజేయును.
అనగా నభిమతములగు నాయాగ్రామములకు బోవదలంచి రాత్రివేళ చీకటిచేత తత్తద్గ్రామ మార్గములు దెలియక జిక్కువడు జనులకు సూర్యుడు తాను ఉదయించి ఆయా గ్రామమార్గములను మాత్రము ప్రకాశింపజేయును గాని మార్గములను నిర్మించుటను మార్గములయందు జనులను నడిపించుటను చేయడుకదా?
ఆ ప్రకారమే ఆత్మస్వరూప యథార్థ్యము తెలియక సుఖము అప్రాప్తమని , దుఃఖము ప్రాప్తమని దలంచి సుఖప్రాప్తి కొరకు దుఃఖనివృత్తి కొరకును ప్రయత్నమునుజేయుచు వానికి సాధనములేవియో యెరుంగక చిక్కువడుచున్నవారలకు ఇట్టిసుఖమును పొందుటకిది సాధనమని, ఇట్టి దుఃఖమును పోగొట్టుకొనుటకిది సాధనమని మాత్రము ప్రకాశింప చేయును.
ఇంత మాత్రమేగాని శాస్త్రము తానే ...మీరు కర్తలు భోక్తలు మీకు బొందదగిన సుఖముగలదు, నిరాకరింపదగిన దుఃఖముగలదు గావున మీరు సుఖమును సంపాదించుకొనుడు, దుఃఖము నిరాకరించుకొనుడు, మీరు వర్ణాశ్రమాదిధర్మములు గలవారని ఈ యీప్రకారము ధర్మము బోథించి జనులను ప్రవృత్తినివృత్తి మార్గములయందు సంచరింపజేయదని భావము.