శ్లోకాలు

1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | 35 | 36 | 37 | 38 | 39 | 40 | 41 | 42 | 43 | 44 | 45 | 46 | 47 | 48 | 49 | 50 | 51 | 52 | 53 | 54 | 55 | 56 | 57 | 58 | 59 | 60 | 61 | 62 | 63 | 64 | 65 | 66 | 67 | 68 | 69 | 70 | 71 | 72 | 73 | 74 | 75 | 76 | 77 | 78 | 79 | 80 | 81 | 82 | 83 | 84 | 85 | 86 | 87 | 88 | 89 | 90 | 91 | 92 | 93 | 94 | 95 | 96 | 97 | 98 | 99 | 100 |

updates

"నైష్కర్మ్య సిద్ధి" త్వరలో ఈ బ్లాగు మరింత ముస్తాబు కాగలదు. అప్పటి వరకూ సాధక మిత్రులు అనుభూతి ప్రకాశము అక్షరీకరణ కొనసాగించగలరని మనవి. మంగళకరమగు ఈ కార్యక్రమం నిర్విఘ్నంగా జరుగును గాక!! అక్షర యజ్ఞంలో తొలి అధ్యాయం నందలి 100 శ్లోకాల అవతారిక, దం.ఆ, తాత్పర్యాదుల అక్షరీకరణ దిగ్విజయముగా పూర్తికాబడినది.జయగురుదేవ!!

1-63



చతుర్విధస్యాపి కర్మకార్యస్య ముక్తావసంభవాన్న ముక్తేః
కర్మకార్యత్వం

1-63

2 comments:

  1. This comment has been removed by the author.

    ReplyDelete
  2. దం.అ. నాలుగు విధములుగా ఉన్న కర్మ వ్యాపారము మోక్షము నందు సంభవించదు కావున మోక్షము కర్మ సాధ్యము కానేరదు.

    తా. నిత్య సిద్ధమైన ఆత్మ యొక్క స్వరూపావస్థానమే మనబడు. అట్టి మోక్షమునకు దేహేంద్రియాది కల్ప కమైన ములాజ్ఞానము ప్రతిబంధక మై ఉన్నది . అజ్ఞానము యొక్క నివృత్తి మాత్రమే మోక్షమునకు అపేక్షిత మై ఉన్నది గాని,  ఉత్పత్తి,  ప్రాప్తి,  వికృతి, సంస్కారము అనే నాలుగు వ్యాపారములు అపేక్షితంబులు కావు . కావున మోక్షము కర్మ సాధ్యము కాదని భావము. ఇచ్చట ఈ అర్థము అను సంధింప వలయును. 

            "క్రియత ఇది కర్మ" అను వ్యుత్పత్తి చే చేయబడునది కర్మ యనబడును.  ఇది ద్రవ్యముల యందు నాలుగు విధములైన గుణములను కలుగజేయును.  అది ఎటులనగా తంతువాయుని ( సాలెవాని) చే చేయబడు తంతు సంయోగ కర్మ పటంబున కు ఉత్పత్తిని కలుగజేయును. ఒక పురుషుని చేయబడు గమన కర్మ గ్రామాది ప్రాప్తిని కలుగజేయును. 

               క్షీరమునందు చేయబడు నాతంచ నాది కర్మ (పెరుగగుటకై పెట్టు మజ్జిగ తో తోడు)  క్షీరమునకు దధి రూపమైన వికారమును కలుగజేయును. మాలిన దర్పణము నందు చేయు భస్మ నిఘర్షణ కర్మ ( అద్దపు మలిన తత్వము పోగొట్టుట కై బూడిద తో రాచి తోమడము) ఆ దర్పణమునకు ప్రతిబింబ గ్రహణ యోగ్యత రూపంబైన సంస్కారమును కలుగజేయును.

          ఈ నాలుగు గుణములను నిత్య సిద్ధమై , సర్వవ్యాపకమై, నిరయవమై,  నిత్య శుద్ధమైన ఆత్మ స్వరూపము నకు కలుగ నేరవు. ఆత్మ స్వరూపము నిత్య సిద్ధమై నందున పటము వలె ఉత్పత్తికి యోగ్యము కాదు.

             సర్వవ్యాపకమైనందున నిత్య ప్రాప్తము గావున గ్రామాదుల వలే ప్రాప్తికి యోగ్యము కాదు. నిరవయంబై నందున క్షీరము వలే వికారము నందదు. నిత్య శుద్ధమైనందున దర్పణము వలె సంస్కారమును అపేక్షింపదు. కావున ఉత్పత్తి, ప్రాప్తి , వికృతి సంస్కారములనే చతుర్విధ కర్మఫలములు నిత్య సిద్ధాత్మ స్వరూపావస్థానమైన మోక్షమునకు అపేక్షితములు కావు . కావున మోక్షము కర్మ సాధ్యము కానేరదు.

    ReplyDelete

గురు స్మరణతో, రామకార్యంగా తలచి, ఆత్మభావనలో స్థిరపడేందుకు కావల్సిన చిత్తశుద్ధికై, ఈ నిష్కామ కర్మ రూప అక్షరయజ్ఞాన్ని, శ్లోక తాత్పర్యాది భావాన్ని చక్కగా అవగాహన చేసికొనుచు చేయ ప్రయత్నిద్దాము..

పైనున్న శ్లోకము యొక్క అవతారికను, తాత్పర్యమును ఈ దిగువ టైపు చేసిన చాలును. శ్లోకము టైపు చేయవలసిన అవసరము లేదు.

సంఖ్యలో ఎన్ని ఎక్కువ చేశాము అనేకంటే, అక్షర దోషములు ఏ ఒక్కటి తలెత్తకుండా రోజుకు ఒక్కరు కనీసం ఒక్కశ్లోకం పూర్తిగా చేసినా చాలును. త్వరితగతిన ఈ గురుకార్యం సఫలీకృతమగునని విన్నవించడమైనది.