శ్లోకాలు
1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | 35 | 36 | 37 | 38 | 39 | 40 | 41 | 42 | 43 | 44 | 45 | 46 | 47 | 48 | 49 | 50 | 51 | 52 | 53 | 54 | 55 | 56 | 57 | 58 | 59 | 60 | 61 | 62 | 63 | 64 | 65 | 66 | 67 | 68 | 69 | 70 | 71 | 72 | 73 | 74 | 75 | 76 | 77 | 78 | 79 | 80 | 81 | 82 | 83 | 84 | 85 | 86 | 87 | 88 | 89 | 90 | 91 | 92 | 93 | 94 | 95 | 96 | 97 | 98 | 99 | 100 |
updates
2 comments:
గురు స్మరణతో, రామకార్యంగా తలచి, ఆత్మభావనలో స్థిరపడేందుకు కావల్సిన చిత్తశుద్ధికై, ఈ నిష్కామ కర్మ రూప అక్షరయజ్ఞాన్ని, శ్లోక తాత్పర్యాది భావాన్ని చక్కగా అవగాహన చేసికొనుచు చేయ ప్రయత్నిద్దాము..
పైనున్న శ్లోకము యొక్క అవతారికను, తాత్పర్యమును ఈ దిగువ టైపు చేసిన చాలును. శ్లోకము టైపు చేయవలసిన అవసరము లేదు.
సంఖ్యలో ఎన్ని ఎక్కువ చేశాము అనేకంటే, అక్షర దోషములు ఏ ఒక్కటి తలెత్తకుండా రోజుకు ఒక్కరు కనీసం ఒక్కశ్లోకం పూర్తిగా చేసినా చాలును. త్వరితగతిన ఈ గురుకార్యం సఫలీకృతమగునని విన్నవించడమైనది.
Subscribe to:
Posts (Atom)
అవ. ఆశ్లోక మేదియనిన చెప్పుచున్నారు.____
ReplyDeleteశ్లో. నఖ్యాతి లాభ పూజార్థం గ్రంథోఽస్మాభి రుదీర్యతే,
స్వబోధపరిశుద్ధ్యర్థం బ్రహ్మవిన్నికషాశ్మసు ౬ ౨౫
దం-అ. ఖ్యాతి లాభపూజకొఱకు మాదే గ్రంథము చెప్పఁబడినదికాదు. బ్రహ్మవేత్తలను సానలయందు మాజ్ఞానమును పరిశుద్ధముగాఁ జేసికొనుటకొఱకుఁ జేయఁబడుచున్నది.
తా. ఖ్యాతి లాభపూజనలకై యీగ్రంథము చెప్పఁబడలేదు.అందులకని నేనీ గ్రంథమును రచియింపలేదు. ఆచార్యానుగ్రహముచే లభించిన నాతత్త్వజ్ఞానమును బ్రహ్మవేత్తలకుఁ దెలియఁజేసి యగృహీతాంశ మేటియైననున్నచో దానిని పూర్తిజేసికొని తత్త్వజ్ఞానమును శుద్ధమైనదిగఁ జేసికొనుటకొఱకే యీగ్రంథమును రచించితిని. బంగారపుతునక యెంతవన్నెగలదో దెలియంగోరువారు ముందుగా సానరాతియందు ఆబంగారపుతునక నొరసిచూచి వన్నెతక్కువగానుండినచో మఱియొకపుటమునువేసి వర్ణమును సంపూర్ణమైనది యగునట్లు చేయుచున్నారు. వన్నె పూర్తిగనుండిన యూరకుందురు. ఆప్రకారమే నే నాచార్యోపదేశముచే లభించిన తత్త్వజ్ఞానము సంపూర్ణముగనున్నదా? కొదువగనున్నదా? యని తెలియంగోరి బ్రహ్మవేత్తలు నాతత్త్వజ్ఞానమును పరీక్షించుటకు నీగ్రంథమును రచియించితిని. గ్రంథమును రచియింపనిచో బ్రహ్మవేత్తలకు నాతత్త్వజ్ఞానముయొక్క పూర్ణత్వాపూర్ణత్వము లెట్లు దెలియును? బ్రహ్మవేత్తలు నాజే రచియింపఁబడిన గ్రంథమునుజూచి తత్త్వజ్ఞానము సంపూర్ణమని చెప్పినచో నేను కృతకృత్యుండనని సంతసించెదను. కొదువగానున్నదనిన నాకొదువను మరల యాచార్యోపదేశముచే పూర్ణముచేసికొని కృతకృత్యుండ నగుదు ననునభిప్రాయముతో నీగ్రంథమును రచియించుచున్నానని భావము.
దం-అ. ఖ్యాతి లాభపూజకొఱకు మాచే గ్రంథము చెప్పఁబడినదికాదు. బ్రహ్మవేత్తలను సానలయందు మా జ్ఞానమును పరిశుద్ధముగాఁ జేసికొనుటకొఱకుఁ జేయఁబడుచున్నది.
ReplyDeleteతా. ఖ్యాతి లాభపూజనలకై యీగ్రంథము చెప్పఁబడలేదు.అందులకని నేనీ గ్రంథమును రచియింపలేదు. ఆచార్యానుగ్రహముచే లభించిన నాతత్త్వజ్ఞానమును బ్రహ్మవేత్తలకుఁ దెలియఁజేసి , యగృహీతాంశ మేదియైననున్నచో దానిని పూర్తిజేసికొని తత్త్వజ్ఞానమును శుద్ధమైనదిగఁ జేసికొనుటకొఱకే యీగ్రంథమును రచించితిని.
బంగారపుతునక యెంతవన్నెగలదో దెలియంగోరువారు ముందుగా సానరాతియందు ఆబంగారపుతునక నొరసి చూచి వన్నెతక్కువగానుండినచో మఱియొక పుటమును వేసి వర్ణమును సంపూర్ణమైనది యగునట్లు చేయుచున్నారు. వన్నె పూర్తిగనుండిన యూరకుందురు. ఆ ప్రకారమే నే నాచార్యోపదేశముచే లభించిన తత్త్వజ్ఞానము సంపూర్ణముగనున్నదా? కొదువగనున్నదా? యని తెలియంగోరి బ్రహ్మవేత్తలు నాతత్త్వజ్ఞానమును పరీక్షించుటకు నీగ్రంథమును రచియించితిని. గ్రంథమును రచియింపనిచో బ్రహ్మవేత్తలకు నాతత్త్వజ్ఞానముయొక్క పూర్ణత్వాపూర్ణత్వము లెట్లు దెలియును?
బ్రహ్మవేత్తలు నాజే రచియింపఁబడిన గ్రంథమునుజూచి తత్త్వజ్ఞానము సంపూర్ణమని చెప్పినచో నేను కృతకృత్యుండనని సంతసించెదను. కొదువగా నున్నదనిన నాకొదువను మరల యాచార్యోపదేశముచే పూర్ణముచేసికొని కృతకృత్యుండ నగుదు ననునభిప్రాయముతో నీగ్రంథమును రచియించుచున్నానని భావము.