శ్లోకాలు

1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | 35 | 36 | 37 | 38 | 39 | 40 | 41 | 42 | 43 | 44 | 45 | 46 | 47 | 48 | 49 | 50 | 51 | 52 | 53 | 54 | 55 | 56 | 57 | 58 | 59 | 60 | 61 | 62 | 63 | 64 | 65 | 66 | 67 | 68 | 69 | 70 | 71 | 72 | 73 | 74 | 75 | 76 | 77 | 78 | 79 | 80 | 81 | 82 | 83 | 84 | 85 | 86 | 87 | 88 | 89 | 90 | 91 | 92 | 93 | 94 | 95 | 96 | 97 | 98 | 99 | 100 |

updates

"నైష్కర్మ్య సిద్ధి" త్వరలో ఈ బ్లాగు మరింత ముస్తాబు కాగలదు. అప్పటి వరకూ సాధక మిత్రులు అనుభూతి ప్రకాశము అక్షరీకరణ కొనసాగించగలరని మనవి. మంగళకరమగు ఈ కార్యక్రమం నిర్విఘ్నంగా జరుగును గాక!! అక్షర యజ్ఞంలో తొలి అధ్యాయం నందలి 100 శ్లోకాల అవతారిక, దం.ఆ, తాత్పర్యాదుల అక్షరీకరణ దిగ్విజయముగా పూర్తికాబడినది.జయగురుదేవ!!

1-41

అభ్యుపేత్యైవముచ్యతే న తు యథావస్థితాత్మవస్తువిషయం
జ్ఞానమస్తి తత్ప్రతిపాదకప్రమాణాభావాత్

1-41

2 comments:

  1. అవ. ఓయీ! ఆత్మతత్వజ్ఞానము నంగీకరిచితివేని దానిచే మోక్షముగలుగునని యెన్నుము. 'తమేవం విదిత్వా అతిమృత్యుమేతి' ఇత్యాదిశ్రుతులు ఆత్మజ్ఞానముచేతనే మోక్షముగలుగుననిగదా చెప్పుచున్నవి యని సిద్ధాంతవాది యాక్షేపించునని తలంచి పూర్వపక్షవాది ఆత్మజ్ఞానము నంగీకరింపనని రెండవపూర్వపక్షమును జెప్పుచున్నాడు. ----

    దం-అ. అంగీకరించి యిట్లు చెప్పబడినది. ఆత్మతత్వమును ప్రతిపాదించు ప్రమాణమే లేనందున యథార్థమైన యాత్మస్వరూపము గోచరింపజేయు జ్ఞానము లేదు.

    తా. బ్రహ్మస్వరూపవిషయమైన జ్ఞానము వేదాంతవాక్యములవలన గలుగుచున్నదని మేము పరమతము నంగీకరించి యాజ్ఞానము మోక్షమున కుపయోగింపదని చెప్పితిమిగాని బ్రహ్మస్వరూపవిషయజ్ఞాన మొకటికలదని మామతము గానేరదు. ప్రమాణముననుసరించి ప్రమేయముగలదని చెప్పవలయు. ప్రమాణములేక ప్రమేయముచెప్పిన బుద్ధిమంతులు పరిహసించెదరు. బ్రహ్మస్వరూపజ్ఞానమునుగూర్చి యొకప్రమాణమైనను గాన్పింపదని భావము.

    ReplyDelete
  2. అవ. ఓయీ! ఆత్మతత్వజ్ఞానము నంగీకరిచితివేని దానిచే మోక్షముగలుగునని యెన్నుము. 'తమేవం విదిత్వా అతిమృత్యుమేతి' ఇత్యాదిశ్రుతులు ఆత్మజ్ఞానముచేతనే మోక్షముగలుగుననిగదా చెప్పుచున్నవి యని సిద్ధాంతవాది యాక్షేపించునని తలంచి పూర్వపక్షవాది ఆత్మజ్ఞానము నంగీకరింపనని రెండవపూర్వపక్షమును జెప్పుచున్నాడు. ----

    దం-అ. అంగీకరించి యిట్లు చెప్పబడినది. ఆత్మతత్వమును ప్రతిపాదించు ప్రమాణమే లేనందున యథార్థమైన యాత్మస్వరూపము గోచరింపజేయు జ్ఞానము లేదు.

    తా. బ్రహ్మస్వరూపవిషయమైన జ్ఞానము వేదాంతవాక్యములవలన గలుగుచున్నదని మేము పరమతము నంగీకరించి యాజ్ఞానము మోక్షమున కుపయోగింపదని చెప్పితిమిగాని బ్రహ్మస్వరూపవిషయజ్ఞాన మొకటికలదని మామతము గానేరదు. ప్రమాణముననుసరించి ప్రమేయముగలదని చెప్పవలయు. ప్రమాణములేక ప్రమేయముచెప్పిన బుద్ధిమంతులు పరిహసించెదరు. బ్రహ్మస్వరూపజ్ఞానమునుగూర్చి యొకప్రమాణమైనను గాన్పింపదని భావము.

    ReplyDelete

గురు స్మరణతో, రామకార్యంగా తలచి, ఆత్మభావనలో స్థిరపడేందుకు కావల్సిన చిత్తశుద్ధికై, ఈ నిష్కామ కర్మ రూప అక్షరయజ్ఞాన్ని, శ్లోక తాత్పర్యాది భావాన్ని చక్కగా అవగాహన చేసికొనుచు చేయ ప్రయత్నిద్దాము..

పైనున్న శ్లోకము యొక్క అవతారికను, తాత్పర్యమును ఈ దిగువ టైపు చేసిన చాలును. శ్లోకము టైపు చేయవలసిన అవసరము లేదు.

సంఖ్యలో ఎన్ని ఎక్కువ చేశాము అనేకంటే, అక్షర దోషములు ఏ ఒక్కటి తలెత్తకుండా రోజుకు ఒక్కరు కనీసం ఒక్కశ్లోకం పూర్తిగా చేసినా చాలును. త్వరితగతిన ఈ గురుకార్యం సఫలీకృతమగునని విన్నవించడమైనది.