శ్లోకాలు

1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | 35 | 36 | 37 | 38 | 39 | 40 | 41 | 42 | 43 | 44 | 45 | 46 | 47 | 48 | 49 | 50 | 51 | 52 | 53 | 54 | 55 | 56 | 57 | 58 | 59 | 60 | 61 | 62 | 63 | 64 | 65 | 66 | 67 | 68 | 69 | 70 | 71 | 72 | 73 | 74 | 75 | 76 | 77 | 78 | 79 | 80 | 81 | 82 | 83 | 84 | 85 | 86 | 87 | 88 | 89 | 90 | 91 | 92 | 93 | 94 | 95 | 96 | 97 | 98 | 99 | 100 |

updates

"నైష్కర్మ్య సిద్ధి" త్వరలో ఈ బ్లాగు మరింత ముస్తాబు కాగలదు. అప్పటి వరకూ సాధక మిత్రులు అనుభూతి ప్రకాశము అక్షరీకరణ కొనసాగించగలరని మనవి. మంగళకరమగు ఈ కార్యక్రమం నిర్విఘ్నంగా జరుగును గాక!! అక్షర యజ్ఞంలో తొలి అధ్యాయం నందలి 100 శ్లోకాల అవతారిక, దం.ఆ, తాత్పర్యాదుల అక్షరీకరణ దిగ్విజయముగా పూర్తికాబడినది.జయగురుదేవ!!

1-76








1-76

3 comments:

  1. This comment has been removed by the author.

    ReplyDelete
  2. అవ. ఆ విచారప్రకారమును చూపించుచున్నారు. -------

    దం - ఆ. నిషిద్ధములై యాదృఛ్ఛికములైన కృత్యములయందు సహజమైన తన బుద్ధిచేతబుట్టిన కారణమువల్లనే ఇది యనుకూలమని ఇది ప్రతికూలమని కల్పించుకొని ఎండమావులజలమును త్రాగ నిచ్చగించినవానివలె లోకసిద్ధప్రమాణములచే బ్రసిద్ధములైన సాధములనే గ్రహించి అనుకూలవిషయమును పొందుకొఱకు, ప్రతికూలవిషయమును పరిహరించుకొఱకును స్వయముగా నేప్రకారము ప్రవర్తించునో, నివర్తించునో ఆప్రకారమే అదృష్టమే ప్రయోజనముగాగల కామ్యకర్మలయందును నిత్యకర్మలయందును ప్రవర్తించునా, లేక దానియందు ప్రవృత్తినివృత్తులకు కారణము వేఱుగనుండునా యని విమర్శించెద మని వెనుకటివాక్యముతో నన్వయము.

    తా. ఈలోకములో నీదేహముతోనే యనుభవింపదగిన ఫలముగల కృత్యములు దృష్టార్థములనియు, పరలోకములో దేహాంతరముతో ననుభవింపదగిన ఫలముగల కృత్యములు అదృష్టార్థములనియు జెప్పబడును. దృష్టార్థములు నిషిద్ధము లని, యాదృచ్ఛికము లని రెండువిధములు. ద్యూతము, పరదారగమనము, చౌర్యము మొదలగు కృత్యములు దృష్టార్థనిషిద్ధములు. వీనియొక్కఫలమైన ద్రవ్యనాశ, రాజదండనాదిదుఃఖము ఈదేహముతోనే యనుభవింపబడుచున్నందున ఇవి దృష్టార్థ నిషిద్ధము లని చెప్పబడుచున్నవి. శయనాసనభోజనేష్టవిహారాదికృత్యములు దృష్టార్థ యాదృఛ్ఛికములు నాబడు. వీనియొక్క ఫలమైన శ్రమాపనయన, క్షున్నివృత్యాది పూర్వకసుఖము ఈదేహముతోనే యనుభవింపబడుచున్నందునను ఇవి దృష్టార్థ యాదృచ్ఛికకృత్యము లనబడును. అదృష్టార్థకృత్యములలోగూడ నిషిద్ధము లని, విహితము లని రెండుప్రకారములు గలవు.

    సురాపానాదికృత్యములు నిషిద్ధము లని, జ్యోతిష్టోమాదికృత్యములు విహితము లని చెప్పబడును. వీనియొక్క ఫలమైన నరకస్వర్గములు పరలోకమునందే దేహాంతరముచేత ననుభవింప దగియున్నందున నవి యదృష్టార్థ కృత్యము లనంబడు. వీనిలో దృష్టార్థములైన నిషిద్ధ కృత్యంబులందును, యాదృచ్ఛికకృత్యములయందును పురుషుడు ప్రవర్తించునపుడు శాస్త్రజ్ఞానము నపేక్షింపకయే సహజముగా బుట్టిన స్వబుద్ధిచేత (అనగా నేను సుఖమునుపొందకయుంటిని, దుఃఖముల ననుభవించుచుంటిని, ఏలాగైనను సుఖమును నేను పొందవలసియున్నది, దుఃఖమును నివారించుకొనవలసియున్నది. అనుబుద్ధి శాస్త్రమును చదివినను, చదువకపోయినను సర్వసాధారణముగ నందఱకు గలుగుచున్నది.) ప్రవర్తించును. ఇట్టి స్వబుద్ధిచేత, సుఖమునందు రాగము, దుఃఖమునందు ద్వేషమును బుట్టినప్పుడు ఎదుట నుండు వస్తువులలో వేనియందు రాగము ప్రవర్తించునో వానిని అనుకూలము లనియు, వేనియందు ద్వేషము ప్రవర్తించునో వానిని ప్రతికూలము లనియు గల్పించుకొని అనుకూలము లయిన వస్తువులు తనకు లభించుకొఱకు, ప్రతికూలములు తొలగిపోవుకొఱకు ఏవి సాధనములుగా నుండునో వానిని శాస్త్రాపేక్షలేకయే కేవల లోకోపచారమునుబట్టి తెలిసికొని ఆసాధనముల ననుసరించి అనుకూలసుఖప్రాప్తికొఱకు ప్రవర్తించుచు ప్రతికూలదుఃఖ నివారణముకొఱకు నివర్తించుచు నుండునుగదా? ఈప్రకారమే యదృష్టార్థకృత్యములయందును ప్రవర్తించునా? లేక శాస్త్రములను విచారించి అందుచేత బుట్టిన సమ్యక్ జ్ఞాన మవలంబించి ప్రవర్తించునా? యని విచారించెద మని భావము.

    అనగా గ్రీష్మకాలములో మధ్యాహ్నపువేళ చవిటి నేలయందు నెండమావులు ప్రవర్తించిన వానిం జూచి వివేకములేనివాడు మహాతటాకజలము లని తలచి ఆయుదకమును పుచ్చుకొని దప్పిదీర్చుకొన నిచ్చగించి ప్రవర్తించునట్టివాని ప్రవృత్తికి నిమిత్తము జలము కానిదానియందు జలమును బుద్ధియే గదా! ఇదియే మిథ్యాజ్ఞానము. ఈప్రకారమే దృష్టార్థకృత్యములయందు పురుషులు ప్రవర్తించుటకు నిమిత్తము శాస్త్రజ్ఞాననిరపేక్ష కేవలస్వాభిప్రాయజనిత రాగద్వేష కల్పితానుకూలప్రతికూలాధ్యాసరూపమైన మిథ్యాజ్ఞానముగ గదా కాన్పించుచున్నది. అదృష్టార్థకృత్యములయందు బ్రవర్తించుటకు నీమిథ్యాజ్ఞానమే నిమిత్తమా? లేక శాస్త్రవిచారజనిత సమ్యక్ జ్ఞానమా? యని తాత్పర్యము. ఈలోకములోని ప్రతివస్తువునందును అనుకూలత్వముగాని ప్రతికూలత్వముగాని నియతముగా లేదు. ఆయాపురుషులయొక్క బుద్ధిభేదము నవలంబించి దేశకాలావస్థాన విశేషములను బట్టి అప్పుడప్పుడు అనుకూలత్వప్రతికూలత్వములు కల్పింపబడుచుండు గావున ఆయా పదార్థములయొక్క అనుకూలత్వప్రతికూలత్వవిషయమైనబుద్ధి మిథ్యాజ్ఞానమని యెఱుంగునది.

    ReplyDelete
  3. అవ. ఆ విచారప్రకారమును చూపించుచున్నారు. -------

    దం - ఆ. నిషిద్ధములై యాదృఛ్ఛికములైన కృత్యములయందు సహజమైన తన బుద్ధిచేతబుట్టిన కారణమువల్లనే ఇది యనుకూలమని ఇది ప్రతికూలమని కల్పించుకొని ఎండమావులజలమును త్రాగ నిచ్చగించినవానివలె లోకసిద్ధప్రమాణములచే బ్రసిద్ధములైన సాధములనే గ్రహించి అనుకూలవిషయమును పొందుకొఱకు, ప్రతికూలవిషయమును పరిహరించుకొఱకును స్వయముగా నేప్రకారము ప్రవర్తించునో, నివర్తించునో ఆప్రకారమే అదృష్టమే ప్రయోజనముగాగల కామ్యకర్మలయందును నిత్యకర్మలయందును ప్రవర్తించునా, లేక దానియందు ప్రవృత్తినివృత్తులకు కారణము వేఱుగనుండునా యని విమర్శించెద మని వెనుకటి వాక్యముతో నన్వయము.


    తా. ఈలోకములో నీదేహముతోనే యనుభవింపదగిన ఫలముగల కృత్యములు దృష్టార్థములనియు, పరలోకములో దేహాంతరముతో ననుభవింపదగిన ఫలముగల కృత్యములు అదృష్టార్థములనియు జెప్పబడును. దృష్టార్థములు నిషిద్ధము లని, యాదృచ్ఛికము లని రెండువిధములు. ద్యూతము, పరదారగమనము, చౌర్యము మొదలగు కృత్యములు దృష్టార్థనిషిద్ధములు. వీనియొక్కఫలమైన ద్రవ్యనాశ, రాజదండనాదిదుఃఖము ఈదేహముతోనే యనుభవింపబడుచున్నందున ఇవి దృష్టార్థ నిషిద్ధము లని చెప్పబడుచున్నవి. 

             శయనాసన భోజనేష్ట విహారాది కృత్యములు దృష్టార్థ యాదృఛ్ఛికములు నాబడు. వీనియొక్క ఫలమైన శ్రమాపనయన, క్షున్నివృత్యాది పూర్వకసుఖము ఈదేహముతోనే యనుభవింపబడుచున్నందునను ఇవి దృష్టార్థ యాదృచ్ఛిక కృత్యము లనబడును. అదృష్టార్థకృత్యములలోగూడ నిషిద్ధము లని, విహితము లని రెండుప్రకారములు గలవు.


    సురాపానాదికృత్యములు నిషిద్ధము లని, జ్యోతిష్టోమాదికృత్యములు విహితము లని చెప్పబడును. వీనియొక్క ఫలమైన నరకస్వర్గములు పరలోకమునందే దేహాంతరముచేత ననుభవింప దగియున్నందున నవి యదృష్టార్థ కృత్యము లనంబడు. వీనిలో దృష్టార్థములైన నిషిద్ధ కృత్యంబులందును, యాదృచ్ఛికకృత్యముల యందును పురుషుడు ప్రవర్తించునపుడు శాస్త్రజ్ఞానము నపేక్షింపకయే సహజముగా బుట్టిన స్వబుద్ధిచేత (అనగా నేను సుఖమును పొందకయుంటిని, దుఃఖముల ననుభవించుచుంటిని, ఏలాగైనను సుఖమును నేను పొందవలసియున్నది, దుఃఖమును నివారించుకొనవలసియున్నది. అనుబుద్ధి శాస్త్రమును చదివినను, చదువకపోయినను సర్వసాధారణముగ నందఱకు గలుగుచున్నది.) ప్రవర్తించును. ఇట్టి స్వబుద్ధిచేత, సుఖమునందు రాగము, దుఃఖమునందు ద్వేషమును బుట్టినప్పుడు ఎదుట నుండు వస్తువులలో వేనియందు రాగము ప్రవర్తించునో వానిని అనుకూలము లనియు, వేనియందు ద్వేషము ప్రవర్తించునో వానిని ప్రతికూలము లనియు గల్పించుకొని అనుకూలము లయిన వస్తువులు తనకు లభించుకొఱకు, ప్రతికూలములు తొలగిపోవుకొఱకు ఏవి సాధనములుగా నుండునో వానిని శాస్త్రాపేక్షలేకయే కేవల లోకోపచారమును బట్టి తెలిసికొని ఆసాధనముల ననుసరించి అనుకూల సుఖప్రాప్తి కొఱకు ప్రవర్తించుచు ప్రతికూల దుఃఖ నివారణము కొఱకు నివర్తించుచు నుండునుగదా? ఈప్రకారమే యదృష్టార్థ కృత్యముల యందును ప్రవర్తించునా? లేక శాస్త్రములను విచారించి అందుచేత బుట్టిన సమ్యక్ జ్ఞాన మవలంబించి ప్రవర్తించునా? యని విచారించెద మని భావము.


    అనగా గ్రీష్మకాలములో మధ్యాహ్నపువేళ చవిటి నేలయందు నెండమావులు ప్రవర్తించిన వానిం జూచి వివేకములేనివాడు మహాతటాకజలము లని తలచి ఆయుదకమును పుచ్చుకొని దప్పిదీర్చుకొన నిచ్చగించి ప్రవర్తించునట్టివాని ప్రవృత్తికి నిమిత్తము జలము కానిదానియందు జలమును బుద్ధియే గదా! ఇదియే మిథ్యాజ్ఞానము. 

             ఈప్రకారమే దృష్టార్థకృత్యములయందు పురుషులు ప్రవర్తించుటకు నిమిత్తము శాస్త్రజ్ఞాననిరపేక్ష కేవల స్వాభిప్రాయ జనిత రాగద్వేష కల్పితానుకూల ప్రతికూలాధ్యాస రూపమైన మిథ్యాజ్ఞానముగ గదా కాన్పించుచున్నది. అదృష్టార్థకృత్యములయందు బ్రవర్తించుటకు నీమిథ్యాజ్ఞానమే నిమిత్తమా? లేక శాస్త్రవిచారజనిత సమ్యక్ జ్ఞానమా? యని తాత్పర్యము. ఈలోకములోని ప్రతివస్తువునందును అనుకూలత్వముగాని ప్రతికూలత్వముగాని నియతముగా లేదు. ఆయాపురుషులయొక్క బుద్ధిభేదము నవలంబించి దేశకాలావస్థాన విశేషములను బట్టి అప్పుడప్పుడు అనుకూలత్వప్రతికూలత్వములు కల్పింపబడుచుండు గావున ఆయా పదార్థములయొక్క అనుకూలత్వప్రతికూలత్వవిషయమైనబుద్ధి మిథ్యాజ్ఞానమని యెఱుంగునది.

    ReplyDelete

గురు స్మరణతో, రామకార్యంగా తలచి, ఆత్మభావనలో స్థిరపడేందుకు కావల్సిన చిత్తశుద్ధికై, ఈ నిష్కామ కర్మ రూప అక్షరయజ్ఞాన్ని, శ్లోక తాత్పర్యాది భావాన్ని చక్కగా అవగాహన చేసికొనుచు చేయ ప్రయత్నిద్దాము..

పైనున్న శ్లోకము యొక్క అవతారికను, తాత్పర్యమును ఈ దిగువ టైపు చేసిన చాలును. శ్లోకము టైపు చేయవలసిన అవసరము లేదు.

సంఖ్యలో ఎన్ని ఎక్కువ చేశాము అనేకంటే, అక్షర దోషములు ఏ ఒక్కటి తలెత్తకుండా రోజుకు ఒక్కరు కనీసం ఒక్కశ్లోకం పూర్తిగా చేసినా చాలును. త్వరితగతిన ఈ గురుకార్యం సఫలీకృతమగునని విన్నవించడమైనది.