శ్లోకాలు
1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | 35 | 36 | 37 | 38 | 39 | 40 | 41 | 42 | 43 | 44 | 45 | 46 | 47 | 48 | 49 | 50 | 51 | 52 | 53 | 54 | 55 | 56 | 57 | 58 | 59 | 60 | 61 | 62 | 63 | 64 | 65 | 66 | 67 | 68 | 69 | 70 | 71 | 72 | 73 | 74 | 75 | 76 | 77 | 78 | 79 | 80 | 81 | 82 | 83 | 84 | 85 | 86 | 87 | 88 | 89 | 90 | 91 | 92 | 93 | 94 | 95 | 96 | 97 | 98 | 99 | 100 |
updates
2 comments:
గురు స్మరణతో, రామకార్యంగా తలచి, ఆత్మభావనలో స్థిరపడేందుకు కావల్సిన చిత్తశుద్ధికై, ఈ నిష్కామ కర్మ రూప అక్షరయజ్ఞాన్ని, శ్లోక తాత్పర్యాది భావాన్ని చక్కగా అవగాహన చేసికొనుచు చేయ ప్రయత్నిద్దాము..
పైనున్న శ్లోకము యొక్క అవతారికను, తాత్పర్యమును ఈ దిగువ టైపు చేసిన చాలును. శ్లోకము టైపు చేయవలసిన అవసరము లేదు.
సంఖ్యలో ఎన్ని ఎక్కువ చేశాము అనేకంటే, అక్షర దోషములు ఏ ఒక్కటి తలెత్తకుండా రోజుకు ఒక్కరు కనీసం ఒక్కశ్లోకం పూర్తిగా చేసినా చాలును. త్వరితగతిన ఈ గురుకార్యం సఫలీకృతమగునని విన్నవించడమైనది.
Subscribe to:
Posts (Atom)
అవ. సమాధానమును శ్లోకముతో జెప్పుచున్నారు. ------
ReplyDeleteదం-అ. కర్మ అజ్ఞానమువలన పుట్టినందున అజ్ఞానమును పోగొట్టుటకొఱకు సమర్థమైనదికాదు. అంధకారమునకు సూర్యునివలె ఈఅజ్ఞానమునకు సమ్యక్ జ్ఞానము విరోధిగానుండును.
తా. యాగదానాదికర్మకలాపము అజ్ఞానముచేతనే పుట్టినదికావున అజ్ఞానమునక విరోధిగానుండదు. అందుచేతనే అజ్ఞానమును నివర్తింపజేయజాలదు. లోకములోగూడ పరస్పరవిరోధముగల పదార్థములలోనే యొకపదార్థము మఱియొకపదార్థమును నివర్తింపజేయునుగాని అవిరుద్ధములు నివర్తింపజేయవుగదా? కావున సూర్యుడంధకారమునకు విరోధిగానుండి ఆయంధకారమును నివర్తింపజేసినటుల ఆత్మస్వరూపవిషయమైన సమ్యక్ జ్ఞానము అజ్ఞానమునకు విరోధిగానుండి ఆయజ్ఞానము నశింపజేయును.
నిరతిశయానందప్రాప్తియును నిశ్శేషదుఃఖనివృత్తియును ఆత్మస్వరూపముకంటె భిన్నములుగావు. అట్టియాత్మస్వరూపము అజ్ఞానముచేత నావరింపబడియున్నది. ఆయజ్ఞానము ఆత్మస్వరూపసమ్యక్ జ్ఞానముచేత నశింపజేయబడగా ఆత్మస్వరూపము ప్రకాశమునొందును. అందుచేతనే ఆత్మస్వరూపాభిన్నములైన నిరతిశయసుఖప్రాప్తి నిశ్శేషదుఃఖవినాశములును ప్రకాశించును. ఇవి అజ్ఞానముచేత నాఛ్ఛాదింపబడి యున్నందున సంసారదశలో బ్రకాశింపలేదుగాని బొత్తిగా లేనందుచేతగాదు; కావుననే దేహాంతమునందేగాదు సంసారదశలో (దేహముతో గూడియున్నదశలో) గూడ సమ్యక్ జ్ఞానముగలవారికి ప్రకాశించుచున్నవి; అని ముందు విశదముగా చెప్పెదము. కావున నిరతిశయానందప్రాప్తి నిఖిలానర్థనివృత్తిరూపంబైన మోక్షము సమ్యక్ జ్ఞానముచేత సిద్దించునుగాని అజ్ఞానావిరోధియగు కర్మచేత సిద్ధింపదని భావము. ౮౮, ౮౯, ౯౦ వాక్యములకు మరియొకఅర్థము కలదు. అదియెట్లనిన శుక్తిరజ్వాదులయందు కలిగిన రజతసర్పాదిదిభ్రాంతి శుక్తిరజ్వాదిసమీపగమనమనెడి క్రియచేతగదా నివర్తించుచున్నది. ఆప్రకారమే ఆత్మస్వరూపమునందు కలిగిన సంసారిత్వభ్రాంతియును కర్మచేతనే నివృత్తియగునని శంకించుకొని పరిహారమును చెప్పుచున్నారు. మూడువాక్యములకు ప్రతిపదార్థము సమానము. తాత్పర్యమును చెప్పెదము.
లోకములో శుక్తిరజ్వాదులయందు గలిగిన రజతసర్పాదిభ్రాంతిని శుక్తిరజ్వాదిసమీపగమనమనెడి క్రియయే సాక్షాత్తుగా నశింపజేయుటలేదు. ఇకనేమనిన శుక్తిరజ్వాదిస్వరూపముతోడ పురుషునియొక్క చక్షురింద్రియము చక్కగా సంబంధించులాగునచేయును. అందుచేత శుక్తిరజ్వాది స్వరూపయాథార్థ్యజ్ఞానము కలుగును. ఆజ్ఞానము అజ్ఞానమును బోగొట్టి రజతసర్పాదిభ్రాంతిని నివర్తింపజేయును. ఆప్రకారమే కర్మయును చిత్తమునందుగల మాలిన్యమును నివర్తింపజేయును. అందుచేత ఆత్మస్వరూపయాథార్థ్యజ్ఞానము కలుగును. ఆజ్ఞానము అజ్ఞానమును నివర్తింపజేసి సంసారిత్వభ్రాంతిని నశింపజేయునుగాని సాక్షాత్తుగ నజ్ఞామును బోగొట్టజాలదు. కర్మకును అజ్ఞానమునకును పరస్పరవిరోధము లేదని అందుచేతనే కర్మ అజ్ఞానమును నివర్తింపజేయజాలదనియు నింతకుముందే చెప్పియున్నాము. శుక్తికాదిసమీపగమనముమాత్రమే రజతాదిభ్రాంతిని నివర్తింపజేయునెడల శుక్తికాసమీపమునకుబోయి శుక్తికను జూడక నలుదిక్కులు చూచునట్టివానికిని రజతభ్రాంతి నశింపవలసియుండును. ఆలాగున నశించుట లేదుగదా, కావున అజ్ఞానమును జ్ఞానమే నశింపజేయునుగాని కర్మ నశింపజేయదని భావము.
అవ. సమాధానమును శ్లోకముతో జెప్పుచున్నారు. ------
ReplyDeleteదం-అ. కర్మ అజ్ఞానము వలన పుట్టినందున అజ్ఞానమును పోగొట్టుటకొఱకు సమర్థమైనది కాదు. అంధకారమునకు సూర్యునివలె ఈఅజ్ఞానమునకు సమ్యక్ జ్ఞానము విరోధిగానుండును.
తా. యాగదానాది కర్మకలాపము అజ్ఞానముచేతనే పుట్టినది కావున అజ్ఞానమునకు విరోధిగా నుండదు. అందుచేతనే అజ్ఞానమును నివర్తింపజేయజాలదు. లోకములోగూడ పరస్పర విరోధముగల పదార్థములలోనే యొకపదార్థము మఱియొక పదార్థమును నివర్తింపజేయునుగాని అవిరుద్ధములు నివర్తింపజేయవుగదా?
కావున సూర్యుడంధకారమునకు విరోధిగానుండి ఆ యంధకారమును నివర్తింపజేసినటుల ఆత్మస్వరూప విషయమైన సమ్యక్ జ్ఞానము అజ్ఞానమునకు విరోధిగానుండి ఆ యజ్ఞానమును నశింపజేయును.
నిరతిశయానంద ప్రాప్తియును నిశ్శేష దుఃఖనివృత్తియును ఆత్మస్వరూపముకంటె భిన్నములుగావు. అట్టి యాత్మస్వరూపము అజ్ఞానముచేత నావరింపబడియున్నది. ఆ యజ్ఞానము ఆత్మస్వరూప సమ్యక్ జ్ఞానముచేత నశింపజేయబడగా ఆత్మస్వరూపము ప్రకాశమునొందును. అందుచేతనే ఆత్మస్వరూపాభిన్నములైన నిరతిశయసుఖప్రాప్తి నిశ్శేషదుఃఖవినాశములును ప్రకాశించును.
ఇవి అజ్ఞానముచేత నాఛ్ఛాదింపబడి యున్నందున సంసారదశలో బ్రకాశింపలేదుగాని బొత్తిగా లేనందుచేతగాదు; కావుననే దేహాంతమునందేగాదు సంసారదశలో (దేహముతో గూడియున్నదశలో) గూడ సమ్యక్ జ్ఞానము గలవారికి ప్రకాశించుచున్నవి; అని ముందు విశదముగా చెప్పెదము.
కావున నిరతిశయానందప్రాప్తి నిఖిలానర్థ నివృత్తిరూపంబైన మోక్షము సమ్యక్ జ్ఞానముచేత సిద్దించునుగాని అజ్ఞానావిరోధియగు కర్మచేత సిద్ధింపదని భావము. ౮౮, ౮౯, ౯౦ వాక్యములకు మరియొకఅర్థము కలదు. అదియెట్లనిన శుక్తిరజ్వాదులయందు కలిగిన రజతసర్పాది భ్రాంతి శుక్తిరజ్వాది సమీపగమనమనెడి క్రియచేతగదా నివర్తించుచున్నది.
ఆ ప్రకారమే ఆత్మస్వరూపమునందు కలిగిన సంసారిత్వభ్రాంతియును కర్మచేతనే నివృత్తియగునని శంకించుకొని పరిహారమును చెప్పుచున్నారు. మూడువాక్యములకు ప్రతిపదార్థము సమానము. తాత్పర్యమును చెప్పెదము.
లోకములో శుక్తిరజ్వాదులయందు గలిగిన రజతసర్పాది భ్రాంతిని శుక్తిరజ్వాది సమీపగమన మనెడి క్రియయే సాక్షాత్తుగా నశింపజేయుట లేదు. ఇక నేమనిన శుక్తిరజ్వాది స్వరూపముతోడ పురుషుని యొక్క చక్షురింద్రియము చక్కగా సంబంధించు లాగునచేయును. అందుచేత శుక్తిరజ్వాది స్వరూప యాథార్థ్యజ్ఞానము కలుగును. ఆ జ్ఞానము అజ్ఞానమును బోగొట్టి రజతసర్పాది భ్రాంతిని నివర్తింపజేయును.
ఆ ప్రకారమే కర్మయును చిత్తమునందుగల మాలిన్యమును నివర్తింపజేయును. అందుచేత ఆత్మస్వరూప యాథార్థ్యజ్ఞానము కలుగును. ఆ జ్ఞానము అజ్ఞానమును నివర్తింపజేసి సంసారిత్వ భ్రాంతిని నశింపజేయును గాని సాక్షాత్తుగ నజ్ఞానమును బోగొట్టజాలదు. కర్మకును అజ్ఞానమునకును పరస్పర విరోధము లేదని అందుచేతనే కర్మ అజ్ఞానమును నివర్తింపజేయజాలదనియు నింతకుముందే చెప్పియున్నాము.
శుక్తికాది సమీప గమనము మాత్రమే రజతాది భ్రాంతిని నివర్తింప జేయునెడల శుక్తికా సమీపమునకుబోయి శుక్తికను జూడక నలుదిక్కులు చూచునట్టి వానికిని రజత భ్రాంతి నశింపవలసి యుండును. ఆలాగున నశించుట లేదుగదా, కావున అజ్ఞానమును జ్ఞానమే నశింపజేయునుగాని కర్మ నశింపజేయదని భావము.