శ్లోకాలు

1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | 35 | 36 | 37 | 38 | 39 | 40 | 41 | 42 | 43 | 44 | 45 | 46 | 47 | 48 | 49 | 50 | 51 | 52 | 53 | 54 | 55 | 56 | 57 | 58 | 59 | 60 | 61 | 62 | 63 | 64 | 65 | 66 | 67 | 68 | 69 | 70 | 71 | 72 | 73 | 74 | 75 | 76 | 77 | 78 | 79 | 80 | 81 | 82 | 83 | 84 | 85 | 86 | 87 | 88 | 89 | 90 | 91 | 92 | 93 | 94 | 95 | 96 | 97 | 98 | 99 | 100 |

updates

"నైష్కర్మ్య సిద్ధి" త్వరలో ఈ బ్లాగు మరింత ముస్తాబు కాగలదు. అప్పటి వరకూ సాధక మిత్రులు అనుభూతి ప్రకాశము అక్షరీకరణ కొనసాగించగలరని మనవి. మంగళకరమగు ఈ కార్యక్రమం నిర్విఘ్నంగా జరుగును గాక!! అక్షర యజ్ఞంలో తొలి అధ్యాయం నందలి 100 శ్లోకాల అవతారిక, దం.ఆ, తాత్పర్యాదుల అక్షరీకరణ దిగ్విజయముగా పూర్తికాబడినది.జయగురుదేవ!!

1-39


తన్న తదకరణాదప్యనర్థప్రసక్తేః

1-39

2 comments:

  1. adhirupalakshmi4 August 2020 at 04:41

    దం-అ. అనిత్య నైమిత్తికకర్మల నాచరింపకపోయినను అనర్ధము ప్రసక్తమగును [ప్రాప్తించును] కావున నదికాదు.
    తా. నిత్యనైమిత్తిక కర్మల నాచరించుట నిష్ప్రయోజనమని చెప్పందగదు. నిషిద్ధకర్మల నాచరించుటచేత నేప్రకారము పాపముపుట్టునో ఆప్రకారమే నిత్యనైమిత్తికకర్మల నాచరింపకపోయినను పాపముపుట్టును. దానిచే దుఃఖరూపమైన సంసారము సంభవించును గావున కామ్యనిషిద్ధపరిత్యాగం
    బావశ్యకంబైనటుల నిత్యనైమిత్తిక కర్మానుష్ఠానంబుగూడ నావశ్యకంబైయున్నది. స్మృ. " అకుర్వ న్విహితం కర్మ నిందితంచకమాచర౯ , ప్రసజం శ్చేంద్రియార్ధేషు
    నరః ప్రతన మృచ్ఛతి ". అనుమనుస్మృతివచనము నిషిద్ధకర్మల నాచరించుటవలె విహితకర్మల నాచరింపకపోవుటయును పాపమునకు కారణమని చెప్పుచున్నదని భావము. శ్రుతిస్మృతి విహితంబైన సంధ్యావందనాది కర్మల నాచరింపక నిషిద్ధంబులైన సురాపానాదికర్మల నాచరింపుచు శబ్దాది విషయంబులయం దత్యాసక్తుండై ప్రవర్తించుమనుష్యుడు పాతిత్యమును బొందునని మనువువచనమున కర్థము.
    అవ. ఈయర్థమును శ్లోకముతో జెప్పి మొదటిపూర్వపక్షమును ముగించుచున్నాడు.

    ReplyDelete
  2. దం-అ. అనిత్య నైమిత్తికకర్మల నాచరింపకపోయినను అనర్ధము ప్రసక్తమగును [ప్రాప్తించును] కావున నదికాదు.


    తా. నిత్యనైమిత్తిక కర్మల నాచరించుట నిష్ప్రయోజనమని చెప్పందగదు. నిషిద్ధకర్మల నాచరించుటచేత నేప్రకారము పాపముపుట్టునో ఆప్రకారమే నిత్యనైమిత్తికకర్మల నాచరింపకపోయినను పాపముపుట్టును. దానిచే దుఃఖరూపమైన సంసారము సంభవించును గావున కామ్యనిషిద్ధపరిత్యాగం

    బావశ్యకంబైనటుల నిత్యనైమిత్తిక కర్మానుష్ఠానంబుగూడ నావశ్యకంబైయున్నది. స్మృ. " 


    అకుర్వ న్విహితం కర్మ నిందితంచకమాచర౯ , ప్రసజం శ్చేంద్రియార్ధేషు

    నరః ప్రతన మృచ్ఛతి ". అను మనుస్మృతివచనము నిషిద్ధకర్మల నాచరించుటవలె విహితకర్మల నాచరింపకపోవుటయును పాపమునకు కారణమని చెప్పుచున్నదని భావము.

           శ్రుతిస్మృతి విహితంబైన సంధ్యావందనాది కర్మల నాచరింపక నిషిద్ధంబులైన సురాపానాదికర్మల నాచరింపుచు శబ్దాది విషయంబులయం దత్యాసక్తుండై ప్రవర్తించుమనుష్యుడు పాతిత్యమును బొందునని మనువువచనమున కర్థము.


    అవ. ఈయర్థమును శ్లోకముతో జెప్పి మొదటిపూర్వపక్షమును ముగించుచున్నాడు.

    ReplyDelete

గురు స్మరణతో, రామకార్యంగా తలచి, ఆత్మభావనలో స్థిరపడేందుకు కావల్సిన చిత్తశుద్ధికై, ఈ నిష్కామ కర్మ రూప అక్షరయజ్ఞాన్ని, శ్లోక తాత్పర్యాది భావాన్ని చక్కగా అవగాహన చేసికొనుచు చేయ ప్రయత్నిద్దాము..

పైనున్న శ్లోకము యొక్క అవతారికను, తాత్పర్యమును ఈ దిగువ టైపు చేసిన చాలును. శ్లోకము టైపు చేయవలసిన అవసరము లేదు.

సంఖ్యలో ఎన్ని ఎక్కువ చేశాము అనేకంటే, అక్షర దోషములు ఏ ఒక్కటి తలెత్తకుండా రోజుకు ఒక్కరు కనీసం ఒక్కశ్లోకం పూర్తిగా చేసినా చాలును. త్వరితగతిన ఈ గురుకార్యం సఫలీకృతమగునని విన్నవించడమైనది.