శ్లోకాలు

1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | 35 | 36 | 37 | 38 | 39 | 40 | 41 | 42 | 43 | 44 | 45 | 46 | 47 | 48 | 49 | 50 | 51 | 52 | 53 | 54 | 55 | 56 | 57 | 58 | 59 | 60 | 61 | 62 | 63 | 64 | 65 | 66 | 67 | 68 | 69 | 70 | 71 | 72 | 73 | 74 | 75 | 76 | 77 | 78 | 79 | 80 | 81 | 82 | 83 | 84 | 85 | 86 | 87 | 88 | 89 | 90 | 91 | 92 | 93 | 94 | 95 | 96 | 97 | 98 | 99 | 100 |

updates

"నైష్కర్మ్య సిద్ధి" త్వరలో ఈ బ్లాగు మరింత ముస్తాబు కాగలదు. అప్పటి వరకూ సాధక మిత్రులు అనుభూతి ప్రకాశము అక్షరీకరణ కొనసాగించగలరని మనవి. మంగళకరమగు ఈ కార్యక్రమం నిర్విఘ్నంగా జరుగును గాక!! అక్షర యజ్ఞంలో తొలి అధ్యాయం నందలి 100 శ్లోకాల అవతారిక, దం.ఆ, తాత్పర్యాదుల అక్షరీకరణ దిగ్విజయముగా పూర్తికాబడినది.జయగురుదేవ!!

1-29



వేదావసానవాక్యోత్థసమ్యగ్జ్ఞానాశుశుక్షణిః
దందహీత్యాత్మనో మోహం న కర్మాప్రతికూలతః 8

1-29

2 comments:

  1. అవ. శ్లోకము నుదాహరించుచున్నారు.----

    దం-అ. వేదాంతములయందుగల మహాకావ్యములచేత బుట్టి తత్వజ్ఞానమును వహ్ని చిదాత్మయొక్క అజ్ఞానమును దహించును. యాగదానాదికర్మయోగము విరోధి గానందున దహింప జాలదు.

    తా. ఉపనిషత్తులన వేదములయొక్క శిరోభాగములు. అవి వేదములవలె పరమప్రమాణములుగాని యప్రమాణములని చెప్పందగదు. అట్టి యుపనిషత్తులయందు జీవస్వరూపమునుజెప్పు వాక్యములుకొన్ని, బ్రహ్మస్వరూపమును జెప్పువాక్యములుకొన్ని, జీవబ్రహ్మలయైక్యమును జెప్పువాక్యములుకొన్ని వినబడుచున్నవి. వీనిలో జీవవిషయకవాక్యములు బ్రహ్మవిషయకవాక్యములు ఈరెండును అవాంతరవాక్యములని, జీవబ్రహ్మైక్యమును జెప్పువాక్యములు మహావాక్యములని చెప్పబడును. వీనిలో మహావాక్యములను సదాచార్యుల సన్నిధానమందుచేరి యథావిధిగా విని ఆయర్థమును సయుక్తికముగా మననముచేసి నిస్సంశయమగు నాయర్థము నేకాగ్రచిత్తముతో భావనచేసిన జీవబ్రహ్మైక్య సాక్షాత్కారజ్ఞానము పుట్టును. అట్టిజ్ఞానము అగ్ని దూదిపింజను దహించినట్లు ఆత్మయొక్కయజ్ఞానమును నిశ్శేషముగ దహించును. వేదములయొక్క ప్రథమభాగములో జెప్పబడిన యాగదానహోమాదికర్మలు అజ్ఞానమువలె జడములై అజ్ఞానకల్పితమైన యజమాన ఋత్విక్పురోడాశభేదము నవలంబించి ప్రవర్తించుచున్నందున అజ్ఞానమునకు విరోధులు కావు గావున అజ్ఞానమును నశింపజేయజాలవని భావము. ఇందుచే ప్రకరణార్థములు నాల్గింటిలో పురుషార్ధసాధనము వేదాంతమహావాక్యజన్యజ్ఞానమని చెప్పబడెను.

    ReplyDelete
  2. అవ. శ్లోకము నుదాహరించుచున్నారు.----


    దం-అ. వేదాంతములయందుగల మహాకావ్యములచేత బుట్టి తత్వజ్ఞానమను వహ్ని చిదాత్మయొక్క అజ్ఞానమును దహించును. యాగదానాదికర్మయోగము విరోధి గానందున దహింప జాలదు.


    తా. ఉపనిషత్తులన వేదములయొక్క శిరోభాగములు. అవి వేదములవలె పరమప్రమాణములుగాని యప్రమాణములని చెప్పందగదు. అట్టి యుపనిషత్తులయందు జీవస్వరూపమునుజెప్పు వాక్యములుకొన్ని, బ్రహ్మస్వరూపమును జెప్పువాక్యములుకొన్ని, జీవబ్రహ్మలయైక్యమును జెప్పువాక్యములుకొన్ని వినబడుచున్నవి. వీనిలో జీవవిషయకవాక్యములు బ్రహ్మవిషయకవాక్యములు ఈరెండును అవాంతరవాక్యములని, జీవబ్రహ్మైక్యమును జెప్పువాక్యములు మహావాక్యములని చెప్పబడును. 

              వీనిలో మహావాక్యములను సదాచార్యుల సన్నిధానమందుచేరి యథావిధిగా విని ఆయర్థమును సయుక్తికముగా మననముచేసి నిస్సంశయమగు నాయర్థము నేకాగ్రచిత్తముతో భావనచేసిన జీవబ్రహ్మైక్య సాక్షాత్కారజ్ఞానము పుట్టును. అట్టిజ్ఞానము అగ్ని దూదిపింజను దహించినట్లు ఆత్మయొక్కయజ్ఞానమును నిశ్శేషముగ దహించును. 

                     వేదములయొక్క ప్రథమభాగములో జెప్పబడిన యాగదానహోమాదికర్మలు అజ్ఞానమువలె జడములై అజ్ఞానకల్పితమైన యజమాన ఋత్విక్పురోడాశభేదము నవలంబించి ప్రవర్తించుచున్నందున అజ్ఞానమునకు విరోధులు కావు గావున అజ్ఞానమును నశింపజేయజాలవని భావము. ఇందుచే ప్రకరణార్థములు నాల్గింటిలో పురుషార్ధసాధనము వేదాంత మహావాక్యజన్య జ్ఞానమని చెప్పబడెను.

    ReplyDelete

గురు స్మరణతో, రామకార్యంగా తలచి, ఆత్మభావనలో స్థిరపడేందుకు కావల్సిన చిత్తశుద్ధికై, ఈ నిష్కామ కర్మ రూప అక్షరయజ్ఞాన్ని, శ్లోక తాత్పర్యాది భావాన్ని చక్కగా అవగాహన చేసికొనుచు చేయ ప్రయత్నిద్దాము..

పైనున్న శ్లోకము యొక్క అవతారికను, తాత్పర్యమును ఈ దిగువ టైపు చేసిన చాలును. శ్లోకము టైపు చేయవలసిన అవసరము లేదు.

సంఖ్యలో ఎన్ని ఎక్కువ చేశాము అనేకంటే, అక్షర దోషములు ఏ ఒక్కటి తలెత్తకుండా రోజుకు ఒక్కరు కనీసం ఒక్కశ్లోకం పూర్తిగా చేసినా చాలును. త్వరితగతిన ఈ గురుకార్యం సఫలీకృతమగునని విన్నవించడమైనది.