శ్లోకాలు

1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | 35 | 36 | 37 | 38 | 39 | 40 | 41 | 42 | 43 | 44 | 45 | 46 | 47 | 48 | 49 | 50 | 51 | 52 | 53 | 54 | 55 | 56 | 57 | 58 | 59 | 60 | 61 | 62 | 63 | 64 | 65 | 66 | 67 | 68 | 69 | 70 | 71 | 72 | 73 | 74 | 75 | 76 | 77 | 78 | 79 | 80 | 81 | 82 | 83 | 84 | 85 | 86 | 87 | 88 | 89 | 90 | 91 | 92 | 93 | 94 | 95 | 96 | 97 | 98 | 99 | 100 |

updates

"నైష్కర్మ్య సిద్ధి" త్వరలో ఈ బ్లాగు మరింత ముస్తాబు కాగలదు. అప్పటి వరకూ సాధక మిత్రులు అనుభూతి ప్రకాశము అక్షరీకరణ కొనసాగించగలరని మనవి. మంగళకరమగు ఈ కార్యక్రమం నిర్విఘ్నంగా జరుగును గాక!! అక్షర యజ్ఞంలో తొలి అధ్యాయం నందలి 100 శ్లోకాల అవతారిక, దం.ఆ, తాత్పర్యాదుల అక్షరీకరణ దిగ్విజయముగా పూర్తికాబడినది.జయగురుదేవ!!

1-64




అజ్ఞానహానమాత్రత్వాన్ముక్తేః కర్మ న సాధనం
కర్మాపమార్ష్టి నాజ్ఞానం తమసీవోత్థితం తమః 24

1-64

2 comments:

  1. దం-అ. మోక్షము అజ్ఞానముయొక్క వినాశముమాత్రమే గావున దానికి కర్మ సాధనముకాదు. అంధకారములోబుట్టిన భ్రాంతిని అంధకారము నివారింపలేనటుల అజ్ఞానమును కర్మ నివారింపజాలదు. తా. పరిశుద్ధమైన ఆత్మస్వరూపమే మోక్షము. అట్టి యాత్మస్వరూపము నిత్యసిద్ధమై యున్నప్పటికి అనాద్యజ్ఞానముచే నావరింపబడి లేనిదానివలె గానంబడుచున్నది. అజ్ఞానము నివర్తించినమాత్రమున నాత్మస్వరూపము మేఘమువిడిచినసూర్యబింబమువలె నత్యుజ్జ్వలమై ప్రకాశించును. ఇట్టి యాత్మస్వరూపమైన మోక్షమునకు అజ్ఞాన నివృత్తిమాత్రమే కావలయునుగాని కర్మలచేగాదగినప్రయోజనము కొంచమైన నక్కరలేదు. అజ్ఞాననివృత్తికైనను కర్మలు సాధనములుకావా యనినచో కావు అని సమాధానము. అంధకారము వ్యాపించినకాలములో నాయంధకారమును నిమిత్తముగా జేసికొని రజ్జువునందు సర్వభ్రమముగాని, స్థాణువునందు చోరభ్రాంతిగాని పుట్టును. అట్టిభ్రాంతితనపుట్టువునకు నిమిత్తమైనయంధకారమును నివృత్తి జేయంజాలదుగదా? ఆప్రకారమే యజ్ఞానము ఆత్మస్వరూపము నావరించియున్నకాలములో నాయజ్ఞానమును నిమిత్తముగా గైకొని దేశకాలద్రవ్యఫలాదిభేదముల నవలంబించి ప్రవర్తించిన యాగదానాదికర్మలు స్వనిమిత్తమైన యజ్ఞానమును నశింపజేయలేవు. నశించువస్తువును నశింపజేయువస్తువును స్వరూపస్వభావములచే పరస్పరవిరుద్ధములై యుండవలయు. అంధకారము ప్రకాశము పరస్పరవిరుద్ధములు గావున ప్రకాశ మంధకారమును నశింపజేయుచున్నవి. అజ్ఞానము కర్మయు నాలాగున విరుద్ధములుగావు. అజ్ఞానము, జడస్వరూపము, కర్మయును జడస్వరూపము, భేదమును స్పురింపజేయుట అజ్ఞానస్వభావము. భేదముల నవలంబించియుండుట కర్మస్వభావము. కావున అజ్ఞానము కర్మయును ఏక స్వరూపస్వభావములు కలవైనందున కర్మ లజ్ఞానమును నశింపజేయజాలవని భావము.

    ReplyDelete
  2. దం- అ. మోక్షము అజ్ఞానం యొక్క వినాశము మాత్రమే కావున దానికి కర్మ సాధనము కాదు.


    తా. పరిశుద్ధమైన ఆత్మ స్వరూపమే మోక్షము. అట్టి ఆత్మ స్వరూపము నిత్య శుద్ధ సిద్ధమై ఉన్నప్పటికీ అనాది అజ్ఞానముచే ఆవరింపబడి, లేని దాని వలె కనబడుచున్నది. 

    అజ్ఞానము నిర్వర్తించిన మాత్రమున ఆత్మ స్వరూపము మేఘము విడిచిన సూర్య బింబము వలె అత్యుజ్జ్వల మై ప్రకాశించును.  ఇట్టి ఆత్మ స్వరూపమైన మోక్షమునకు అజ్ఞాన నివృత్తి మాత్రమే కావలయును కాని , కర్మలచే కాదగిన ప్రయోజనము కొంచెమయినా అక్కరలేదు.

    అజ్ఞాన నివృత్తి కైనను కర్మలు సాధనములు కావా అని నచో , కావు అని సమాధానము. అంధకారము వ్యాపించిన కాలములో ఆ అంధకారమును నిమిత్తము గా చేసుకుని, రజ్జువు నందు సర్పభ్రమ కానీ స్థాణువు నందు చోర భ్రాంతి గాని పుట్టును. 

           అట్టి బ్రాంతి తన పుట్టువు నకు నిమిత్తమై న అంధకారమును నివృత్తి చేయజాలదు కదా? ఆ ప్రకారమే అజ్ఞానము ఆత్మస్వరూపమును ఆవరించియున్న కాలములో ఆ అజ్ఞానమును నిమిత్తము గా చేసుకుని, దేశకాల ద్రవ్య ఫలాది భేదములను అవలంభించి ప్రవర్తించిన యాగ దానాది కర్మలు స్వనిమిత్తమైన అజ్ఞానమును నశింప చేయలేవు.

          నశించు వస్తువును, నశింపజేయు వస్తువును స్వరూప స్వభావముల చే పరస్పర విరుద్ధములై ఉండవలయు. అంధకారమును ప్రకాశమును పరస్పర విరుద్ధములు కావున,  ప్రకాశము అంధకారమును నశింపజేయు చున్నది.  అజ్ఞానమును, కర్మయును ఆలాగున విరుద్ధము లు కావు. అజ్ఞానము జడ స్వరూపము, కర్మయును జడ స్వరూపము. భేదమును స్పురింప చేయుట అజ్ఞాన స్వభావము. భేదములను అవలంభించి ఉండుట కర్మ స్వభావము. కావున అజ్ఞానమును కర్మమును ఏక స్వరూప స్వభావములు కలవై నందున కర్మలు అజ్ఞానమును నశింపజేయజాలవని భావము. 

    ReplyDelete

గురు స్మరణతో, రామకార్యంగా తలచి, ఆత్మభావనలో స్థిరపడేందుకు కావల్సిన చిత్తశుద్ధికై, ఈ నిష్కామ కర్మ రూప అక్షరయజ్ఞాన్ని, శ్లోక తాత్పర్యాది భావాన్ని చక్కగా అవగాహన చేసికొనుచు చేయ ప్రయత్నిద్దాము..

పైనున్న శ్లోకము యొక్క అవతారికను, తాత్పర్యమును ఈ దిగువ టైపు చేసిన చాలును. శ్లోకము టైపు చేయవలసిన అవసరము లేదు.

సంఖ్యలో ఎన్ని ఎక్కువ చేశాము అనేకంటే, అక్షర దోషములు ఏ ఒక్కటి తలెత్తకుండా రోజుకు ఒక్కరు కనీసం ఒక్కశ్లోకం పూర్తిగా చేసినా చాలును. త్వరితగతిన ఈ గురుకార్యం సఫలీకృతమగునని విన్నవించడమైనది.