శ్లోకాలు

1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | 35 | 36 | 37 | 38 | 39 | 40 | 41 | 42 | 43 | 44 | 45 | 46 | 47 | 48 | 49 | 50 | 51 | 52 | 53 | 54 | 55 | 56 | 57 | 58 | 59 | 60 | 61 | 62 | 63 | 64 | 65 | 66 | 67 | 68 | 69 | 70 | 71 | 72 | 73 | 74 | 75 | 76 | 77 | 78 | 79 | 80 | 81 | 82 | 83 | 84 | 85 | 86 | 87 | 88 | 89 | 90 | 91 | 92 | 93 | 94 | 95 | 96 | 97 | 98 | 99 | 100 |

updates

"నైష్కర్మ్య సిద్ధి" త్వరలో ఈ బ్లాగు మరింత ముస్తాబు కాగలదు. అప్పటి వరకూ సాధక మిత్రులు అనుభూతి ప్రకాశము అక్షరీకరణ కొనసాగించగలరని మనవి. మంగళకరమగు ఈ కార్యక్రమం నిర్విఘ్నంగా జరుగును గాక!! అక్షర యజ్ఞంలో తొలి అధ్యాయం నందలి 100 శ్లోకాల అవతారిక, దం.ఆ, తాత్పర్యాదుల అక్షరీకరణ దిగ్విజయముగా పూర్తికాబడినది.జయగురుదేవ!!

1-33




అకుర్వతః క్రియాః కామ్యా నిషిద్ధాస్త్యజతస్తథా
నిత్యనైమిత్తికం కర్మ విధివచ్చానుతిష్ఠతః 10

1-33

2 comments:

  1. adhirupalakshmi4 August 2020 at 23:44

    దం-అ. కామ్యకర్మలను చేయక ఆప్రకారమే నిషిద్ధకర్మలను పరిత్యజించి నిత్యనైమిత్తికకర్మను యధావిధిగా చేయుచున్నవానికి మోక్షము సంభవించును.
    తా. పుత్త్రపశుస్వర్గాదిఫలములను గలుగజేయుచున్న పుత్త్రకామేష్టి చిత్రా యాగ జ్యోతిష్టోమాదికర్మలు కామ్యములని చెప్పబడును. సురాపానపరదారగమనాది
    కర్మలు నిషిద్ధకర్మలని చెప్పబడును. సంధ్యావందనాగ్ని హొత్రాదికర్మలు నిత్యములని,జాతేష్టి,గృహదహేష్టి,విశ్వజిద్యాగాది శ్రౌతకర్మలు గ్రహణస్నానాదిస్మార్తకర్మలు
    నైమిత్తికములని చెప్పబడును. వీనిలో కామ్యకర్మలను నాచరించిన స్వర్గాదిసుఖముల ననుభవింపవలసియుండును. నిత్యనైమిత్తికకర్మల నాచరింపకపోయిన పాపము సంభవించి నరకాదిదుఃఖముల ననుభవింపవలసియుండును గాని యాచరించిన నేఫలమును గలుగదు. కావున కామ్యకర్మలను నిషిద్ధకర్మలను ద్యజించి నిత్యనైమిత్తికములను మాత్రము యధావిధిగ నాచరించువానికి స్వరూపావస్థాన మోక్షమవశ్యముగా గలుగును. అనగా నిత్యనిర్వికారుండగు నాత్మకు సుఖదుఃఖాదిసంసారము అవిద్యచేత కలిగినదని చెప్పెడు వేదాంతియును,[౧] " పుణ్య: పుణ్యేన కర్మణాభవతి, పాపః పాపేన కర్మణా భధ్యతే జంతు: " అను మొదలగు శ్రుతిస్మృతివాక్యముల ననుసరించి సంసారమునకు కర్మయును కారణమని యవశ్యముగా జెప్పవలసియుండును. అందుచే నిత్యనిర్వికారమైన యాత్మస్వరూపమునకు ప్రచ్యుతి పుణ్యపాపకర్మలచేతనే కలిగెనని నిశ్చయింపవలయును. అట్టి పుణ్యపాపకర్మలు కామ్యనిషిద్ధకర్మానుష్ఠాను నిత్య నైమిత్తికకర్మానుష్ఠాoబుల చేతంగదా పుట్టుచున్నవి. కామ్యనిషిద్ధకర్మల నాచరింపక నిత్యనైమిత్తికంబుల నాచరించుచుండిన పుణ్యపాపంబులు జన్మింపవు.
    పుణ్యపాపంబులు జన్మింపకబోయిన ఆత్మస్వరూపమునకు ప్రచ్యుతికలుగదు. అప్పు డాత్మకు స్వరూపావస్థానరూపంబైన మోక్షము ప్రతిహతముగా గలుగుగావున ఆత్మస్వరూపావస్థానరూప మోక్షమునకు కర్మలు సాధనముగాని జ్ఞానము సాధనముగాదని తాత్పర్యము.
    అవ. కామ్యకర్మ పరిత్యాగాది సాధనముల ననుష్ఠించిన స్వరూపావస్థానరూపమగు మోక్ష మేవిధముగా గలుగునని సిద్ధాంతవాది ప్రశ్నజేయుచున్నాడు.

    ReplyDelete
  2. అవ. తత్వ జ్ఞానము లేకపోయిననూ కేవల కర్మల చేత మోక్షము సిద్ధించు ప్రకారము పూర్వ పక్షవాది నిరూపించున్నాడు.----


    దం-అ. కామ్యకర్మలను చేయక ఆప్రకారమే నిషిద్ధకర్మలను పరిత్యజించి నిత్యనైమిత్తికకర్మను యధావిధిగా చేయుచున్నవానికి మోక్షము సంభవించును.

    తా. పుత్త్రపశుస్వర్గాదిఫలములను గలుగజేయుచున్న పుత్త్రకామేష్టి చిత్రా యాగ జ్యోతిష్టోమాదికర్మలు కామ్యములని చెప్పబడును. సురాపాన పరదార గమనాది కర్మలు నిషిద్ధకర్మలని చెప్పబడును. సంధ్యావందనాగ్ని హోత్రాదికర్మలు నిత్యములని, జాతేష్టి, గృహదహేష్టి, విశ్వజిద్యాగాది శ్రౌతకర్మలు గ్రహణస్నానాది స్మార్తకర్మలు నైమిత్తికములని  చెప్పబడును. 

              వీనిలో కామ్యకర్మలను నాచరించిన స్వర్గాదిసుఖముల ననుభవింపవలసియుండును. నిత్యనైమిత్తికకర్మల నాచరింపకపోయిన పాపము సంభవించి నరకాది దుఃఖముల ననుభవింపవలసి యుండును . గాని యాచరించిన నేఫలమును గలుగదు. కావున కామ్యకర్మలను నిషిద్ధకర్మలను ద్యజించి నిత్యనైమిత్తికములను మాత్రము యధావిధిగ నాచరించువానికి స్వరూపావస్థాన మోక్షమవశ్యముగా గలుగును. అనగా నిత్యనిర్వికారుండగు నాత్మకు సుఖదుఃఖాదిసంసారము అవిద్యచేత కలిగినదని చెప్పెడు వేదాంతియును,[౧] " పుణ్య: పుణ్యేన కర్మణాభవతి, పాపః పాపేన కర్మణా భధ్యతే జంతు: " అను మొదలగు శ్రుతి స్మృతివాక్యముల ననుసరించి సంసారమునకు కర్మయును కారణమని యవశ్యముగా జెప్పవలసియుండును.

          అందుచే నిత్యనిర్వికారమైన యాత్మస్వరూపమునకు ప్రచ్యుతి పుణ్యపాపకర్మలచేతనే కలిగెనని నిశ్చయింపవలయును. అట్టి పుణ్యపాపకర్మలు కామ్యనిషిద్ధకర్మానుష్ఠాన నిత్య నైమిత్తిక కర్మానుష్ఠాoబుల చేతంగదా పుట్టుచున్నవి. కామ్యనిషిద్ధకర్మల నాచరింపక నిత్యనైమిత్తికంబుల నాచరించుచుండిన పుణ్యపాపంబులు జన్మింపవు.

    పుణ్యపాపంబులు జన్మింపకబోయిన ఆత్మస్వరూపమునకు ప్రచ్యుతి కలుగదు. అప్పు డాత్మకు స్వరూపావస్థానరూపంబైన మోక్షము ప్రతిహతముగా గలుగుగావున ఆత్మస్వరూపావస్థానరూప మోక్షమునకు కర్మలు సాధనముగాని జ్ఞానము సాధనముగాదని తాత్పర్యము.

    అవ. కామ్యకర్మ పరిత్యాగాది సాధనముల ననుష్ఠించిన స్వరూపావస్థాన రూపమగు మోక్ష మేవిధముగా గలుగునని సిద్ధాంతవాది ప్రశ్నజేయుచున్నాడు.

    ReplyDelete

గురు స్మరణతో, రామకార్యంగా తలచి, ఆత్మభావనలో స్థిరపడేందుకు కావల్సిన చిత్తశుద్ధికై, ఈ నిష్కామ కర్మ రూప అక్షరయజ్ఞాన్ని, శ్లోక తాత్పర్యాది భావాన్ని చక్కగా అవగాహన చేసికొనుచు చేయ ప్రయత్నిద్దాము..

పైనున్న శ్లోకము యొక్క అవతారికను, తాత్పర్యమును ఈ దిగువ టైపు చేసిన చాలును. శ్లోకము టైపు చేయవలసిన అవసరము లేదు.

సంఖ్యలో ఎన్ని ఎక్కువ చేశాము అనేకంటే, అక్షర దోషములు ఏ ఒక్కటి తలెత్తకుండా రోజుకు ఒక్కరు కనీసం ఒక్కశ్లోకం పూర్తిగా చేసినా చాలును. త్వరితగతిన ఈ గురుకార్యం సఫలీకృతమగునని విన్నవించడమైనది.