శ్లోకాలు
1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | 35 | 36 | 37 | 38 | 39 | 40 | 41 | 42 | 43 | 44 | 45 | 46 | 47 | 48 | 49 | 50 | 51 | 52 | 53 | 54 | 55 | 56 | 57 | 58 | 59 | 60 | 61 | 62 | 63 | 64 | 65 | 66 | 67 | 68 | 69 | 70 | 71 | 72 | 73 | 74 | 75 | 76 | 77 | 78 | 79 | 80 | 81 | 82 | 83 | 84 | 85 | 86 | 87 | 88 | 89 | 90 | 91 | 92 | 93 | 94 | 95 | 96 | 97 | 98 | 99 | 100 |
updates
2 comments:
గురు స్మరణతో, రామకార్యంగా తలచి, ఆత్మభావనలో స్థిరపడేందుకు కావల్సిన చిత్తశుద్ధికై, ఈ నిష్కామ కర్మ రూప అక్షరయజ్ఞాన్ని, శ్లోక తాత్పర్యాది భావాన్ని చక్కగా అవగాహన చేసికొనుచు చేయ ప్రయత్నిద్దాము..
పైనున్న శ్లోకము యొక్క అవతారికను, తాత్పర్యమును ఈ దిగువ టైపు చేసిన చాలును. శ్లోకము టైపు చేయవలసిన అవసరము లేదు.
సంఖ్యలో ఎన్ని ఎక్కువ చేశాము అనేకంటే, అక్షర దోషములు ఏ ఒక్కటి తలెత్తకుండా రోజుకు ఒక్కరు కనీసం ఒక్కశ్లోకం పూర్తిగా చేసినా చాలును. త్వరితగతిన ఈ గురుకార్యం సఫలీకృతమగునని విన్నవించడమైనది.
Subscribe to:
Posts (Atom)
అవ. ఇంతకుముందు కర్మలయందు బ్రవర్తించుటకు కారణము మిథ్యాజ్ఞానమని నిరూపించి అందుచేత మోక్షము కర్మసాధ్యముకాదని చెప్పిరి. ఇప్పుడు తత్త్వజ్ఞానగోచరంబైన యాత్మస్వరూపమును బాగుగ నాలోచించిచూచినను మోక్షము కర్మసాధ్యము కాదనియు కర్మలయందు బ్రవేశించుట కవకాశములేదనియు ప్రతిపాదించుచున్నారు.
ReplyDeleteదం-అ. ఆత్మవస్తువుయొక్క యాథార్థ్యము నెఱుంగనివాడే విధినిషేధశాస్త్రములయందు అధికారముకలవాడై యుండునని చెప్పబడెను. తరువాత నిప్పుడు ఆత్మవస్తువుయొక్క స్వభావము అనుసరించుటచేతను ప్రవృత్తియొక్క అసంభవమును చెప్ప నిచ్ఛయించినవాడై చెప్పుచున్నాడు.
తా. ౭ ౮- ౫ వ వాక్యమందుండు ౨౯ వ శ్లోకమునందును ఆత్మస్వరూపమును వాస్తవముగా నెవ్వడెఱుంగడో వాడాత్మయందు కర్తృత్వభోక్తృత్వములను వర్ణాశ్రమాది ధర్మముల నారోపించుకొని వ్యవహరించును గావున విధినిషేధశాస్త్రములయందధికారము గలిగియుండునని ప్రతిపాదింపబడినది. ఆత్మస్వరూపప్రతిపాదితంబులైన వేదాంతవాక్యంబుల నవలోకించిన తత్త్వజ్ఞానం బుద్భవిల్లు. అట్టిజ్ఞానంబునకాత్మ విషయంబైయుండు. తాదృశాత్మస్వరూపమును పర్యాలోచించిచూచినచో విధినిషేధశాస్త్రప్రతిపాదితంబులైన కర్మలయందు ప్రవర్తించుటకు నిమిత్తములేదని ప్రతిపాదింపదలచి చెప్పుచున్నారని భావము.
అవ. ఇంతకుముందు కర్మలయందు బ్రవర్తించుటకు కారణము మిథ్యాజ్ఞానమని నిరూపించి అందుచేత మోక్షము కర్మసాధ్యము కాదని చెప్పిరి. ఇప్పుడు తత్త్వజ్ఞానగోచరంబైన యాత్మస్వరూపమును బాగుగ నాలోచించి చూచినను మోక్షము కర్మసాధ్యము కాదనియు కర్మలయందు బ్రవేశించుట కవకాశము లేదనియు ప్రతిపాదించుచున్నారు.
ReplyDeleteదం-అ. ఆత్మవస్తువుయొక్క యాథార్థ్యము నెఱుంగనివాడే విధినిషేధ శాస్త్రములయందు అధికారము కలవాడై యుండునని చెప్పబడెను. తరువాత నిప్పుడు ఆత్మవస్తువు యొక్క స్వభావము అనుసరించుట చేతను ప్రవృత్తియొక్క అసంభవమును చెప్ప నిచ్ఛయించినవాడై చెప్పుచున్నాడు.
తా. ౭ ౮- ౫ వ వాక్యమందుండు ౨౯ వ శ్లోకమునందును ఆత్మస్వరూపమును వాస్తవముగా నెవ్వడెఱుంగడో వాడాత్మయందు కర్తృత్వ భోక్తృత్వములను వర్ణాశ్రమాది ధర్మముల నారోపించుకొని వ్యవహరించును గావున విధినిషేధ శాస్త్రముల యందధికారము గలిగియుండునని ప్రతిపాదింపబడినది.
ఆత్మస్వరూప ప్రతిపాదితంబులైన వేదాంతవాక్యంబుల నవలోకించిన తత్త్వజ్ఞానం బుద్భవిల్లు. అట్టిజ్ఞానంబున కాత్మ విషయంబైయుండు. తాదృశాత్మస్వరూపమును పర్యాలోచించి చూచినచో విధినిషేధ శాస్త్రప్రతిపాదితంబులైన కర్మలయందు ప్రవర్తించుటకు నిమిత్తములేదని ప్రతిపాదింపదలచి చెప్పుచున్నారని భావము.