శ్లోకాలు

1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | 35 | 36 | 37 | 38 | 39 | 40 | 41 | 42 | 43 | 44 | 45 | 46 | 47 | 48 | 49 | 50 | 51 | 52 | 53 | 54 | 55 | 56 | 57 | 58 | 59 | 60 | 61 | 62 | 63 | 64 | 65 | 66 | 67 | 68 | 69 | 70 | 71 | 72 | 73 | 74 | 75 | 76 | 77 | 78 | 79 | 80 | 81 | 82 | 83 | 84 | 85 | 86 | 87 | 88 | 89 | 90 | 91 | 92 | 93 | 94 | 95 | 96 | 97 | 98 | 99 | 100 |

updates

"నైష్కర్మ్య సిద్ధి" త్వరలో ఈ బ్లాగు మరింత ముస్తాబు కాగలదు. అప్పటి వరకూ సాధక మిత్రులు అనుభూతి ప్రకాశము అక్షరీకరణ కొనసాగించగలరని మనవి. మంగళకరమగు ఈ కార్యక్రమం నిర్విఘ్నంగా జరుగును గాక!! అక్షర యజ్ఞంలో తొలి అధ్యాయం నందలి 100 శ్లోకాల అవతారిక, దం.ఆ, తాత్పర్యాదుల అక్షరీకరణ దిగ్విజయముగా పూర్తికాబడినది.జయగురుదేవ!!

1-94




1-94

6 comments:

  1. అవ. ఆత్మజ్ఞానము అజ్ఞాన కల్పితమైనప్పటికిని పరమార్థసత్యమైన ఆత్మ స్వరూపమును గోచరింపజేయుచున్నందున అజ్ఞానమునకు విరోధిగానుండును గావున అజ్ఞానమును నివర్తింపజేయగలదని సిద్ధాంతవాది పరిహారమును జెప్పుచున్నాడు.---

    ReplyDelete
  2. దం-అ. ఇది దోషము కాదు. ఎందువలననిన ఆత్మజ్ఞానము అకల్పితమై యధార్థమైన ఆత్మవస్తువుయొక్క స్వరూపమును మాత్రము అవలంబించి యున్నందువల్లనే అజ్ఞానమును అజ్ఞానకల్పితమైన కర్తృకరుణాధి భేద సముదాయమును నశింపజేయు చున్నది.

    ReplyDelete
  3. తా. ఆత్మజ్ఞానము కర్మలవలె అజ్ఞానంవల్ల జన్మించినప్పటికిని కర్మలకంటె చాలా వైలక్షణ్యము కలదైయున్నది. అది యెట్లనిన చెప్పెదను వినుడు. కర్మలు జడమువలె మిథ్యాభూతములై (క్షణభంగురములై) ఆత్మాతిరిక్తములై స్వతః భిన్నములైయున్న వర్ణాశ్రమవయోవస్తా స్వర్గపుత్ర పశ్వన్నాదివస్తువుల నవలంబించి వానిని ప్రతిపాదించుచు బ్రవర్తించుచున్నవి.

    ReplyDelete
  4. ఆత్మజ్ఞానము చేతనమై సత్యమై స్వతః అభిన్నమైనస్వాత్మ స్వరూపమును అవలంబించి ఆయాత్మవస్తువునే ప్రతిపాదించుచు బ్రవర్తించుచున్నది కావున జడమై మిథ్యాభూతమై ఆత్మాతిరిక్తంబైన అజ్ఞానము తత్సమానస్వభావముగలిగి అజ్ఞానసమానస్వభావముగల విషయములను ప్రకాశింపజేయుకర్మల కవిరుధ్ధంబై యుండుగావున కర్మలజ్ఞానమును నివర్తింపజేయంజాలవు.

    ReplyDelete
  5. ఆత్మజ్ఞానము అవిద్యాకల్పితాంతఃకరణ వృత్తి రూపంబైనందున స్వతః జడ మై మిథ్యారూపంబైనప్పటికిని అజ్ఞానమున కత్యంతప్రతిభటంబైన చిత్సరమార్థాద్వితియ్యాత్మస్వరూపమును ప్రకాశింపజేయుచున్నందున అజ్ఞానమునకు విరోధిగానున్నది గనుక అజ్ఞానమును ఆఅజ్ఞానము చేత కల్పింపబడిన కర్రౄదిప్రపంచమును నశింపజేయుగలదని భావము.

    ReplyDelete
  6. అవ. ఆత్మజ్ఞానము అజ్ఞాన కల్పితమైనప్పటికిని పరమార్థసత్యమైన ఆత్మ స్వరూపమును గోచరింపజేయుచున్నందున అజ్ఞానమునకు విరోధిగానుండును. గావున అజ్ఞానమును నివర్తింపజేయగలదని సిద్ధాంతవాది పరిహారమును జెప్పుచున్నాడు.---


    దం-అ. ఇది దోషము కాదు. ఎందువలననిన ఆత్మజ్ఞానము అకల్పితమై యధార్థమైన ఆత్మవస్తువుయొక్క స్వరూపమును మాత్రము అవలంబించి యున్నందువల్లనే అజ్ఞానమును అజ్ఞాన కల్పితమైన కర్తృకరణాధి భేద సముదాయమును నశింపజేయు చున్నది.


    తా. ఆత్మజ్ఞానము కర్మలవలె అజ్ఞానంవల్ల జన్మించినప్పటికిని కర్మలకంటె చాలా వైలక్షణ్యము కలదైయున్నది. అది యెట్లనిన చెప్పెదను వినుడు. కర్మలు జడమువలె మిథ్యాభూతములై (క్షణభంగురములై) ఆత్మాతిరిక్తములై స్వతః భిన్నములై యున్న వర్ణాశ్రమ వయోవస్తా స్వర్గపుత్ర పశ్వన్నాది వస్తువుల నవలంబించి వానిని ప్రతిపాదించుచు బ్రవర్తించుచున్నవి.


    ఆత్మజ్ఞానము చేతనమై, సత్యమై స్వతః అభిన్నమైన స్వాత్మ స్వరూపమును అవలంబించి ఆ యాత్మ వస్తువునే ప్రతిపాదించుచు బ్రవర్తించుచున్నది కావున జడమై మిథ్యాభూతమై ఆత్మాతిరిక్తంబైన అజ్ఞానము తత్సమాన స్వభావము గలిగి అజ్ఞాన సమాన స్వభావము గల విషయములను ప్రకాశింపజేయు కర్మల కవిరుధ్ధంబై యుండు గావున కర్మ లజ్ఞానమును నివర్తింప జేయంజాలవు.


    ఆత్మజ్ఞానము అవిద్యా కల్పితాంతఃకరణ వృత్తి రూపంబైనందున స్వతః జడ మై మిథ్యా రూపంబైనప్పటికిని అజ్ఞానమున కత్యంత ప్రతిభటంబైన చిత్పరమార్థా ద్వితియ్యాత్మ స్వరూపమును ప్రకాశింప జేయుచున్నందున అజ్ఞానమునకు విరోధిగానున్నది . గనుక అజ్ఞానమును ఆ అజ్ఞానము చేత కల్పింపబడిన కర్రౄది ప్రపంచమును నశింపజేయ గలదని భావము.

    ReplyDelete

గురు స్మరణతో, రామకార్యంగా తలచి, ఆత్మభావనలో స్థిరపడేందుకు కావల్సిన చిత్తశుద్ధికై, ఈ నిష్కామ కర్మ రూప అక్షరయజ్ఞాన్ని, శ్లోక తాత్పర్యాది భావాన్ని చక్కగా అవగాహన చేసికొనుచు చేయ ప్రయత్నిద్దాము..

పైనున్న శ్లోకము యొక్క అవతారికను, తాత్పర్యమును ఈ దిగువ టైపు చేసిన చాలును. శ్లోకము టైపు చేయవలసిన అవసరము లేదు.

సంఖ్యలో ఎన్ని ఎక్కువ చేశాము అనేకంటే, అక్షర దోషములు ఏ ఒక్కటి తలెత్తకుండా రోజుకు ఒక్కరు కనీసం ఒక్కశ్లోకం పూర్తిగా చేసినా చాలును. త్వరితగతిన ఈ గురుకార్యం సఫలీకృతమగునని విన్నవించడమైనది.