శ్లోకాలు
1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | 35 | 36 | 37 | 38 | 39 | 40 | 41 | 42 | 43 | 44 | 45 | 46 | 47 | 48 | 49 | 50 | 51 | 52 | 53 | 54 | 55 | 56 | 57 | 58 | 59 | 60 | 61 | 62 | 63 | 64 | 65 | 66 | 67 | 68 | 69 | 70 | 71 | 72 | 73 | 74 | 75 | 76 | 77 | 78 | 79 | 80 | 81 | 82 | 83 | 84 | 85 | 86 | 87 | 88 | 89 | 90 | 91 | 92 | 93 | 94 | 95 | 96 | 97 | 98 | 99 | 100 |
updates
2 comments:
గురు స్మరణతో, రామకార్యంగా తలచి, ఆత్మభావనలో స్థిరపడేందుకు కావల్సిన చిత్తశుద్ధికై, ఈ నిష్కామ కర్మ రూప అక్షరయజ్ఞాన్ని, శ్లోక తాత్పర్యాది భావాన్ని చక్కగా అవగాహన చేసికొనుచు చేయ ప్రయత్నిద్దాము..
పైనున్న శ్లోకము యొక్క అవతారికను, తాత్పర్యమును ఈ దిగువ టైపు చేసిన చాలును. శ్లోకము టైపు చేయవలసిన అవసరము లేదు.
సంఖ్యలో ఎన్ని ఎక్కువ చేశాము అనేకంటే, అక్షర దోషములు ఏ ఒక్కటి తలెత్తకుండా రోజుకు ఒక్కరు కనీసం ఒక్కశ్లోకం పూర్తిగా చేసినా చాలును. త్వరితగతిన ఈ గురుకార్యం సఫలీకృతమగునని విన్నవించడమైనది.
Subscribe to:
Posts (Atom)
దం-అ. అనుభవరూపమైన పరిశుద్ధ చిదాత్మ నాశ్రయించి యుండు సద్వితీయాత్మస్వరూపమును విషయంబుగా గల యజ్ఞానము ఏదికలదో యీయజ్ఞానమే సంసారానర్ధమునకు కారణము. ఆ యజ్ఞానము నశించిన నాత్మకు మోక్షముకలుగును.
ReplyDeleteతా. సజాతీయ, విజాతీయ, స్వగతేభేదశూన్యంబైన పరమాత్మ కేవలజ్ఞానరూపం బైయుండును. అట్టిపరమాత్మను యథార్ధముగా దెలియకపోవుటయే అజ్ఞానము. ఇది మాయయని, అవిద్య యనిగూడా చెప్పంబడును. ఇట్టి ఆజ్ఞానము శుద్ధమైన చిదాత్మ నాశ్రయించి ఆచిదాత్మయందే సర్వప్రపంచమును కల్పించి సంసారకూపమైన యనర్ధమును సంపాదించుచున్నది. ఇట్టి యజ్ఞానము నశించిపోయిన చిదాత్మకు సర్వ అనర్ధంబులు నశించిన జాతీయాదిభేదరహితంబై సచ్చిదానందాత్మకంబై యఖండంబైన శుద్ధ చిద్రూపం బావిర్భవించును. ఇదియే మోక్ష మనంబడుననిభావము. ఇందుచేత కర్తృత్వభోక్తృత్వాదిరూపంబైన సంసారము అనర్ధమని దానికి కారణ మజ్ఞానమని అజ్ఞాన నాశమే పురుషార్ధమని, ప్రకరణార్ధంబులు నాల్గింటిలో అనర్ధతత్కారణపురుషార్ధములు మూఁడు చెప్పఁబడెను.
అవ. శోకము నుదాహరించుచున్నారు.___
ReplyDeleteశ్లో. ఐకాత్మ్యా ప్రతిపత్తిర్యా స్వాత్మానిభవసంశ్రయా,
సాఽవిద్యా సంసృతే ర్బీజం తన్నాశో ముక్తిరాత్మనః ౨౭
దం-అ. అనుభవరూపమైన పరిశుద్ధచిదాత్మ నాశ్రయించి యుండు సద్వితీయాత్మస్వరూపమును విషయంబుగా గల యజ్ఞానము ఏదికలదో యీయజ్ఞానమే సంసారానర్ధమునకు కారణము. ఆయజ్ఞానము నశించిన నాత్మకు మోక్షముకలుగును.
తా. సజాతీయ, విజాతీయ, స్వగతేభేదశూన్యంబైన పరమాత్మ కేవలజ్ఞానరూపం బైయుండును. అట్టిపరమాత్మను యథార్ధముగా దెలియకపోవుటయే అజ్ఞానము. ఇది మాయయని, అవిద్య యనిగూడా చెప్పంబడును. ఇట్టి ఆజ్ఞానము శుద్ధమైన చిదాత్మ నాశ్రయించి ఆచిదాత్మయందే సర్వప్రపంచమును కల్పించి సంసారకూపమైన యనర్ధమును సంపాదించుచున్నది. ఇట్టి యజ్ఞానము నశించిపోయిన చిదాత్మకు సర్వ అనర్ధంబులు నశించిన జాతీయాదిభేదరహితంబై సచ్చిదానంబాత్మకంబై యఖండంబైన శుద్ధ చిద్రూపం బావిర్భవించును. ఇదియే మోక్ష మనంబడుననిభావము. ఇందుచేత కర్తృత్వభోక్తృత్వాదిరూపంబైన సంసారము అనర్ధమని దానికి కారణ మజ్ఞానమని అజ్ఞాన నాశమే పురుషార్ధమని ప్రకరణార్ధంబులు నాల్గింటిలో అనర్ధతత్కారణపురుషార్ధములు మూఁడు చెప్పఁబడెను.