శ్లోకాలు

1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | 35 | 36 | 37 | 38 | 39 | 40 | 41 | 42 | 43 | 44 | 45 | 46 | 47 | 48 | 49 | 50 | 51 | 52 | 53 | 54 | 55 | 56 | 57 | 58 | 59 | 60 | 61 | 62 | 63 | 64 | 65 | 66 | 67 | 68 | 69 | 70 | 71 | 72 | 73 | 74 | 75 | 76 | 77 | 78 | 79 | 80 | 81 | 82 | 83 | 84 | 85 | 86 | 87 | 88 | 89 | 90 | 91 | 92 | 93 | 94 | 95 | 96 | 97 | 98 | 99 | 100 |

updates

"నైష్కర్మ్య సిద్ధి" త్వరలో ఈ బ్లాగు మరింత ముస్తాబు కాగలదు. అప్పటి వరకూ సాధక మిత్రులు అనుభూతి ప్రకాశము అక్షరీకరణ కొనసాగించగలరని మనవి. మంగళకరమగు ఈ కార్యక్రమం నిర్విఘ్నంగా జరుగును గాక!! అక్షర యజ్ఞంలో తొలి అధ్యాయం నందలి 100 శ్లోకాల అవతారిక, దం.ఆ, తాత్పర్యాదుల అక్షరీకరణ దిగ్విజయముగా పూర్తికాబడినది.జయగురుదేవ!!

1-89




1-89

2 comments:

  1. దం-అ. "స్వభావతః" అనుపదము శ్లోకముతోజేరి యన్వయించుచున్నది. స్వభావముగ పరిహరింపబడి పొందబడియున్నవానియొక్క పరిహారలాభములు జ్ఞానమువలన గలుగునుగాని కర్మచేత గలుగవు. ఆపరిహారలాభములు అజ్ఞానముమాత్రమే ప్రతిబంధకముగా గలిగియున్నందున కర్మచేత సిద్ధింపవు.

    తా. సహజముగ పరిహరింపబడియుండియును అజ్ఞానముచేత పరిహరింపబడలేదని యెన్నబడెడివిషయము జ్ఞానముచేతనే పరిహరింపబడును. సహజముగ పొందబడియుండును. అజ్ఞానముచేత పొందబడలేదని తలపబడెడి విషయమును జ్ఞానము చేతనే పొందబడునుగాని కర్మలచేత పరిహరింపబడదు. పొందను బడదు. అది యెందువల్లననగా పరిహృతపరిహార్యమునకును ప్రాప్తప్రాప్తవ్యమునకును అజ్ఞానమేకారణమైనందున అజ్ఞానము నివర్తించినంగాని పరిహృత పరిహార్య ప్రాప్తప్రాప్తవ్యముల యొక్క పరిహారలాభములు కలుగవు. అజ్ఞానము జ్ఞానముచేత నివర్తించునుగాని, కర్మచేత నివర్తింపదని భావము.

    అనగా తనచరణాభరణమును (నూపురమును) చూచి భ్రాంతిచేత సర్పమనుకొని భీతినొంది ఆసర్పమును నివర్తింపజేసికొనవలయు ననగా ఇది సర్పముకాదు, నూపురమే యనుజ్ఞానమును సంపాదించుకొనవలయును. అట్టిజ్ఞానముచేత అజ్ఞానము నివర్తించి సర్పముకూడ నివర్తించునుగాని గరుడధ్యానమును జేసిన నివర్తింపదుగదా. తనకంఠమునందున్న ముక్తాహారమును భ్రాంతిచేత నెచ్చటనో పోయినదనుకొని దానిని పొందవలయుననుకొనిన కంఠములోనే ముక్తాహారమున్నదని తెలిసికొనవలయును. అందుచేతనే హారములేదనెడిభ్రాంతి నశించి హారముపొందబడునుగాని అడవికిబోయి వెదకిన బొందబడదుకదా! ఆప్రకారమే ఆత్మస్వరూపము నిత్యప్రాప్తంబైయుండియు భ్రాంతిచేత ప్రాప్తముకానిదానివలె భాసించుచున్నందున ఆత్మస్వరూపమును యథార్థముగ తెలిసికొన్నందువలననె యాభ్రాంతి నశించి ఆత్మస్వరూపము ప్రాప్తించుగాని కర్మల ననుష్ఠించిన భ్రాంతి నివర్తింపదు. ఆత్మస్వరూపమును ప్రాప్తింపదు. ఈప్రకారమే అనర్ధరూపంబైన దేహేంద్రియాద్యనాత్మప్రపంచము ఆత్మయందు స్వభావముగా నివృత్తమైయుండియును భ్రాంతిచేత నివృత్తము కానిదానివలె భాసించుచున్నది. ఇదియును ఆత్మస్వరూపయాదార్థ్యజ్ఞానముచేతనే నివర్తింపవలయుంగాని కర్మానుష్ఠానముచేత నివర్తింపదు. అని తాత్పర్యము.

    ReplyDelete
  2. దం-అ. "స్వభావతః" అనుపదము శ్లోకముతోజేరి యన్వయించుచున్నది. స్వభావముగ పరిహరింపబడి పొందబడి యున్నవాని యొక్క పరిహార లాభములు జ్ఞానము వలన గలుగును గాని కర్మచేత గలుగవు. ఆ పరిహారలాభములు అజ్ఞానము మాత్రమే ప్రతిబంధకముగా గలిగియున్నందున కర్మచేత సిద్ధింపవు.


    తా. సహజముగ పరిహరింపబడియుండియును అజ్ఞానముచేత పరిహరింపబడలేదని యెన్నబడెడి విషయము జ్ఞానముచేతనే పరిహరింపబడును. సహజముగ పొందబడియుండియు,  అజ్ఞానముచేత పొందబడలేదని తలపబడెడి విషయము జ్ఞానము చేతనే పొందబడునుగాని కర్మలచేత  పొంద బడదు. 


        అది యెందువల్లననగా పరిహృత పరిహార్యమునకును ప్రాప్తప్రాప్తవ్యమునకును అజ్ఞానమే కారణమైనందున అజ్ఞానము నివర్తించిన గాని పరిహృత పరిహార్య ప్రాప్తప్రాప్తవ్యముల యొక్క పరిహార లాభములు కలుగవు. అజ్ఞానము జ్ఞానముచేత నివర్తించునుగాని, కర్మచేత నివర్తింపదని భావము.

                    అనగా తన చరణా భరణమును (నూపురమును) చూచి భ్రాంతిచేత సర్పమనుకొని భీతినొంది ఆ సర్పమును నివర్తింప జేసికొనవలయు ననగా ఇది సర్పముకాదు, నూపురమే యనుజ్ఞానమును సంపాదించుకొనవలయును. అట్టిజ్ఞానముచేత అజ్ఞానము నివర్తించి సర్పముకూడ నివర్తించునుగాని గరుడధ్యానమును జేసిన నివర్తింపదుగదా. 

               తనకంఠమునందున్న ముక్తాహారమును భ్రాంతిచేత నెచ్చటనో పోయినదనుకొని దానిని పొందవలయుననుకొనిన కంఠములోనే ముక్తాహారమున్నదని తెలిసికొనవలయును. అందుచేతనే హారము లేదనెడిభ్రాంతి నశించి హారముపొందబడునుగాని అడవికిబోయి వెదకిన బొందబడదుకదా! 

              ఆ ప్రకారమే ఆత్మస్వరూపము నిత్యప్రాప్తంబై యుండియు భ్రాంతిచేత ప్రాప్తము కానిదాని వలె భాసించుచున్నందున ఆత్మస్వరూపమును యథార్థముగ తెలిసికొన్నందు వలననె యా భ్రాంతి నశించి ఆత్మస్వరూపము ప్రాప్తించుగాని కర్మల ననుష్ఠించిన భ్రాంతి నివర్తింపదు, ఆత్మస్వరూపమును ప్రాప్తింపదు. 

              ఈప్రకారమే అనర్ధ రూపంబైన దేహేంద్రియాద్య నాత్మప్రపంచము ఆత్మయందు స్వభావముగా నివృత్తమై యుండియును భ్రాంతిచేత నివృత్తము కానిదాని వలె భాసించుచున్నది. ఇదియును ఆత్మస్వరూప యాదార్థ్య జ్ఞానము చేతనే నివర్తింప వలయు గాని కర్మానుష్ఠానముచేత నివర్తింపదని తాత్పర్యము.

    ReplyDelete

గురు స్మరణతో, రామకార్యంగా తలచి, ఆత్మభావనలో స్థిరపడేందుకు కావల్సిన చిత్తశుద్ధికై, ఈ నిష్కామ కర్మ రూప అక్షరయజ్ఞాన్ని, శ్లోక తాత్పర్యాది భావాన్ని చక్కగా అవగాహన చేసికొనుచు చేయ ప్రయత్నిద్దాము..

పైనున్న శ్లోకము యొక్క అవతారికను, తాత్పర్యమును ఈ దిగువ టైపు చేసిన చాలును. శ్లోకము టైపు చేయవలసిన అవసరము లేదు.

సంఖ్యలో ఎన్ని ఎక్కువ చేశాము అనేకంటే, అక్షర దోషములు ఏ ఒక్కటి తలెత్తకుండా రోజుకు ఒక్కరు కనీసం ఒక్కశ్లోకం పూర్తిగా చేసినా చాలును. త్వరితగతిన ఈ గురుకార్యం సఫలీకృతమగునని విన్నవించడమైనది.