శ్లోకాలు
1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | 35 | 36 | 37 | 38 | 39 | 40 | 41 | 42 | 43 | 44 | 45 | 46 | 47 | 48 | 49 | 50 | 51 | 52 | 53 | 54 | 55 | 56 | 57 | 58 | 59 | 60 | 61 | 62 | 63 | 64 | 65 | 66 | 67 | 68 | 69 | 70 | 71 | 72 | 73 | 74 | 75 | 76 | 77 | 78 | 79 | 80 | 81 | 82 | 83 | 84 | 85 | 86 | 87 | 88 | 89 | 90 | 91 | 92 | 93 | 94 | 95 | 96 | 97 | 98 | 99 | 100 |
updates
3 comments:
గురు స్మరణతో, రామకార్యంగా తలచి, ఆత్మభావనలో స్థిరపడేందుకు కావల్సిన చిత్తశుద్ధికై, ఈ నిష్కామ కర్మ రూప అక్షరయజ్ఞాన్ని, శ్లోక తాత్పర్యాది భావాన్ని చక్కగా అవగాహన చేసికొనుచు చేయ ప్రయత్నిద్దాము..
పైనున్న శ్లోకము యొక్క అవతారికను, తాత్పర్యమును ఈ దిగువ టైపు చేసిన చాలును. శ్లోకము టైపు చేయవలసిన అవసరము లేదు.
సంఖ్యలో ఎన్ని ఎక్కువ చేశాము అనేకంటే, అక్షర దోషములు ఏ ఒక్కటి తలెత్తకుండా రోజుకు ఒక్కరు కనీసం ఒక్కశ్లోకం పూర్తిగా చేసినా చాలును. త్వరితగతిన ఈ గురుకార్యం సఫలీకృతమగునని విన్నవించడమైనది.
Subscribe to:
Posts (Atom)
This comment has been removed by the author.
ReplyDeleteఅవ. ఈ ప్రకారము వేదవాక్యములయొక్క తాత్పర్యమును యోచింపగా వేదవాక్యములు బ్రహ్మస్వరూపమును చెప్పునవికావని నిరాకరించి వేదవాక్యములయొక్క సామర్థ్యమును బట్టి యోచించి ఆబ్రహ్మస్వరూపమును చెప్పునవికావని చెప్పుచున్నాడు. -------
ReplyDeleteదం-అ. జ్ఞానవాదికిని బ్రహ్మవస్తువునందు వాక్యము ప్రమాణమని అంగీకారము ఉన్నందునను, వాక్యమునకు క్రియాపదము ముఖ్యమైయున్నందునను ఈకారణమువలన మీకు సమ్మతమైనజ్ఞానము సిద్ధింపదు.
తా. కర్మలు మోక్షసాధనమనిచెప్పు నేనును, కర్మలయందు వేదవాక్యమే ప్రమాణమని చెప్పియున్నాను. తత్వజ్ఞానము మోక్షసాధనమనిచెప్పునీవును బ్రహ్మస్వరూపమునందు వేదవాక్యమే ప్రమాణమని యంగీకరించియుంటివి గావున వాక్యము ప్రమాణమని చెప్పుటయందు మన కిరువురకు వివాదములేదు. అట్టివాక్యమునకు సామర్థ్యము పురుషప్రయత్నసాధ్యంబైన క్రియను చెప్పుటయందు కలదా యని విచారించెదము.
అనేకపదములయొక్క సముదాయము వాక్యమనంబడు. అట్టి వాక్యములో క్రియాపదము ప్రధానమైయుండు. క్రియాపదములేనిచో వాక్యము సంపూర్ణముకానేరదు. ' శుక్లాంగాం దండేనానయ' తెల్లనిగోవును కఱ్ఱతో తీసికొనిరమ్ము అనిచెప్పినచో వాక్యముపూర్ణముగానుండునుగాని ' శుక్లాం దండేన' అనిమాత్రముచెప్పిన వాక్యము పూర్ణముకానేరదు గదా? పురుషప్రయత్నసాధ్యమైన యర్థము క్రియాపదమున కర్థమైయుండు.
వేదములును వాక్యరూపములైయున్నందున క్రియాపదప్రధానములై యుండు గావున వేదవాక్యములు పురుషప్రయత్నసాధ్యమైనకర్మను చెప్పుటయందు సామర్థ్యముకలదిగాని కేవలసిద్ధవస్తువును చెప్పుటయందు సామర్థ్యముగలదికాదు గావున స్వతస్సిద్ధమయిన బ్రహ్మవస్తువును వివరణచేయువాక్యమే లేనందున బ్రహ్మజ్ఞానమే మోక్షసాధనమను నీపక్షమునందు నీకు సమ్మతమైనజ్ఞానము సిద్ధింపదని భావము.
అవ. ఈ ప్రకారము వేదవాక్యములయొక్క తాత్పర్యమును యోచింపగా వేదవాక్యములు బ్రహ్మస్వరూపమును చెప్పునవికావని నిరాకరించి వేదవాక్యములయొక్క సామర్థ్యమును బట్టి యోచించి ఆబ్రహ్మస్వరూపమును చెప్పునవికావని చెప్పుచున్నాడు. -------
ReplyDeleteదం-అ. జ్ఞానవాదికిని బ్రహ్మవస్తువునందు వాక్యము ప్రమాణమని అంగీకారము ఉన్నందునను, వాక్యమునకు క్రియాపదము ముఖ్యమై యున్నందునను ఈ కారణము వలన మీకు సమ్మతమైన జ్ఞానము సిద్ధింపదు.
తా. కర్మలు మోక్షసాధనమనిచెప్పు నేనును, కర్మలయందు వేదవాక్యమే ప్రమాణమని చెప్పియున్నాను. తత్వజ్ఞానము మోక్షసాధనమని చెప్పు నీవును బ్రహ్మస్వరూపము నందు వేదవాక్యమే ప్రమాణమని యంగీకరించియుంటివి గావున వాక్యము ప్రమాణమని చెప్పుటయందు మన కిరువురకు వివాదములేదు. అట్టివాక్యమునకు సామర్థ్యము పురుషప్రయత్న సాధ్యంబైన క్రియను చెప్పుటయందు కలదా యని విచారించెదము.