శ్లోకాలు

1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | 35 | 36 | 37 | 38 | 39 | 40 | 41 | 42 | 43 | 44 | 45 | 46 | 47 | 48 | 49 | 50 | 51 | 52 | 53 | 54 | 55 | 56 | 57 | 58 | 59 | 60 | 61 | 62 | 63 | 64 | 65 | 66 | 67 | 68 | 69 | 70 | 71 | 72 | 73 | 74 | 75 | 76 | 77 | 78 | 79 | 80 | 81 | 82 | 83 | 84 | 85 | 86 | 87 | 88 | 89 | 90 | 91 | 92 | 93 | 94 | 95 | 96 | 97 | 98 | 99 | 100 |

updates

"నైష్కర్మ్య సిద్ధి" త్వరలో ఈ బ్లాగు మరింత ముస్తాబు కాగలదు. అప్పటి వరకూ సాధక మిత్రులు అనుభూతి ప్రకాశము అక్షరీకరణ కొనసాగించగలరని మనవి. మంగళకరమగు ఈ కార్యక్రమం నిర్విఘ్నంగా జరుగును గాక!! అక్షర యజ్ఞంలో తొలి అధ్యాయం నందలి 100 శ్లోకాల అవతారిక, దం.ఆ, తాత్పర్యాదుల అక్షరీకరణ దిగ్విజయముగా పూర్తికాబడినది.జయగురుదేవ!!

1-10




అతస్తస్యాత్యంతోచ్ఛిత్తావశేషపురుషార్థపరి-
సమాప్తిః

1-10

2 comments:

  1. ఆవ. ఓయీ! ఆత్మస్వరూపసుఖం బజ్ఞానముచే నాచ్ఛాదింపబడనిమ్ము. దాని వలన మనకేమి? యనిన జెప్పుచున్నారు.__

    సూ . అతస్తస్యాత్యంతోచ్ఛిత్తావశేషపురుషార్థపరి-సమాప్తిః

    దం-అ. కావున నా అజ్ఞానమునకు ముగింపు నిశ్శేషముగ గలిగె నేని సకల పురుషార్థంబులు సంపూర్ణముగ లభించును.

    తా. ఆత్మ స్వరూపభూతమైన సుఖమును గప్పి, యనుభవమునకు రాకుండ జేయుచున్న యజ్ఞానము నిశ్శేషముగ నివర్తించనేని యాధ్యాత్మికాది సకల దుఃఖంబులు నిశ్శేషముగ నశించి, నిరతిశయమైనా పరమానందం బావిర్భవించును గావున మఱియొక పురుషార్థంబు నొందం బని లేక యుండునని భావము.

    ఆవ. ఓయీ! అది యటులే యగునుగాక; అయినను యాగదానాదికర్మలును దహర శాండిల్యాగ్యుపాసనలును వేదశాస్త్రములచే విధింపబడియుండగా వానిని వదలి దుఃఖనివృత్తికాముండగు పురుషుడాత్మస్వరూప యాథార్థ్య జ్ఞానంబునందు బ్రవర్తించుటకును,
    అట్టి జ్ఞానమే మీ చేత నీ ప్రకరణములో చెప్పబడుటకును కారణమే మనిన చెప్పుచున్నారు.__

    ReplyDelete
  2. అవ. ఓయీ! ఆత్మస్వరూపసుఖం బజ్ఞానముచే నాచ్ఛాదింపబడనిమ్ము. దాని వలన మనకేమి? యనిన జెప్పుచున్నారు.__

    సూ . అతస్తస్యాత్యంతోచ్ఛిత్తావశేషపురుషార్థపరి-సమాప్తిః

    దం-అ. కావున నా అజ్ఞానమునకు ముగింపు నిశ్శేషముగ గలిగె నేని సకల పురుషార్థంబులు సంపూర్ణముగ లభించును.

    తా. ఆత్మ స్వరూపభూతమైన సుఖమును గప్పి, యనుభవమునకు రాకుండ జేయుచున్న యజ్ఞానము నిశ్శేషముగ నివర్తించనేని యాధ్యాత్మికాది సకల దుఃఖంబులు నిశ్శేషముగ నశించి, నిరతిశయమైన పరమానందం బావిర్భవించును గావున మఱియొక పురుషార్థంబు నొందం బని లేక యుండునని భావము.

    అవ. ఓయీ! అది యటులే యగునుగాక; అయినను యాగదానాదికర్మలును దహర శాండిల్యాద్యుపాసనలును వేదశాస్త్రములచే విధింపబడియుండగా వానిని వదలి దుఃఖనివృత్తికాముండగు పురుషుడాత్మస్వరూప యాథార్థ్య జ్ఞానంబునందు బ్రవర్తించుటకును,
    అట్టి జ్ఞానమే మీ చేత నీ ప్రకరణములో చెప్పబడుటకును కారణమే మనిన చెప్పుచున్నారు.__

    ReplyDelete

గురు స్మరణతో, రామకార్యంగా తలచి, ఆత్మభావనలో స్థిరపడేందుకు కావల్సిన చిత్తశుద్ధికై, ఈ నిష్కామ కర్మ రూప అక్షరయజ్ఞాన్ని, శ్లోక తాత్పర్యాది భావాన్ని చక్కగా అవగాహన చేసికొనుచు చేయ ప్రయత్నిద్దాము..

పైనున్న శ్లోకము యొక్క అవతారికను, తాత్పర్యమును ఈ దిగువ టైపు చేసిన చాలును. శ్లోకము టైపు చేయవలసిన అవసరము లేదు.

సంఖ్యలో ఎన్ని ఎక్కువ చేశాము అనేకంటే, అక్షర దోషములు ఏ ఒక్కటి తలెత్తకుండా రోజుకు ఒక్కరు కనీసం ఒక్కశ్లోకం పూర్తిగా చేసినా చాలును. త్వరితగతిన ఈ గురుకార్యం సఫలీకృతమగునని విన్నవించడమైనది.