శ్లోకాలు

1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | 35 | 36 | 37 | 38 | 39 | 40 | 41 | 42 | 43 | 44 | 45 | 46 | 47 | 48 | 49 | 50 | 51 | 52 | 53 | 54 | 55 | 56 | 57 | 58 | 59 | 60 | 61 | 62 | 63 | 64 | 65 | 66 | 67 | 68 | 69 | 70 | 71 | 72 | 73 | 74 | 75 | 76 | 77 | 78 | 79 | 80 | 81 | 82 | 83 | 84 | 85 | 86 | 87 | 88 | 89 | 90 | 91 | 92 | 93 | 94 | 95 | 96 | 97 | 98 | 99 | 100 |

updates

"నైష్కర్మ్య సిద్ధి" త్వరలో ఈ బ్లాగు మరింత ముస్తాబు కాగలదు. అప్పటి వరకూ సాధక మిత్రులు అనుభూతి ప్రకాశము అక్షరీకరణ కొనసాగించగలరని మనవి. మంగళకరమగు ఈ కార్యక్రమం నిర్విఘ్నంగా జరుగును గాక!! అక్షర యజ్ఞంలో తొలి అధ్యాయం నందలి 100 శ్లోకాల అవతారిక, దం.ఆ, తాత్పర్యాదుల అక్షరీకరణ దిగ్విజయముగా పూర్తికాబడినది.జయగురుదేవ!!

1-24




గురుణైవ వేదార్థస్య పరిసమాపితత్వాత్ప్రకరణోక్తౌ
ఖ్యాత్యాద్యప్రామాణ్య కారణాశంకేతి చేత్తద్వ్యుదా
సార్థ ముపన్యాసః
1-24

2 comments:

  1. adhirupalakshmi3 August 2020 at 07:09

    దం -అ. ఆచార్యులచేతనే వేదాంతసిద్ధాంతము సమగ్రముగా చెప్పి సమాప్తినొందింపబడియుండగా మీ రీగ్రంథరచనకు గడంగుటకు ఖ్యాతి లాభపూజలను ఆ ప్రామాణ్య హేతువులయొక్క శంకకలుగుననియనినచో దాని నిరసించుకొఱకు నుత్తర శ్లోకము యొక్క రచన యావశ్యకమైనది.
    తా . మీ కాచార్యులగు శ్రీ శంకరభగవత్పాదులే వేదాంతసిద్ధాంతము నేకొఱత లేకుండ నిశ్చయించి గ్రంధములను జేసియుండిరి. కావున తా మీ గ్రంథమును జేయుటకు కారణము గాన్పించదు. ఆచార్యులవారు శారీరక భాష్యాది గ్రంథములయం దచ్చటచ్చట నర్ధాంతరమధ్యమందు చేర్చిచెప్పిన తత్త్వార్థమునంతయు నొకచోటజేర్చి మేము చెప్పవలసియున్నది. అదియే యీ గ్రంథరచనకు గారణమని చెప్పినచో నాచార్యులవారే యుపదేశసాహస్రి మొదలగుగ్రంధములను
    రచయించి వానియందు తత్త్వార్థమునంత నొకచోటజేర్చి చెప్పియున్నందున నా విధమున చెప్పదగినదిగనుండలేదు . గావున మీరీ గ్రంథరచనకు కారణము ఖ్యాతి పూజలకని తోఁచుచున్నది. ఖ్యాతి లాభాపూజల నపేక్షించువారలు తరచుగా నాప్రామాణికులుగ నున్నారు. అట్టి యప్రామాణికులచే రచింపబడిన గ్రంధములు ముముక్షువులకెల్ల ఆదరణీయంబైయుండునని కొందఱు శంకించెదరు; ఆ శంకను నివారించుటకొఱ కీశ్లోకము చెప్పబడుచున్నది. ఖ్యాతి యనగా కీర్తి , లాభమనగా రా సన్నిధానమున నీగ్రంధమును వినుపించిన వారిచే నియ్యంబడు ధనకనక వస్త్రవాహనా ప్రాప్తి, పూజయనగా తదితరజనులచే
    జేయఁ బడు ఆర్ఘ్యపాద్యమృష్టాన్న ప్రధానాది సన్మానము. వీనిని గోరువారు సాదారణముగా తత్త్వజ్ఞులుకారని లోకమునందును, శాస్త్రముందును సుప్రసిద్ధమైనది.

    అవ. ఆ శ్లోక మేదియనిన చెప్పుచున్నారు.

    ReplyDelete
  2. దం -అ. ఆచార్యులచేతనే వేదాంతసిద్ధాంతము సమగ్రముగా చెప్పి సమాప్తి నొందింపబడి యుండగా మీ రీ గ్రంథరచనకు గడంగుటకు ఖ్యాతి లాభపూజలను అప్రామాణ్య హేతువులయొక్క శంక కలుగునని యనినచో దాని నిరసించు కొఱకు నుత్తర శ్లోకము యొక్క రచన యావశ్యకమైనది.

    తా . మీ కాచార్యులగు శ్రీ శంకరభగవత్పాదులే వేదాంతసిద్ధాంతము నేకొఱత లేకుండ నిశ్చయించి గ్రంధములను జేసియుండిరి. కావున తా మీ గ్రంథమును జేయుటకు కారణము గాన్పించదు. ఆచార్యులవారు శారీరక భాష్యాది గ్రంథముల యం దచ్చటచ్చట నర్ధాంతర మధ్యమందు చేర్చిచెప్పిన తత్త్వార్థము నంతయు నొకచోటజేర్చి మేము చెప్పవలసియున్నది. అదియే యీ గ్రంథరచనకు గారణమని చెప్పినచో నాచార్యులవారే యుపదేశసాహస్రి మొదలగుగ్రంధములను

    రచయించి వానియందు తత్త్వార్థము నంత నొకచోటజేర్చి చెప్పియున్నందున నా విధమున చెప్పదగినదిగనుండలేదు . 

             గావున మీరీ గ్రంథరచనకు కారణము ఖ్యాతి లాభం పూజలకని తోఁచుచున్నది. ఖ్యాతి లాభాపూజల నపేక్షించువారలు తరచుగా నప్రామాణికులుగ నున్నారు. అట్టి యప్రామాణికులచే రచింపబడిన గ్రంధములు ముముక్షువులకెల్ల ఆదరణీయంబై యుండునని కొందఱు శంకించెదరు; ఆ శంకను నివారించుటకొఱ కీశ్లోకము చెప్పబడుచున్నది. ఖ్యాతి యనగా కీర్తి , లాభమనగా రాజ సన్నిధానమున నీగ్రంధమును వినుపించిన వారిచే నియ్యంబడు ధనకనక వస్త్రవాహనా ప్రాప్తి, పూజయనగా తదితరజనులచే

    జేయఁ బడు ఆర్ఘ్యపాద్యమృష్టాన్న ప్రధానాది సన్మానము. వీనిని గోరువారు సాదారణముగా తత్త్వజ్ఞులుకారని లోకమునందును, శాస్త్రముందును సుప్రసిద్ధమైనది.


    అవ. ఆ శ్లోక మేదియనిన చెప్పుచున్నారు.

    ReplyDelete

గురు స్మరణతో, రామకార్యంగా తలచి, ఆత్మభావనలో స్థిరపడేందుకు కావల్సిన చిత్తశుద్ధికై, ఈ నిష్కామ కర్మ రూప అక్షరయజ్ఞాన్ని, శ్లోక తాత్పర్యాది భావాన్ని చక్కగా అవగాహన చేసికొనుచు చేయ ప్రయత్నిద్దాము..

పైనున్న శ్లోకము యొక్క అవతారికను, తాత్పర్యమును ఈ దిగువ టైపు చేసిన చాలును. శ్లోకము టైపు చేయవలసిన అవసరము లేదు.

సంఖ్యలో ఎన్ని ఎక్కువ చేశాము అనేకంటే, అక్షర దోషములు ఏ ఒక్కటి తలెత్తకుండా రోజుకు ఒక్కరు కనీసం ఒక్కశ్లోకం పూర్తిగా చేసినా చాలును. త్వరితగతిన ఈ గురుకార్యం సఫలీకృతమగునని విన్నవించడమైనది.