శ్లోకాలు
1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | 35 | 36 | 37 | 38 | 39 | 40 | 41 | 42 | 43 | 44 | 45 | 46 | 47 | 48 | 49 | 50 | 51 | 52 | 53 | 54 | 55 | 56 | 57 | 58 | 59 | 60 | 61 | 62 | 63 | 64 | 65 | 66 | 67 | 68 | 69 | 70 | 71 | 72 | 73 | 74 | 75 | 76 | 77 | 78 | 79 | 80 | 81 | 82 | 83 | 84 | 85 | 86 | 87 | 88 | 89 | 90 | 91 | 92 | 93 | 94 | 95 | 96 | 97 | 98 | 99 | 100 |
updates
2 comments:
గురు స్మరణతో, రామకార్యంగా తలచి, ఆత్మభావనలో స్థిరపడేందుకు కావల్సిన చిత్తశుద్ధికై, ఈ నిష్కామ కర్మ రూప అక్షరయజ్ఞాన్ని, శ్లోక తాత్పర్యాది భావాన్ని చక్కగా అవగాహన చేసికొనుచు చేయ ప్రయత్నిద్దాము..
పైనున్న శ్లోకము యొక్క అవతారికను, తాత్పర్యమును ఈ దిగువ టైపు చేసిన చాలును. శ్లోకము టైపు చేయవలసిన అవసరము లేదు.
సంఖ్యలో ఎన్ని ఎక్కువ చేశాము అనేకంటే, అక్షర దోషములు ఏ ఒక్కటి తలెత్తకుండా రోజుకు ఒక్కరు కనీసం ఒక్కశ్లోకం పూర్తిగా చేసినా చాలును. త్వరితగతిన ఈ గురుకార్యం సఫలీకృతమగునని విన్నవించడమైనది.
Subscribe to:
Posts (Atom)
శ్లో. వేదాంతోదరసంగూఢం సంసారోత్సారి వస్తుగం
ReplyDeleteజ్ఞానం వ్యాకృతమప్యన్యైర్వక్ష్యే గుర్వనుశిక్షయా 3
దం-అ. ఉపనిషత్తులయొక్క గర్భమున రహస్యముగా నుంచబడినదియు సంసారమును నిరాకరించునదియు పరమార్ధవస్తువును బోధించునదియునైన జ్ఞానమును ఇతరపండితులచే వివరింపబడినదైనను గురువులయాజ్ఞచే జెప్పుచున్నాను.
తా. వేదాంతములనిచెప్పబడు బృహదారణ్యక ఛాందోగ్య ముండకాద్యుపనిషత్తులలో జెప్పఁబడియుండినను అపరిశుద్దాంతఃకరణగలవారిచే దెలియ శక్యముగాక పాతాళమందు పెట్టబడిన మహానిధివలె నతిరహస్యముగానున్న తత్వజ్ఞానమును నే నీగ్రంథములో వివరించుచున్నాను. ఈజ్ఞానము జీవాత్మపరమాత్మలయొక్క ఐక్యమును జెప్పి జీవాత్మయందు గన్పట్టుచున్న సర్వానర్థసంపాదకంబైన సంసారమును నిశ్శేషముగ చిమ్మివేయును. ఇట్టి జ్ఞానము నింతకుమునుపే కృష్ణద్వైపాయన శుక గౌడపాదాది మహామునులచే విస్తారముగ శారీరకమీమాంసాది గ్రంథములలొ వివరింపబడియున్నందున నే నీ గ్రంథమును రచియించుట య నావశ్యకమైనను, మా గురువులు నన్నొకగ్రంథమును రచియింపమని యాజ్ఞాపించుటచే వారియాజ్ఞను పరిపాలించుటకై నే నీ గ్రంథములో పూర్యోక్తమైన జ్ఞానమును వివరించుచున్నానని భావము. శ్రీ శంకరభగవత్పాదులవారు తామురచియించిన బ్రహ్మసూత్రభాష్యమున కొక్కవార్తికంబు చేయింపంబూని సురేశ్వరాచార్యులవారికి ఆజ్ఞాపించిరి. పద్మపాదాదిశిష్యులు సురేశ్వరాచార్యులు కర్మమీమాంసయం దతిశ్రధ్ధకలవారు గావున బ్రహ్మసూత్రభాష్యమునకు వ్యాఖ్యానము చేయుట తమ కసమ్మతమనిరి. అంతట శ్రీ శంకరభగవత్పాదులవారు సురేశ్వరాచార్యులం జూచి వారినొకవేదాంతప్రకరణ గ్రంథమును రచియింపుడని యాజ్ఞాపించిరి. ఆయాజ్ఞ నవలంబించి సురేశ్వరాచార్యులీ గ్రంథమును నిర్మించిరని శంకరవిజయములోని కథ నిచ్చోట ననుసంధింపవలయును
దం-అ. ఉపనిషత్తులయొక్క గర్భమున రహస్యముగా నుంచబడినదియు సంసారమును నిరాకరించునదియు పరమార్ధవస్తువును బోధించునదియునైన జ్ఞానమును ఇతరపండితులచే వివరింపబడినదైనను గురువులయాజ్ఞచే జెప్పుచున్నాను.
ReplyDeleteతా. వేదాంతములనిచెప్పబడు బృహదారణ్యక ఛాందోగ్య ముండకాద్యుపనిషత్తులలో జెప్పఁబడియుండినను అపరిశుద్దాంతఃకరణగలవారిచే దెలియ శక్యముగాక పాతాళమందు పెట్టబడిన మహానిధివలె నతిరహస్యముగానున్న తత్వజ్ఞానమును నే నీగ్రంథములో వివరించుచున్నాను.
ఈజ్ఞానము జీవాత్మపరమాత్మలయొక్క ఐక్యమును జెప్పి జీవాత్మయందు గన్పట్టుచున్న సర్వానర్థసంపాదకంబైన సంసారమును నిశ్శేషముగ చిమ్మివేయును. ఇట్టి జ్ఞానము నింతకుమునుపే కృష్ణద్వైపాయన శుక గౌడపాదాది మహామునులచే విస్తారముగ శారీరకమీమాంసాది గ్రంథములలొ వివరింపబడియున్నందున నే నీ గ్రంథమును రచియించుట య నావశ్యకమైనను, మా గురువులు నన్నొకగ్రంథమును రచియింపమని యాజ్ఞాపించుటచే వారియాజ్ఞను పరిపాలించుటకై నే నీ గ్రంథములో పూర్యోక్తమైన జ్ఞానమును వివరించుచున్నానని భావము.
శ్రీ శంకరభగవత్పాదులవారు తామురచియించిన బ్రహ్మసూత్రభాష్యమున కొక్కవార్తికంబు చేయింపంబూని సురేశ్వరాచార్యులవారికి ఆజ్ఞాపించిరి. పద్మపాదాదిశిష్యులు సురేశ్వరాచార్యులు కర్మమీమాంసయం దతిశ్రధ్ధకలవారు గావున బ్రహ్మసూత్రభాష్యమునకు వ్యాఖ్యానము చేయుట తమ కసమ్మతమనిరి. అంతట శ్రీ శంకరభగవత్పాదులవారు సురేశ్వరాచార్యులం జూచి వారినొకవేదాంతప్రకరణ గ్రంథమును రచియింపుడని యాజ్ఞాపించిరి. ఆయాజ్ఞ నవలంబించి సురేశ్వరాచార్యులీ గ్రంథమును నిర్మించిరని శంకరవిజయములోని కథ నిచ్చోట ననుసంధింపవలయును.