శ్లోకాలు
1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | 35 | 36 | 37 | 38 | 39 | 40 | 41 | 42 | 43 | 44 | 45 | 46 | 47 | 48 | 49 | 50 | 51 | 52 | 53 | 54 | 55 | 56 | 57 | 58 | 59 | 60 | 61 | 62 | 63 | 64 | 65 | 66 | 67 | 68 | 69 | 70 | 71 | 72 | 73 | 74 | 75 | 76 | 77 | 78 | 79 | 80 | 81 | 82 | 83 | 84 | 85 | 86 | 87 | 88 | 89 | 90 | 91 | 92 | 93 | 94 | 95 | 96 | 97 | 98 | 99 | 100 |
updates
2 comments:
గురు స్మరణతో, రామకార్యంగా తలచి, ఆత్మభావనలో స్థిరపడేందుకు కావల్సిన చిత్తశుద్ధికై, ఈ నిష్కామ కర్మ రూప అక్షరయజ్ఞాన్ని, శ్లోక తాత్పర్యాది భావాన్ని చక్కగా అవగాహన చేసికొనుచు చేయ ప్రయత్నిద్దాము..
పైనున్న శ్లోకము యొక్క అవతారికను, తాత్పర్యమును ఈ దిగువ టైపు చేసిన చాలును. శ్లోకము టైపు చేయవలసిన అవసరము లేదు.
సంఖ్యలో ఎన్ని ఎక్కువ చేశాము అనేకంటే, అక్షర దోషములు ఏ ఒక్కటి తలెత్తకుండా రోజుకు ఒక్కరు కనీసం ఒక్కశ్లోకం పూర్తిగా చేసినా చాలును. త్వరితగతిన ఈ గురుకార్యం సఫలీకృతమగునని విన్నవించడమైనది.
Subscribe to:
Posts (Atom)
అవ. బ్రహ్మస్వరూపయాధార్ధ్యమును స్పష్టముగా జెప్పినందున తన యాచార్యులు బ్రహ్మస్వరూపమును యథార్థముగ చెప్పలేదని తోచుచున్నది. అందుచే దన యాచార్యులకు బ్రహ్మస్వరూపము బాగుగ దెలియలేదనిగాని విపరీతముగ దెలిసినదియనిగాని చెప్పవలయు. అట్లు చెప్పినచో దన కాయాచార్యోపదేశముచే బ్రాప్తించిన బ్రహ్మజ్ఞాన మజ్ఞానప్రాయమనిగాని విపరీతమనిగాని చెప్పవలయును గదా!అప్పు డీగ్రంధమున బ్రహ్మస్వరూపయాధార్ధ్యమును స్పష్టముగా చెప్పెదనని చేసిన ప్రతిజ్ఞ యసంగతమగునని యోచించి తనయాచార్యులయం దజ్ఞానవిపరీతజ్ఞానములు లేవవిచెప్పుటకీయుత్తరశ్లోకము వర్తించుచున్నదని చెప్పుచున్నారు.----
ReplyDeleteదం--అ. చెప్పదలచినప్రకరణార్ధమున శిష్యులకు రుచినిబుట్టించుకొఱకు ఆయథార్థవాదిత్వబుద్ధికి నిమిత్తములైన అనుక్తదురుక్తములయొక్క శంకను నిరాకరించుట చేత స్వాచార్యులకు యథార్థవాదిత్వమును వర్ణించుట యావశ్యకమైయున్నది.
తా. ఈప్రకరణమున తాను జెప్పందలచిన యర్ధమునందు శిష్యులకు రుచిగలిగినంగాని వా రాయర్ధమునందు బ్రవర్తింపరు గావున శిష్యులకు రుచిని యవశ్యముగా సంపాదింపవలసియున్నది. అందులకై స్వాచార్యులు యదార్థ వాదియని, సర్వజ్ఞులని చెప్పి వారియనుగ్రహముచే దనకు ప్రాప్తించినజ్ఞాన మీప్రకరణములో జెప్పబడెనని వర్ణింపవలయు. తనగురువులు నిర్మించిన శారీరకభాష్యాదిగ్రంధములలో చెప్పవలసినయర్ధములు చెప్పకపోవుటగాని విపరీతముగ జెప్పుటగాని లేదుగావున స్వాచార్యులు సర్వజ్ఞులును యథార్థవాదులును అని భావము.
అవ. బ్రహ్మస్వరూపయాధార్ధ్యమును స్పష్టముగా జెప్పినందున తన యాచార్యులు బ్రహ్మస్వరూపమును యథార్థముగ చెప్పలేదని తోచుచున్నది. అందుచే దన యాచార్యులకు బ్రహ్మస్వరూపము బాగుగ దెలియలేదనిగాని విపరీతముగ దెలిసినదియనిగాని చెప్పవలయు. అట్లు చెప్పినచో దన కాయాచార్యోపదేశముచే బ్రాప్తించిన బ్రహ్మజ్ఞాన మజ్ఞానప్రాయమనిగాని విపరీతమనిగాని చెప్పవలయును గదా!అప్పు డీగ్రంధమున బ్రహ్మస్వరూపయాధార్ధ్యమును స్పష్టముగా చెప్పెదనని చేసిన ప్రతిజ్ఞ యసంగతమగునని యోచించి తనయాచార్యులయం దజ్ఞానవిపరీతజ్ఞానములు లేవని చెప్పుటకీ యుత్తరశ్లోకము వర్తించుచున్నదని చెప్పుచున్నారు.----
ReplyDeleteదం--అ. చెప్పదలచినప్రకరణార్ధమున శిష్యులకు రుచినిబుట్టించుకొఱకు అయథార్థవాదిత్వబుద్ధికి నిమిత్తములైన అనుక్తదురుక్తములయొక్క శంకను నిరాకరించుట చేత స్వాచార్యులకు యథార్థవాదిత్వమును వర్ణించుట యావశ్యకమైయున్నది.
తా. ఈ ప్రకరణమున తాను జెప్పందలచిన యర్ధమునందు శిష్యులకు రుచిగలిగినంగాని వా రాయర్ధమునందు బ్రవర్తింపరు గావున శిష్యులకు రుచిని యవశ్యముగా సంపాదింపవలసియున్నది. అందులకై స్వాచార్యులు యదార్థ వాదియని, సర్వజ్ఞులని చెప్పి వారియనుగ్రహముచే దనకు ప్రాప్తించిన జ్ఞాన మీప్రకరణములో జెప్పబడెనని వర్ణింపవలయు. తనగురువులు నిర్మించిన శారీరకభాష్యాది గ్రంధములలో చెప్పవలసిన యర్ధములు చెప్పకపోవుటగాని విపరీతముగ జెప్పుటగాని లేదుగావున స్వాచార్యులు సర్వజ్ఞులును యథార్థవాదులును అని భావము.