శ్లోకాలు

1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | 35 | 36 | 37 | 38 | 39 | 40 | 41 | 42 | 43 | 44 | 45 | 46 | 47 | 48 | 49 | 50 | 51 | 52 | 53 | 54 | 55 | 56 | 57 | 58 | 59 | 60 | 61 | 62 | 63 | 64 | 65 | 66 | 67 | 68 | 69 | 70 | 71 | 72 | 73 | 74 | 75 | 76 | 77 | 78 | 79 | 80 | 81 | 82 | 83 | 84 | 85 | 86 | 87 | 88 | 89 | 90 | 91 | 92 | 93 | 94 | 95 | 96 | 97 | 98 | 99 | 100 |

updates

"నైష్కర్మ్య సిద్ధి" త్వరలో ఈ బ్లాగు మరింత ముస్తాబు కాగలదు. అప్పటి వరకూ సాధక మిత్రులు అనుభూతి ప్రకాశము అక్షరీకరణ కొనసాగించగలరని మనవి. మంగళకరమగు ఈ కార్యక్రమం నిర్విఘ్నంగా జరుగును గాక!! అక్షర యజ్ఞంలో తొలి అధ్యాయం నందలి 100 శ్లోకాల అవతారిక, దం.ఆ, తాత్పర్యాదుల అక్షరీకరణ దిగ్విజయముగా పూర్తికాబడినది.జయగురుదేవ!!

1-96




1-96

2 comments:

  1. అవ. ఓయీ కర్మ తాను ఫలమునిచ్చునప్పుడు అజ్ఞానమును తత్కల్పితభేదమును అపేక్షించునని యేలచెప్పవలెను? నిరపేక్షముగానే ఫలమునియ్యగూడదా యని శంకింపగా ఉత్తరమును చెప్పుచున్నారు. --------

    దం-అ. ఆకర్మ కేవలము పుట్టింపదగినస్వరూపము కలదైయున్నందున కర్మకర్త్రాదిసాధనముల నపేక్షింపనిదై అనేకకల్పముల కావల సిద్ధించునట్టిఫలము నిచ్చుకొఱకు తనస్వరూపమును ధరింపజాలదు.

    తా. కర్మయనగా సిద్ధమై స్వతంత్రమైన పదార్థముకాదు. ఇక నెటువంటిదనిన పురుషప్రయత్నముచేత పుట్టింపబడి స్వతంత్రమైన పదార్థము నాశ్రయించియుండును. ద్రవ్యము స్వతంత్రమనియు అట్టి ద్రవ్యమును ఆశ్రయించి గుణములుగాని కర్మలుగాని ప్రవర్తించుననికదా శాస్త్రకారులు చెప్పుచున్నారు. గనుక కర్మ, కర్తయొక్క ప్రయత్నవిశేషముచేత పుట్టింపబడి ఆకర్తనే ఆశ్రయించియుండును. ఇట్టికర్మ తానుపుట్టినప్పుడే తనయొక్కఫలమును ఇచ్చునదికాదు. తనకంటె ముందు సంపాదింపబడి తనకంటె ప్రబలమైనకర్మలు వాని ఫలములను ఇచ్చి సమాప్తిపొందినపిదప ఫలమునిచ్చును. కావున తాను పుట్టినకాలమున కనంతర మెన్నికోట్లకల్పములకో తాను ఫలము నిచ్చును. అందుచేత నంతకాలము నిరాశ్రయముగా నుండజాలదు. కావున తన పుట్టుకకు కారణమైనకర్తను ఆశ్రయించి తనస్వరూపమును భరించియుండును. ఈహేతువుచేతనే కర్మ తాను ఫలము నిచ్చునప్పుడును అజ్ఞానమును, తత్కల్పితకర్త్రాదిభేదవస్తువుల నపేక్షించియుండునని నిశ్చయింపబడెనని భావము.

    ReplyDelete
  2. అవ. ఓయీ కర్మ తాను ఫలమునిచ్చునప్పుడు అజ్ఞానమును తత్కల్పిత భేదమును అపేక్షించునని యేల చెప్పవలెను? నిరపేక్షముగానే ఫలము నియ్యగూడదా యని శంకింపగా ఉత్తరమును చెప్పుచున్నారు. --------


    దం-అ. ఆకర్మ కేవలము పుట్టింపదగిన స్వరూపము కలదై యున్నందున కర్మకర్త్రాది సాధనముల నపేక్షింపనిదై అనేక కల్పముల కావల సిద్ధించునట్టి ఫలము నిచ్చుకొఱకు తన స్వరూపమును ధరింపజాలదు.


    తా. కర్మయనగా సిద్ధమై స్వతంత్రమైన పదార్థముకాదు. ఇక నెటువంటిదనిన పురుష ప్రయత్నముచేత పుట్టింపబడి స్వతంత్రమైన పదార్థము నాశ్రయించియుండును. ద్రవ్యము స్వతంత్రమనియు అట్టి ద్రవ్యమును ఆశ్రయించి గుణములుగాని కర్మలుగాని ప్రవర్తించుననికదా శాస్త్రకారులు చెప్పుచున్నారు. గనుక కర్మ, కర్తయొక్క ప్రయత్నవిశేషముచేత పుట్టింపబడి ఆ కర్తనే ఆశ్రయించియుండును. 

                    ఇట్టి కర్మ తానుపుట్టినప్పుడే తనయొక్క ఫలమును ఇచ్చునదికాదు. తనకంటె ముందు సంపాదింపబడి తనకంటె ప్రబలమైన కర్మలు వాని ఫలములను ఇచ్చి , సమాప్తి పొందిన పిదప ఫలమునిచ్చును. కావున తాను పుట్టిన కాలమున కనంతర మెన్నికోట్ల కల్పములకో... తాను ఫలము నిచ్చును. అందుచేత నంతకాలము నిరాశ్రయముగా నుండజాలదు. కావున తన పుట్టుకకు కారణమైన కర్తను ఆశ్రయించెడి తనస్వరూపమును భరించియుండును. 

             ఈహేతువుచేతనే కర్మ తాను ఫలము నిచ్చునప్పుడును అజ్ఞానమును, తత్కల్పిత కర్త్రాదిభేద వస్తువుల నపేక్షించి యుండునని నిశ్చయింపబడెనని భావము.

    ReplyDelete

గురు స్మరణతో, రామకార్యంగా తలచి, ఆత్మభావనలో స్థిరపడేందుకు కావల్సిన చిత్తశుద్ధికై, ఈ నిష్కామ కర్మ రూప అక్షరయజ్ఞాన్ని, శ్లోక తాత్పర్యాది భావాన్ని చక్కగా అవగాహన చేసికొనుచు చేయ ప్రయత్నిద్దాము..

పైనున్న శ్లోకము యొక్క అవతారికను, తాత్పర్యమును ఈ దిగువ టైపు చేసిన చాలును. శ్లోకము టైపు చేయవలసిన అవసరము లేదు.

సంఖ్యలో ఎన్ని ఎక్కువ చేశాము అనేకంటే, అక్షర దోషములు ఏ ఒక్కటి తలెత్తకుండా రోజుకు ఒక్కరు కనీసం ఒక్కశ్లోకం పూర్తిగా చేసినా చాలును. త్వరితగతిన ఈ గురుకార్యం సఫలీకృతమగునని విన్నవించడమైనది.