శ్లోకాలు
1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | 35 | 36 | 37 | 38 | 39 | 40 | 41 | 42 | 43 | 44 | 45 | 46 | 47 | 48 | 49 | 50 | 51 | 52 | 53 | 54 | 55 | 56 | 57 | 58 | 59 | 60 | 61 | 62 | 63 | 64 | 65 | 66 | 67 | 68 | 69 | 70 | 71 | 72 | 73 | 74 | 75 | 76 | 77 | 78 | 79 | 80 | 81 | 82 | 83 | 84 | 85 | 86 | 87 | 88 | 89 | 90 | 91 | 92 | 93 | 94 | 95 | 96 | 97 | 98 | 99 | 100 |
updates
2 comments:
గురు స్మరణతో, రామకార్యంగా తలచి, ఆత్మభావనలో స్థిరపడేందుకు కావల్సిన చిత్తశుద్ధికై, ఈ నిష్కామ కర్మ రూప అక్షరయజ్ఞాన్ని, శ్లోక తాత్పర్యాది భావాన్ని చక్కగా అవగాహన చేసికొనుచు చేయ ప్రయత్నిద్దాము..
పైనున్న శ్లోకము యొక్క అవతారికను, తాత్పర్యమును ఈ దిగువ టైపు చేసిన చాలును. శ్లోకము టైపు చేయవలసిన అవసరము లేదు.
సంఖ్యలో ఎన్ని ఎక్కువ చేశాము అనేకంటే, అక్షర దోషములు ఏ ఒక్కటి తలెత్తకుండా రోజుకు ఒక్కరు కనీసం ఒక్కశ్లోకం పూర్తిగా చేసినా చాలును. త్వరితగతిన ఈ గురుకార్యం సఫలీకృతమగునని విన్నవించడమైనది.
Subscribe to:
Posts (Atom)
అవ. ఓయీ! నిత్యనైమిత్తికకర్మలకు ఫలము చెప్పబడియుండలేదు. అయినను కర్మలైనందున ఫలమును కోరుచుండును. మోక్షమును ఫలమైనందున సాధనముల నపేక్షించుచుండు గావున నీరెంటికిని సంబంధముకలుగజేసిన నిత్యనైమిత్తికకర్మలకు మోక్షమే ఫలమని సిద్దించునని శంకించుకొని పరిహరించుచున్నారు. -------
ReplyDeleteదం-అ. సకలవిధమైనకర్మకును ఉత్పత్తిచేతనే ఒకానొకవిశేషఫలముతోడ సంబంధముకలిగియున్నందున పారిశేష్యన్యాయము సిద్ధింపదు.
తా. నిత్యనైమిత్తికకర్మలకును ఫలశ్రవణములేని యితరకర్మలకును ఆయాకర్మలయొక్క స్వరూపమును విధించిన యుత్పత్తివాక్యముచేతనే ఫలముకూడ సంగ్రహింపబడియున్నది. అనగా 'విశ్వజితాయజేత' యనుశృతివాక్యముచే, విశ్వజిద్యాగమనునొకకర్మ విధింపబడుచున్నది. ఈకర్మకు ఫలము వినబడియుండలేదు. అయినను దీనికి స్వర్గమే ఫలమని జైమినిమహాముని నిర్ణయించి ఈప్రకారమే యేయేకర్మలకు ఫలము వినబడియుండదో వానికన్నింటికిని స్వర్గమునే ఫలమునుగ కల్పించుకొనవలయునని న్యాయమును చూపించియున్నారు గావున అగ్నిహోత్రము హోతీత్యాదిశృతివాక్యములచే విధింపబడుచున్న యగ్నిహోత్రాది కర్మలకు ఫలము వినబడకపోయినను విశ్వజిద్యాగమునకువలె స్వర్గఫలముతోడ సంబంధము సిద్ధమైయున్నది గావున పారిశేష్య న్యాయమును బట్టి నిత్యనైమిత్తికకర్మలకు మోక్షము ఫలమని చెప్పదగదని భావము.
పారిశేష్యన్యాయమే నష్టాశ్వదగ్ధరథన్యాయమని చెప్పబడు. ఆన్యాయ మెట్లనిన, ఇరువురు పురుషు లొకగ్రామమునుండి అశ్వములబూన్చిన రథములనెక్కి ప్రయాణమైపోవుచుండ మార్గమధ్యమున నొకయుపద్రవము సంభవించి యొకనికి రథంబు కాలి, మఱియొకనియశ్వములు మడిసె. అంతనయ్యిరువురిలో రథముగాలినవాడు తనకశ్వంబులుండినను రథంబులేమింజేసి తనపయనము సాగమి నాలోచించి యెచ్చటనైనను నొక రథము దొరకునా యని యాలోచించుచుండెను. అశ్వంబులు నశించినవాడు తనకు రథంబున్నను గుఱ్ఱములులేమికి జింతించుచు నెచ్చోటనైన నశ్వంబులు చిక్కునా యని విచారించుచుండెను. అంతట వారిరువురునొకచోజేరి తమతమలోపంబుల నొండొరులతో జెప్పుకొని రథము నపేక్షించువానికి అశ్వహీనమైన రథమును అశ్వముల నపేక్షించువానికి రథహీనములైన యశ్వములును దొరకినందున సంతసించుచు నారథాశ్వలంగూర్చుకొని యారథంబెక్కి వారిరువురు తమ యభిమతనగరమును జేరిరి. ఈప్రకారమే ప్రస్తుతమున అగ్నిహోత్రాదికర్మలు ఫలరహితములై విధింపబడియున్నందున ఫలమును గోరియున్నవి. మోక్షము ఫలమైయున్నందున సాధనములను కోరియున్నది. ఈరెండును పరస్పరాకాంక్షకలవై యున్నందునను, అగ్నిహోత్రాదికర్మలకు మఱియొకఫలముగాని మోక్షమునకు మఱియొకసాధనముగాని వినబడకయున్నందునను అగ్నిహోత్రాదికర్మలకు మోక్షమే ఫల మని పూర్వపక్షవాదియొక్క తాత్పర్యము. అగ్నిహోత్రాదికర్మలకు విశ్వజిద్యాగమువలె స్వర్గమే ఫలమైయున్నందున ఫలాకాంక్షలేదు గావున మోక్షము ఫలముగా సంబంధింప దని సిద్ధాంతియొక్క తాత్పర్యము.
అవ. ఓయీ! నిత్యనైమిత్తికకర్మలకు ఫలము చెప్పబడియుండలేదు. అయినను కర్మలైనందున ఫలమును కోరుచుండును. మోక్షమును ఫలమైనందున సాధనముల నపేక్షించుచుండు గావున నీరెంటికిని సంబంధము కలుగజేసిన నిత్యనైమిత్తిక కర్మలకు మోక్షమే ఫలమని సిద్దించునని శంకించుకొని పరిహరించుచున్నారు. -------
ReplyDeleteదం-అ. సకలవిధమైనకర్మకును ఉత్పత్తిచేతనే ఒకానొక విశేషఫలము తోడ సంబంధము కలిగియున్నందున పారిశేష్యన్యాయము సిద్ధింపదు.
తా. నిత్యనైమిత్తిక కర్మలకును ఫలశ్రవణములేని యితరకర్మలకును ఆయా కర్మలయొక్క స్వరూపమును విధించిన యుత్పత్తి వాక్యముచేతనే ఫలముకూడ సంగ్రహింపబడియున్నది. అనగా 'విశ్వజితాయజేత' యను శృతివాక్యముచే, విశ్వజిద్యాగమను నొకకర్మ విధింపబడుచున్నది.
ఈకర్మకు ఫలము వినబడియుండలేదు. అయినను దీనికి స్వర్గమే ఫలమని జైమినిమహాముని నిర్ణయించి ఈప్రకారమే యేయేకర్మలకు ఫలము వినబడియుండదో వానికన్నింటికిని స్వర్గమునే ఫలమునుగ కల్పించుకొనవలయునని న్యాయమును చూపించియున్నారు గావున అగ్నిహోత్రము హోతీత్యాది శృతివాక్యములచే విధింపబడుచున్న యగ్నిహోత్రాది కర్మలకు ఫలము వినబడకపోయినను విశ్వజిద్యాగమునకువలె స్వర్గఫలముతోడ సంబంధము సిద్ధమైయున్నది గావున పారిశేష్య న్యాయమును బట్టి నిత్యనైమిత్తిక కర్మలకు మోక్షము ఫలమని చెప్పదగదని భావము.
పారిశేష్యన్యాయమే నష్టాశ్వదగ్ధరథన్యాయమని చెప్పబడు. ఆన్యాయ మెట్లనిన, ఇరువురు పురుషు లొకగ్రామమునుండి అశ్వములబూన్చిన రథములనెక్కి ప్రయాణమైపోవుచుండ మార్గమధ్యమున నొకయుపద్రవము సంభవించి యొకనికి రథంబు కాలి, మఱియొకనియశ్వములు మడిసె. అంతనయ్యిరువురిలో రథముగాలినవాడు తనకశ్వంబులుండినను రథంబు లేమింజేసి తనపయనము సాగమి నాలోచించి యెచ్చటనైనను నొక రథము దొరకునా యని యాలోచించుచుండెను.
అశ్వంబులు నశించినవాడు తనకు రథంబున్నను గుఱ్ఱములు లేమికి జింతించుచు నెచ్చోటనైన నశ్వంబులు చిక్కునా యని విచారించుచుండెను. అంతట వారిరువురు నొకచోజేరి తమతమ లోపంబుల నొండొరులతో జెప్పుకొని రథము నపేక్షించువానికి అశ్వహీనమైన రథమును , అశ్వముల నపేక్షించువానికి రథహీనములైన యశ్వములును దొరకినందున సంతసించుచు నారథాశ్వలంగూర్చుకొని యారథంబెక్కి వారిరువురు తమ యభిమత నగరమును జేరిరి.
ఈప్రకారమే ప్రస్తుతమున అగ్నిహోత్రాదికర్మలు ఫల రహితములై విధింపబడి యున్నందున ఫలమును గోరియున్నవి. మోక్షము ఫలమైయున్నందున సాధనములను కోరియున్నది. ఈరెండును పరస్పరా కాంక్షకలవై యున్నందునను, అగ్నిహోత్రాదికర్మలకు మఱియొక ఫలముగాని మోక్షమునకు మఱియొక సాధనముగాని వినబడక యున్నందునను అగ్నిహోత్రాదికర్మలకు మోక్షమే ఫల మని పూర్వపక్షవాదియొక్క తాత్పర్యము.
అగ్నిహోత్రాది కర్మలకు విశ్వజిద్యాగమువలె స్వర్గమే ఫలమై యున్నందున ఫలాకాంక్షలేదు గావున మోక్షము ఫలముగా సంబంధింప దని సిద్ధాంతియొక్క తాత్పర్యము.