శ్లోకాలు
1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | 35 | 36 | 37 | 38 | 39 | 40 | 41 | 42 | 43 | 44 | 45 | 46 | 47 | 48 | 49 | 50 | 51 | 52 | 53 | 54 | 55 | 56 | 57 | 58 | 59 | 60 | 61 | 62 | 63 | 64 | 65 | 66 | 67 | 68 | 69 | 70 | 71 | 72 | 73 | 74 | 75 | 76 | 77 | 78 | 79 | 80 | 81 | 82 | 83 | 84 | 85 | 86 | 87 | 88 | 89 | 90 | 91 | 92 | 93 | 94 | 95 | 96 | 97 | 98 | 99 | 100 |
updates
2 comments:
గురు స్మరణతో, రామకార్యంగా తలచి, ఆత్మభావనలో స్థిరపడేందుకు కావల్సిన చిత్తశుద్ధికై, ఈ నిష్కామ కర్మ రూప అక్షరయజ్ఞాన్ని, శ్లోక తాత్పర్యాది భావాన్ని చక్కగా అవగాహన చేసికొనుచు చేయ ప్రయత్నిద్దాము..
పైనున్న శ్లోకము యొక్క అవతారికను, తాత్పర్యమును ఈ దిగువ టైపు చేసిన చాలును. శ్లోకము టైపు చేయవలసిన అవసరము లేదు.
సంఖ్యలో ఎన్ని ఎక్కువ చేశాము అనేకంటే, అక్షర దోషములు ఏ ఒక్కటి తలెత్తకుండా రోజుకు ఒక్కరు కనీసం ఒక్కశ్లోకం పూర్తిగా చేసినా చాలును. త్వరితగతిన ఈ గురుకార్యం సఫలీకృతమగునని విన్నవించడమైనది.
Subscribe to:
Posts (Atom)
దం-అ. అంగీకరించినవిషయమునే అంగీకరించినందున నీయొక్కవచనము అత్తగారు భిక్షములేదని చెప్పినటుల వ్యర్థము, నిరర్థకము.
ReplyDeleteతా. కర్మలే మోక్షసాధనమని నిర్వహించుటకు బూనుకొనిన నీవు కామ్యనిషిద్ధములను విడిచి నిత్యనైమిత్తికకర్మలను యథావిధిగ నాచరింపవలయుననియు అందువలన కామ్యకర్మలకు ఫలమైన దేవమనుష్యాదిజన్మనుగాని నిషిద్ధకర్మకు ఫలమైన నరతిర్యగాది జన్మలనుగాని పొందడనియు ప్రారబ్ధకర్మ లనుభవముచేతనే నశించుననియు చెప్పితివి. ఈవిషయమునంతయును నేను ముందుగా నంగీకరించియుంటిని. కావున దానినే నీవు మరలచెప్పుట శ్వశ్రూభిక్షాప్రతిక్షేపన్యాయముతో సరియైన నిష్ఫలమని భావము.
ఒకగ్రామములో నొకయింట తలిదండ్రులు భార్య మొదలగుకుటుంబముతోగూడి కాపురముచేయుచుండెను. ఒకనా డత్తగా రేదో యొకపనినిమిత్తమై పొరుగింటికి పోయియుండగా నొకబ్రహ్మచారి మధుకరముకొఱకు ఈబ్రాహ్మణునియింటికివచ్చి 'భవతి భిక్షాందేహి' యని భిక్షమును యాచింపగా నత్తగా రింటిలో లేనందున కోడలాబ్రహ్మచారినింజూచి 'భిక్షములేదు వెళ్ళిపొమ్ము' అనెను. అంత నాబ్రహ్మచారి యా యిల్లువదలి మఱియొకయింటికి బోవుచుండ పొరుగింటినుండి యింటికివచ్చుచున్న యత్తగా రాబ్రహ్మచారినిజూచి 'యోచిన్నవాడా! మాయింటికిపోలేదా?' యని యడిగిన నాబ్రహ్మచారి 'పోయితిని, మీకోడలు భిక్షములేదు, వెళ్ళిపొమ్ము' అనెను. అదివిని యత్తగా 'రదిన్యాయముకాదు మరల మాయింటికిరమ్ము' అని యాబ్రహ్మచారిని తనయింటికి తోడ్కొనివచ్చి 'ఓచిన్నవాడా! ఏమివచ్చితివి' అని యడిగిన ఆబ్రహ్మచారి 'భవతి భిక్షాందేహి' యని మునుపటివలె భిక్షమును యాచించెను. అందు కత్తగారు 'భిక్షములేదు, వెళ్ళిపొమ్ము' అనిచెప్పిన ఆబ్రహ్మచారి ఖిన్నుడై 'మీకోడలుచెప్పినమాటలు మీరుచెప్పితిరే, మీ రెక్కువచేసినదేమి?' అని యడిగిన 'లేదనిచెప్పుటకుగాని కలదనిచెప్పుటకుగాని, నేను స్వతంత్రురాలనుగాని కోడలికి స్వాతంత్ర్యమెక్కడిది?' అని ప్రత్యుత్తరము చెప్పెను. ఇది శ్వశ్రూభిక్షాప్రతిక్షేపన్యాయము.
దం-అ. అంగీకరించినవిషయమునే అంగీకరించినందున నీయొక్కవచనము అత్తగారు భిక్షములేదని చెప్పినటుల వ్యర్థము, నిరర్థకము.
ReplyDeleteతా. కర్మలే మోక్షసాధనమని నిర్వహించుటకు బూనుకొనిన నీవు కామ్యనిషిద్ధములను విడిచి నిత్యనైమిత్తిక కర్మలను యథావిధిగ నాచరింప వలయుననియు అందువలన కామ్యకర్మలకు ఫలమైన దేవమనుష్యాది జన్మనుగాని నిషిద్ధకర్మకు ఫలమైన నరతిర్యగాది జన్మలనుగాని పొందడనియు ప్రారబ్ధకర్మ లనుభవము చేతనే నశించుననియు చెప్పితివి. ఈవిషయము నంతయును నేను ముందుగా నంగీకరించి యుంటిని. కావున దానినే నీవు మరలచెప్పుట శ్వశ్రూభిక్షా ప్రతిక్షేపన్యాయముతో సరియైన నిష్ఫలమని భావము.
ఒకగ్రామములో నొకయింట తలిదండ్రులు భార్య మొదలగు కుటుంబముతో గూడి కాపురము చేయుచుండెను. ఒకనా డత్తగా రేదో యొకపని నిమిత్తమై పొరుగింటికి పోయి యుండగా నొక బ్రహ్మచారి మధుకరము కొఱకు ఈ బ్రాహ్మణుని యింటికి వచ్చి 'భవతి భిక్షాందేహి' యని భిక్షమును యాచింపగా నత్తగా రింటిలో లేనందున కోడలా బ్రహ్మచారినింజూచి 'భిక్షములేదు వెళ్ళిపొమ్ము' అనెను. అంత నా బ్రహ్మచారి యా యిల్లు వదలి మఱియొక యింటికి బోవుచుండ పొరుగింటి నుండి యింటికి వచ్చుచున్న యత్తగారా బ్రహ్మచారిని జూచి 'యోచిన్నవాడా! మాయింటికి పోలేదా?' యని యడిగిన నాబ్రహ్మచారి 'పోయితిని, మీకోడలు భిక్షములేదు, వెళ్ళిపొమ్ము' అనెను.
అదివిని యత్తగా 'రదిన్యాయము కాదు మరల మాయింటికి రమ్ము' అని యాబ్రహ్మచారిని తనయింటికి తోడ్కొనివచ్చి 'ఓచిన్నవాడా! ఏమివచ్చితివి' అని యడిగిన ఆబ్రహ్మచారి 'భవతి భిక్షాందేహి' యని మునుపటివలె భిక్షమును యాచించెను. అందు కత్తగారు 'భిక్షములేదు, వెళ్ళిపొమ్ము' అని చెప్పిన ఆ బ్రహ్మచారి ఖిన్నుడై 'మీకోడలు చెప్పినమాటలు మీరుచెప్పితిరే, మీ రెక్కువచేసినదేమి?' అని యడిగిన 'లేదని చెప్పుటకు గాని కలదని చెప్పుటకుగాని, నేను స్వతంత్రురాలనుగాని కోడలికి స్వాతంత్ర్యమెక్కడిది?' అని ప్రత్యుత్తరము చెప్పెను. ఇది శ్వశ్రూభిక్షా ప్రతిక్షేపన్యాయము.