శ్లోకాలు

1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | 35 | 36 | 37 | 38 | 39 | 40 | 41 | 42 | 43 | 44 | 45 | 46 | 47 | 48 | 49 | 50 | 51 | 52 | 53 | 54 | 55 | 56 | 57 | 58 | 59 | 60 | 61 | 62 | 63 | 64 | 65 | 66 | 67 | 68 | 69 | 70 | 71 | 72 | 73 | 74 | 75 | 76 | 77 | 78 | 79 | 80 | 81 | 82 | 83 | 84 | 85 | 86 | 87 | 88 | 89 | 90 | 91 | 92 | 93 | 94 | 95 | 96 | 97 | 98 | 99 | 100 |

updates

"నైష్కర్మ్య సిద్ధి" త్వరలో ఈ బ్లాగు మరింత ముస్తాబు కాగలదు. అప్పటి వరకూ సాధక మిత్రులు అనుభూతి ప్రకాశము అక్షరీకరణ కొనసాగించగలరని మనవి. మంగళకరమగు ఈ కార్యక్రమం నిర్విఘ్నంగా జరుగును గాక!! అక్షర యజ్ఞంలో తొలి అధ్యాయం నందలి 100 శ్లోకాల అవతారిక, దం.ఆ, తాత్పర్యాదుల అక్షరీకరణ దిగ్విజయముగా పూర్తికాబడినది.జయగురుదేవ!!

1-85




1-85

2 comments:

  1. అవ. అందు కొందఱకు ముందుగా పొందదగినవస్తువు రెండువిధములనియు పరిహరింపదగినవస్తువు రెండువిధములనియు విభజించి రెండుశ్లోకములతో నిరూపించుచున్నారు. ------

    దం-అ. మెడయందున్న హారమునువలె పొందబడియున్న (వస్తువును) దానిని అజ్ఞానముచేత పొందవలయునని కోరును. అజ్ఞానముచే నావరింపబడిన చిత్తముగలవాడు భయముచేత తననీడయం దారోపింపబడిన రాక్షసునివలె స్వయముగానే విడువబడియున్న వస్తువును భ్రాంతిచేత పరిహరింప నిచ్ఛయించును. ఆలాగుననే పొందబడనివస్తువును పొందనిచ్ఛయించును అని రెండుశ్లోకముల కొక్కటే యన్వయము.

    తా. ఈలోకములో బొందదగిన వస్తువులు రెండువిధములు. ఒకటి స్వతః పొందబడియున్నప్పటికిని భ్రాంతిచే బొందబడనిదానివలె తోచి పొందవలయునని కోరబడునది. దీనికి దృష్టాంతము. తనకంఠమునందున్న సువర్ణహారము అనగా ఒకానొకపురుషుడు తనకంఠమునందు హారమును ధరించియుండినను భ్రాంతిచేత హారము లేదని తలచి దానిని పొందవలయునని కోరుచుండును. ఇదియె ప్రాప్తప్రాప్తవ్య మనంబడును. మఱియొకటి స్వతః పొందబడనిదైయుండియు పొందవలయునని కోరబడుచుండునది. ఇది అప్రాప్తప్రాప్తవ్య మనంబడును. దీనికి దృష్టాంతము. స్వతః హారములేనివాడు తనకు హారముకావలయునని కోరుట. ఈప్రకారమే పరిహరింపదగిన వస్తువులు రెండువిధములు. ఒకటి స్వతః విడచియున్నప్పటికిని భ్రాంతిచే విడువబడనిదానివలె తోచి విడువ నిచ్ఛయింపబడునది; దీనికి దృష్టాంతము తననీడయందు దోచబడు పిశాచము, అనగా ఒకనొకపురుషుడు స్వతః పిశాచములేనివాడైనప్పటికిని తననీడనుచూచి భ్రాంతిచేత పిశాచము తనవెంటవచ్చుచున్నదని భయపడి దానిని పరిత్యజింప నిచ్ఛయించును. ఇది పరిహృతపరిహార్య మనబడును. మఱియొకటి స్వతః సంభవించియుండి పరిత్యజింప నిచ్ఛయింపబడునది. దీనికిదృష్టాంతము సర్పము తన వెంటబడి తఱుముచుండగా దానిని పరిహరింప నిచ్ఛయించుట. ఇది అపరిహృతపరిహార్య మనంబడును. ఈవిధముగ ప్రాప్తవ్యములు రెండువిధములు, పరిహార్యము రెండువిధములని తెలియవలయునని భావము.

    ReplyDelete
  2. అవ. అందు కొందఱకు ముందుగా పొందదగిన వస్తువు రెండు విధములనియు పరిహరింప దగిన వస్తువు రెండు విధములనియు విభజించి రెండు శ్లోకములతో నిరూపించుచున్నారు. ------


    దం-అ.  మెడయందున్న హారము వలె పొందబడియున్న (వస్తువును) దానిని అజ్ఞానముచేత పొందవలయునని కోరును. అజ్ఞానముచే నావరింపబడిన చిత్తము గలవాడు భయముచేత తన నీడయం దారోపింపబడిన రాక్షసునివలె స్వయముగానే విడువబడియున్న వస్తువును భ్రాంతిచేత పరిహరింప నిచ్ఛయించును. ఆలాగుననే పొందబడనివస్తువును పొందనిచ్ఛయించును అని రెండుశ్లోకముల కొక్కటే యన్వయము.


    తా. ఈలోకములో బొందదగిన వస్తువులు రెండువిధములు. ఒకటి స్వతః పొందబడి యున్నప్పటికిని భ్రాంతిచే బొందబడని దానివలె తోచి పొందవలయునని కోరబడునది. దీనికి దృష్టాంతము. తన కంఠమునందున్న సువర్ణహారము అనగా ఒకానొక పురుషుడు తనకంఠమునందు హారమును ధరించి యుండినను భ్రాంతిచేత హారము లేదని తలచి దానిని పొందవలయునని కోరుచుండును. ఇదియె ప్రాప్తప్రాప్తవ్య మనంబడును.

              మఱియొకటి స్వతః పొందబడనిదైయుండియు పొందవలయునని కోరబడుచుండునది. ఇది అప్రాప్తప్రాప్తవ్య మనంబడును. దీనికి దృష్టాంతము. స్వతః హారము లేనివాడు తనకు హారము కావలయునని కోరుట. 

           ఈప్రకారమే పరిహరింపదగిన వస్తువులు రెండువిధములు. ఒకటి స్వతః విడచియున్నప్పటికిని భ్రాంతిచే విడువబడని దానివలె తోచి విడువ నిచ్ఛయింపబడునది; దీనికి దృష్టాంతము తననీడయందు దోచబడు పిశాచము, అనగా ఒకనొకపురుషుడు స్వతః పిశాచము లేనివాడైనప్పటికిని తననీడను చూచి భ్రాంతిచేత పిశాచము తనవెంట వచ్చుచున్నదని భయపడి దానిని పరిత్యజింప నిచ్ఛయించును. ఇది పరిహృతపరిహార్య మనబడును. 

            మఱియొకటి స్వతః సంభవించియుండి పరిత్యజింప నిచ్ఛయింపబడునది. దీనికిదృష్టాంతము సర్పము తన వెంటబడి తఱుముచుండగా దానిని పరిహరింప నిచ్ఛయించుట. ఇది అపరిహృతపరిహార్య మనంబడును. ఈవిధముగ ప్రాప్తవ్యములు రెండువిధములు, పరిహార్యములు రెండువిధములని తెలియవలయునని భావము.

    ReplyDelete

గురు స్మరణతో, రామకార్యంగా తలచి, ఆత్మభావనలో స్థిరపడేందుకు కావల్సిన చిత్తశుద్ధికై, ఈ నిష్కామ కర్మ రూప అక్షరయజ్ఞాన్ని, శ్లోక తాత్పర్యాది భావాన్ని చక్కగా అవగాహన చేసికొనుచు చేయ ప్రయత్నిద్దాము..

పైనున్న శ్లోకము యొక్క అవతారికను, తాత్పర్యమును ఈ దిగువ టైపు చేసిన చాలును. శ్లోకము టైపు చేయవలసిన అవసరము లేదు.

సంఖ్యలో ఎన్ని ఎక్కువ చేశాము అనేకంటే, అక్షర దోషములు ఏ ఒక్కటి తలెత్తకుండా రోజుకు ఒక్కరు కనీసం ఒక్కశ్లోకం పూర్తిగా చేసినా చాలును. త్వరితగతిన ఈ గురుకార్యం సఫలీకృతమగునని విన్నవించడమైనది.