శ్లోకాలు
1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | 35 | 36 | 37 | 38 | 39 | 40 | 41 | 42 | 43 | 44 | 45 | 46 | 47 | 48 | 49 | 50 | 51 | 52 | 53 | 54 | 55 | 56 | 57 | 58 | 59 | 60 | 61 | 62 | 63 | 64 | 65 | 66 | 67 | 68 | 69 | 70 | 71 | 72 | 73 | 74 | 75 | 76 | 77 | 78 | 79 | 80 | 81 | 82 | 83 | 84 | 85 | 86 | 87 | 88 | 89 | 90 | 91 | 92 | 93 | 94 | 95 | 96 | 97 | 98 | 99 | 100 |
updates
4 comments:
గురు స్మరణతో, రామకార్యంగా తలచి, ఆత్మభావనలో స్థిరపడేందుకు కావల్సిన చిత్తశుద్ధికై, ఈ నిష్కామ కర్మ రూప అక్షరయజ్ఞాన్ని, శ్లోక తాత్పర్యాది భావాన్ని చక్కగా అవగాహన చేసికొనుచు చేయ ప్రయత్నిద్దాము..
పైనున్న శ్లోకము యొక్క అవతారికను, తాత్పర్యమును ఈ దిగువ టైపు చేసిన చాలును. శ్లోకము టైపు చేయవలసిన అవసరము లేదు.
సంఖ్యలో ఎన్ని ఎక్కువ చేశాము అనేకంటే, అక్షర దోషములు ఏ ఒక్కటి తలెత్తకుండా రోజుకు ఒక్కరు కనీసం ఒక్కశ్లోకం పూర్తిగా చేసినా చాలును. త్వరితగతిన ఈ గురుకార్యం సఫలీకృతమగునని విన్నవించడమైనది.
Subscribe to:
Posts (Atom)
అవ. దూషణమును శ్లోకముతో చెప్పుచున్నారు.------
ReplyDeleteదం-ఆ. ఒక్కొక్కకర్మచేతనే మోక్షము సిద్ధించునా? లేక అన్నికర్మలచే సిద్ధించునా? ఒక్కొక్కకర్మచే సిద్ధించినేని ఇతరకర్మలు వ్యర్థములుగాగలవు. అన్నికర్మలచేత సిద్ధించెనేని యావత్కర్మలు నొకకర్మగానే యుండవలయు.
తా. కర్మలచేతనే మోక్షముగలుగునని వాదించు పూర్వపక్షవాదినిగూర్చి ప్రశ్న చేసెదము. అగ్నిహోత్రములు మొదలు సహస్రవార్షికసత్రాంతము అను కర్మలున్నవిగదా? వీనిలో నొక్కొక్కకర్మచేతనే మోక్షము సిద్ధించునా? లేక యావత్కర్మలచే సిద్ధించునా? ఒక్కొక్కకర్మచే సిద్ధించునంటివేని ఒకకర్మచేతనే మోక్షము సిద్ధించుచుండ నితరకర్మలను వేదము విధించుట కావశ్యకము లేకపోవును. ఆవశ్యకములేకయే విధింపబడిన కర్మలునిష్ఫలములని చెప్పవలసియుండును; లేక అగ్నికర్మలచే మోక్షము సిద్దించునంటివేని అగ్నిహోత్రాదిసహస్రవార్షికసత్రాంతకర్మల కన్నింటికిని ఒకమోక్షమే ఫలమైనందున యావత్కర్మ లొక్కటియే యనవలసియుండును అట్లుచెప్పుట బహువిరుద్ధము. ప్రతి కర్మను వేఱువేఱుగా విధించి వానికి ఫలమును వేఱువేఱుగా విధింపబడియుండగా ఒకటేకర్మ యని ఒకటేఫలమని యెట్లు చెప్పవచ్చును?
ఇదియునుగాక బ్రహ్మచర్య, గృహస్థ, వానప్రస్థ, యత్యాశ్రమములు నాలుగింటికి బ్రాహ్మణ క్షత్రియ వైశ్యులను వర్ణములు మూడింటిని ప్రత్యేకముగ విధింపబడినకర్మలు ఒకనిచేత నాచరింపబడుటకు శక్యములుకావు గావున మోక్షము సర్వకర్మఫలమని చెప్పదగదు. సర్వకర్మలచే మోక్షము సిద్దించుననగా సర్వవర్ణాశ్రమములకు విధించిన యావత్కర్మలచేత మోక్షము కలుగుననికాదు. ఆయావర్ణాశ్రమములకు ప్రత్యేకముగావిధించిన సర్వకర్మలచే మోక్షము సిద్ధించునని చెప్పితిమి గావున సర్వకర్మల నాచరించుట దుస్సాధ్యమని చెప్పదగదు. ఆయావర్ణాశ్రమములయందుండువారలు తమతమవర్ణాశ్రమముల కనుగుణముగా విధించినయావత్కర్మలను సులభముగా నాచరింప శక్తులేగదా? యని యంటిరేని యప్పుడు తత్త్వద్వర్ణాశ్రమంబులకు విధించినకర్మలు విచిత్రములుగా నున్నందున తత్ఫలమైన మోక్షముసైతము విచిత్రమైయుండునని చెప్పవలసియుండు. ఆత్మస్వరూపభూతమగుమోక్ష మేకస్వరూపముగావున విచిత్రమని చెప్పుట సకలశ్రుతివిరుద్ధముగావున కర్మసాధ్యము మోక్షమని చెప్పిన ఇట్టిదోషములు బొసగనేరవని భావము.
అవ.దూషణమును శ్లోకముతో చెప్పుచున్నారు.--- దం-అ. ఒక్కొక్క కర్మ చేతనే మోక్షము సిద్ధించునా? లేక అన్ని కర్మలచే సిద్ధించునా? ఒక్కొకకర్మచే సిద్ధించెనేని ఇతరకర్మలు వ్యర్థములుగాగలవు. అన్ని కర్మలచేత సిద్ధించెనేని యావత్కర్మలు నొకకర్మగానే యుండవలయు. తా. కర్మలచేతనే మోక్షముగలుగునని వాదించు పూర్వపక్షవాదినిగూర్చి ప్రశ్న చేసెదము. అగ్నిహోత్రములు మొదలు సహస్రవార్షికసత్రాంతము అను కర్మలున్నవిగదా? వీనిలో నొక్కొక్కకర్మ చేతనే మోక్షము సిద్ధించునా?లేక యావత్కర్మలచే సిద్ధించునా? ఒక్కొక్కకర్మచే సిద్ధించునంటివేని ఒకకర్మచేతనే మోక్షము సిద్ధిఃచుచుండ నితరకర్మలను వేదము విధించుట కావశ్యకము లేకపోవును. ఆవశ్యకము లేకయే విధింపబడిన కర్మలునిష్పలములని చెప్పవలసియుండును;లేక అగ్ని కర్మలచే మోక్షము సిద్ధించునంటివేని అగ్ని హోత్రాదిసహస్రవార్షికసత్రాంతకర్మల కన్నింటికిని ఒక మోక్షమే ఫలమైనందున యావత్కర్మ లొక్కటియే యనవలసియుండును అట్లుచెప్పుట బహువిరుద్ధము. ప్రతికర్మను వేరువేరుగా విధించి వానికి ఫలమును వేరువేరుగా విధింపబడియుండగా ఒకటేకర్మ యని ఒకటేఫలమని యెట్లు చెప్పవచ్చును? ఇదియునుగాక బ్రహ్మచర్య, గృహస్థ, వానప్రస్థ, యత్యాశ్రమములు నాలుగింటికి బ్రాహ్మణ క్షత్రియ వైశ్యులను వర్ణములు మూడింటికిని ప్రత్యేకముగ విధింపబడినకర్మలు ఒకనిచేత నాచరింపబడుటకు శక్యములుకావు గావున మోక్షము సర్వకర్మలఫలమని చెప్పదగదు. సర్వకర్మలచే మోక్షము సిద్ధించుననగా సర్వవర్ణాశ్రమములకు విధించిన యావత్కర్మలచేత మోక్షము కలుగునని కాదు. ఆయావర్ణాశ్రమములకు ప్రత్యేకముగావిధించిన సర్వకర్మలచే మోక్షము సిద్ధించునని చెప్పితిమి గావున సర్వకర్మల నాచరించుట దుస్సాధ్యమని చెప్పదగదు. ఆయావర్ణాశ్రమములయందుండువారలు తమతమవర్ణాశ్రమముల కనుగుణముగా విధించినయావత్కర్మలను సులభముగా నాచరింప శక్తులేగదా? యని యంటిరేని యప్పుడు తత్త్వద్వర్ణాశ్రమంబులకు విధించినకర్మలు విచిత్రములుగా నున్నందున తత్ఫలమైన మోక్షముసైతము విచిత్రమైయుండునని చెప్పవలసియుండు. ఆత్మస్వరూపభూతమగు మోక్ష మేకస్వరూపముగావున విచిత్రమని చెప్పుట సకలశ్రుతివిరుద్థము గావున కర్మసాధ్యము మోక్షమని చెప్పిన ఇట్టిదోషములు బొసగనేరవని భావము.
ReplyDeleteదం-ఆ. ఒక్కొక్కకర్మచేతనే మోక్షము సిద్ధించునా? లేక అన్నికర్మలచే సిద్ధించునా? ఒక్కొక్కకర్మచే సిద్ధించినేని ఇతరకర్మలు వ్యర్థములు గాగలవు. అన్నికర్మలచేత సిద్ధించెనేని యావత్కర్మలు నొకకర్మగానే యుండవలయు.
ReplyDeleteతా. కర్మలచేతనే మోక్షముగలుగునని వాదించు పూర్వపక్షవాదినిగూర్చి ప్రశ్న చేసెదము. అగ్నిహోత్రములు మొదలు సహస్రవార్షికసత్రాంతము అను కర్మలున్నవిగదా? వీనిలో నొక్కొక్కకర్మచేతనే మోక్షము సిద్ధించునా? లేక యావత్కర్మలచే సిద్ధించునా? ఒక్కొక్కకర్మచే సిద్ధించునంటివేని ఒకకర్మచేతనే మోక్షము సిద్ధించుచుండ నితరకర్మలను వేదము విధించుట కావశ్యకము లేకపోవును. ఆవశ్యకము లేకయే విధింపబడిన కర్మలు నిష్ఫలములని చెప్పవలసి యుండును; లేక అగ్నికర్మలచే మోక్షము సిద్దించునంటివేని అగ్నిహోత్రాది సహస్రవార్షిక సత్రాంతకర్మల కన్నింటికిని ఒకమోక్షమే ఫలమైనందున యావత్కర్మ లొక్కటియే యనవలసి యుండును . అట్లుచెప్పుట బహువిరుద్ధము.
ప్రతి కర్మను వేఱువేఱుగా విధించి వానికి ఫలమును వేఱువేఱుగా విధింపబడియుండగా ఒకటేకర్మ యని ఒకటే ఫలమని యెట్లు చెప్పవచ్చును?
ఇదియునుగాక బ్రహ్మచర్య, గృహస్థ, వానప్రస్థ, యత్యాశ్రమములు నాలుగింటికి బ్రాహ్మణ క్షత్రియ వైశ్యులను వర్ణములు మూడింటిని ప్రత్యేకముగ విధింపబడినకర్మలు ఒకనిచేత నాచరింపబడుటకు శక్యములుకావు గావున మోక్షము సర్వకర్మఫలమని చెప్పదగదు. సర్వకర్మలచే మోక్షము సిద్దించుననగా సర్వవర్ణాశ్రమములకు విధించిన యావత్కర్మలచేత మోక్షము కలుగుననికాదు. ఆయా వర్ణాశ్రమములకు ప్రత్యేకముగా విధించిన సర్వకర్మలచే మోక్షము సిద్ధించునని చెప్పితిమి గావున సర్వకర్మల నాచరించుట దుస్సాధ్యమని చెప్పదగదు. ఆయా వర్ణాశ్రమముల యందుండువారలు తమతమ వర్ణాశ్రమముల కనుగుణముగా విధించిన యావత్కర్మలను సులభముగా నాచరింప శక్తులేగదా? యని యంటిరేని యప్పుడు తత్త్వద్వర్ణాశ్రమంబులకు విధించినకర్మలు విచిత్రములుగా నున్నందున తత్ఫలమైన మోక్షము సైతము విచిత్రమై యుండునని చెప్పవలసియుండు. ఆత్మస్వరూప భూతమగుమోక్ష మేక స్వరూపము గావున విచిత్రమని చెప్పుట సకల శ్రుతివిరుద్ధము గావున కర్మసాధ్యము మోక్షమని చెప్పిన ఇట్టి దోషములు సంభవించు నని భావము.
This comment has been removed by the author.
ReplyDelete