శ్లోకాలు

1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | 35 | 36 | 37 | 38 | 39 | 40 | 41 | 42 | 43 | 44 | 45 | 46 | 47 | 48 | 49 | 50 | 51 | 52 | 53 | 54 | 55 | 56 | 57 | 58 | 59 | 60 | 61 | 62 | 63 | 64 | 65 | 66 | 67 | 68 | 69 | 70 | 71 | 72 | 73 | 74 | 75 | 76 | 77 | 78 | 79 | 80 | 81 | 82 | 83 | 84 | 85 | 86 | 87 | 88 | 89 | 90 | 91 | 92 | 93 | 94 | 95 | 96 | 97 | 98 | 99 | 100 |

updates

"నైష్కర్మ్య సిద్ధి" త్వరలో ఈ బ్లాగు మరింత ముస్తాబు కాగలదు. అప్పటి వరకూ సాధక మిత్రులు అనుభూతి ప్రకాశము అక్షరీకరణ కొనసాగించగలరని మనవి. మంగళకరమగు ఈ కార్యక్రమం నిర్విఘ్నంగా జరుగును గాక!! అక్షర యజ్ఞంలో తొలి అధ్యాయం నందలి 100 శ్లోకాల అవతారిక, దం.ఆ, తాత్పర్యాదుల అక్షరీకరణ దిగ్విజయముగా పూర్తికాబడినది.జయగురుదేవ!!

1-38

కామ్యప్రతిషిద్ధకర్మఫలత్వాత్సంసారస్య
తన్నిరాసేనైవాశేషానర్థనిరాసస్య సిద్ధత్వాత్కిం
నిత్యానుష్ఠానేనేతి చేత్

1-38

2 comments:

  1. adhirupalakshmi4 August 2020 at 01:54

    దం -అ. సంసారము కామ్య నిషిద్ధకర్మల యొక్క ఫలమాటవలన కామ్యనిషిద్ధకర్మలను విడిచినందుచేతనే సకలమైన యనర్ధము యొక్క నివారణము సిద్ధించునది గావున నిత్యకర్మల నాచరించుటచేత నేమి ప్రయోజనము అని చెప్పిన.
    తా. జ్యోతిష్టోమాదికామ్యకర్మల నాచరించినందున పుణ్యము కలుగును. సురాపానాది నిషిద్ధకర్మల నాచరించిన పాపము కలుగును. ఈ పుణ్యపాపములయొక్క ఫలములు సుఖఃదుఃఖములు; వానియొక్క యనుభవమే సంసారము; అట్టి సంసారము పుణ్యపాపములు పుట్టకపోయిన నశించును. కామ్య నిషిద్ధకర్మల నాచరింపకయుండిన పుణ్యపాపములు పుట్టకయుండు గావున కామ్యకర్మనిషిద్ధకర్మల బరిత్యజించి యున్న మాత్రంబుననే సర్వానర్థరూపమగు నీసంసారము నివర్తించుచుండ నిత్య నైమిత్తికకర్మల ననుష్ఠించుట నిష్ప్రయోజనమని కొందఱు శంకించెదరని భావము.
    అవ. ఆయాక్షేపమును పూర్వపక్షవాదియే పరిహరించుచున్నాడు.

    ReplyDelete
  2. అవ. కామ్యకర్మలు అను నిషిద్ధ కర్మలను విడిచి ఉన్న చాలదా నిత్య నైమిత్తిక కర్మలను ఆచరించవలసిన ఆవశ్యకమేమని కొందరు చేయు ఆక్షేపము ను పూర్వ పక్ష వాది యనువదించుచున్నాడు.

    దం -అ. సంసారము కామ్య నిషిద్ధకర్మల యొక్క ఫలమాట వలన కామ్యనిషిద్ధ కర్మలను విడిచినందుచేతనే సకలమైన యనర్ధము యొక్క నివారణము సిద్ధించునది గావున నిత్యకర్మల నాచరించుటచేత నేమి ప్రయోజనము అని చెప్పిన….

    తా. జ్యోతిష్టోమాదికామ్యకర్మల నాచరించినందున పుణ్యము కలుగును. సురాపానాది నిషిద్ధకర్మల నాచరించిన పాపము కలుగును. ఈ పుణ్యపాపములయొక్క ఫలములు సుఖఃదుఃఖములు; వానియొక్క యనుభవమే సంసారము; అట్టి సంసారము పుణ్యపాపములు పుట్టకపోయిన నశించును. కామ్య నిషిద్ధకర్మల నాచరింపకయుండిన పుణ్యపాపములు పుట్టకయుండు గావున కామ్యకర్మనిషిద్ధకర్మల బరిత్యజించి యున్న మాత్రంబుననే సర్వానర్థరూపమగు నీసంసారము నివర్తించుచుండ నిత్య నైమిత్తికకర్మల ననుష్ఠించుట నిష్ప్రయోజనమని కొందఱు శంకించెదరని భావము.

    అవ. ఆయాక్షేపమును పూర్వపక్షవాదియే పరిహరించుచున్నాడు.

    ReplyDelete

గురు స్మరణతో, రామకార్యంగా తలచి, ఆత్మభావనలో స్థిరపడేందుకు కావల్సిన చిత్తశుద్ధికై, ఈ నిష్కామ కర్మ రూప అక్షరయజ్ఞాన్ని, శ్లోక తాత్పర్యాది భావాన్ని చక్కగా అవగాహన చేసికొనుచు చేయ ప్రయత్నిద్దాము..

పైనున్న శ్లోకము యొక్క అవతారికను, తాత్పర్యమును ఈ దిగువ టైపు చేసిన చాలును. శ్లోకము టైపు చేయవలసిన అవసరము లేదు.

సంఖ్యలో ఎన్ని ఎక్కువ చేశాము అనేకంటే, అక్షర దోషములు ఏ ఒక్కటి తలెత్తకుండా రోజుకు ఒక్కరు కనీసం ఒక్కశ్లోకం పూర్తిగా చేసినా చాలును. త్వరితగతిన ఈ గురుకార్యం సఫలీకృతమగునని విన్నవించడమైనది.