శ్లోకాలు
1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | 35 | 36 | 37 | 38 | 39 | 40 | 41 | 42 | 43 | 44 | 45 | 46 | 47 | 48 | 49 | 50 | 51 | 52 | 53 | 54 | 55 | 56 | 57 | 58 | 59 | 60 | 61 | 62 | 63 | 64 | 65 | 66 | 67 | 68 | 69 | 70 | 71 | 72 | 73 | 74 | 75 | 76 | 77 | 78 | 79 | 80 | 81 | 82 | 83 | 84 | 85 | 86 | 87 | 88 | 89 | 90 | 91 | 92 | 93 | 94 | 95 | 96 | 97 | 98 | 99 | 100 |
updates
4 comments:
గురు స్మరణతో, రామకార్యంగా తలచి, ఆత్మభావనలో స్థిరపడేందుకు కావల్సిన చిత్తశుద్ధికై, ఈ నిష్కామ కర్మ రూప అక్షరయజ్ఞాన్ని, శ్లోక తాత్పర్యాది భావాన్ని చక్కగా అవగాహన చేసికొనుచు చేయ ప్రయత్నిద్దాము..
పైనున్న శ్లోకము యొక్క అవతారికను, తాత్పర్యమును ఈ దిగువ టైపు చేసిన చాలును. శ్లోకము టైపు చేయవలసిన అవసరము లేదు.
సంఖ్యలో ఎన్ని ఎక్కువ చేశాము అనేకంటే, అక్షర దోషములు ఏ ఒక్కటి తలెత్తకుండా రోజుకు ఒక్కరు కనీసం ఒక్కశ్లోకం పూర్తిగా చేసినా చాలును. త్వరితగతిన ఈ గురుకార్యం సఫలీకృతమగునని విన్నవించడమైనది.
Subscribe to:
Posts (Atom)
1.అవ. ఆత్మజ్ఞానము కర్మల నపేక్షించిగాని చిరకాలమునకే ఫలము నిచ్చునది యని శంకింపగా పరిహారమును చెప్పుచున్నారు.---
ReplyDeleteదం.అ. ఆత్మజ్ఞానమన్ననో ఫలసిద్ధివిషయమై పుట్టుచున్నస్వరూపము కంటె భిన్నముగా మఱియొకరూపమునుగాని సాధనమునుగాని అపేక్షింపదు.
2.తా. ఆత్మజ్ఞానము అంతఃకరణము శుద్ధమైనం గాని పుట్టదు. అంతఃకరణశుద్ధి యాగదానవేదపారాయణాది కర్మలచేత గలుగును. అంతఃకరణము మిక్కిలి శుద్ధమైనపిదప వేదాంతమహావాక్యశ్రవణము నొకసారిచేసినమాత్రమున ఆత్మతత్వజ్ఞానము కలుగును. అంతఃకరణము కొంచెము శుద్ధముకాగానే ఔత్సుక్యముచేత వేదాంత మహావాక్యశ్రవణమును చేసినయెడల ఆత్మతత్వజ్ఞానము సకృత్ శ్రవణముచే గలుగదు గనుక, వేదాంతవాక్యములవిషయమైన శ్రవణ మనన నిధి ధ్యాసములను మాటిమాటికి చేయవలయును.
ReplyDelete3.ఇట్టి శ్రవణాద్యభ్యాసము చేత నఃతఃకరణగతమాలిన్యము నిశ్శేషముగా నిర్వర్తించి ఆత్మతత్వజ్ఞానము అతిస్ఫుటముగా జన్మించును. జన్మించిన పిదప అజ్ఞానమును తత్కల్పితమగుభేదమును నిశ్శేషముగా స్వతంత్రముగా నివర్తింపజేయునుగాని కర్మలనుగాని, అభ్యాసమునుగాని ఆపేక్షింపదు. కర్మలు అభ్యాసము ఇవి ఆత్మజ్ఞానస్వరూపోత్పత్తికి సహాయములుగాని అవిద్యానాశమను ఫలోత్పత్తికి సహాయములుకావవి భావము.
ReplyDeleteఅవ. ఆత్మజ్ఞానము కర్మల నపేక్షించిగాని చిరకాలమునకే ఫలము నిచ్చునది యని శంకింపగా పరిహారమును చెప్పుచున్నారు.---
ReplyDeleteదం.అ. ఆత్మజ్ఞానమన్ననో ఫలసిద్ధి విషయమై పుట్టుచున్న స్వరూపము కంటె భిన్నముగా మఱియొక రూపమునుగాని సాధనమునుగాని అపేక్షింపదు.
తా. ఆత్మజ్ఞానము అంతఃకరణము శుద్ధమైనం గాని పుట్టదు. అంతఃకరణ శుద్ధి యాగదాన వేదపారాయణాది కర్మల చేత గలుగును. అంతఃకరణము మిక్కిలి శుద్ధమైన పిదప వేదాంత మహావాక్య శ్రవణము నొకసారి చేసిన మాత్రమున ఆత్మతత్వ జ్ఞానము కలుగును. అంతఃకరణము కొంచెము శుద్ధము కాగానే ఔత్సుక్యము చేత వేదాంత మహావాక్య శ్రవణమును చేసిన యెడల ఆత్మ తత్వ జ్ఞానము సకృత్ శ్రవణముచే గలుగదు గనుక, వేదాంత వాక్యముల విషయమైన శ్రవణ మనన నిధి ధ్యాసములను మాటిమాటికి చేయవలయును.
ఇట్టి శ్రవణా ద్యభ్యాసము చేత నంతఃకరణ గతమాలిన్యము నిశ్శేషముగా నిర్వర్తించి ఆత్మ తత్వజ్ఞానము అతిస్ఫుటముగా జన్మించును. జన్మించిన పిదప అజ్ఞానమును, తత్కల్పితమగు భేదమును నిశ్శేషముగా స్వతంత్రముగా నివర్తింప జేయునుగాని కర్మలనుగాని, అభ్యాసమునుగాని ఆపేక్షింపదు.
కర్మలు , అభ్యాసము ఇవి ఆత్మజ్ఞాన స్వరూపోత్పత్తికి సహాయములుగాని అవిద్యా నాశమను ఫలోత్పత్తికి సహాయములు కావవి భావము