శ్లోకాలు

1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | 35 | 36 | 37 | 38 | 39 | 40 | 41 | 42 | 43 | 44 | 45 | 46 | 47 | 48 | 49 | 50 | 51 | 52 | 53 | 54 | 55 | 56 | 57 | 58 | 59 | 60 | 61 | 62 | 63 | 64 | 65 | 66 | 67 | 68 | 69 | 70 | 71 | 72 | 73 | 74 | 75 | 76 | 77 | 78 | 79 | 80 | 81 | 82 | 83 | 84 | 85 | 86 | 87 | 88 | 89 | 90 | 91 | 92 | 93 | 94 | 95 | 96 | 97 | 98 | 99 | 100 |

updates

"నైష్కర్మ్య సిద్ధి" త్వరలో ఈ బ్లాగు మరింత ముస్తాబు కాగలదు. అప్పటి వరకూ సాధక మిత్రులు అనుభూతి ప్రకాశము అక్షరీకరణ కొనసాగించగలరని మనవి. మంగళకరమగు ఈ కార్యక్రమం నిర్విఘ్నంగా జరుగును గాక!! అక్షర యజ్ఞంలో తొలి అధ్యాయం నందలి 100 శ్లోకాల అవతారిక, దం.ఆ, తాత్పర్యాదుల అక్షరీకరణ దిగ్విజయముగా పూర్తికాబడినది.జయగురుదేవ!!

1-12





అశేషానర్థహేత్వాత్మానవబోధ-
విషయస్య చానాగమికప్రత్యక్షాదిలౌకికప్రమాణావిషయత్వా-
ద్వేదాంతాగమవాక్యాదేవ సమ్యగ్జ్ఞానం


1-12

8 comments:

  1. శ్రీ గురుభ్యోనమః
    ఈ పేజీ నేను వ్రాస్తున్నాను

    ReplyDelete
  2. ఆవ. ఆత్మ స్వరూపయాధార్థ్యజ్ఞానము గ్రహింపదగియుండుగాక! అయిన నట్టిజ్ఞానము ప్రమాణాంతరములచేతగలుగదా? సమ్యక్ జ్ఞాన సంపాదన కిచ్ఛగల యధికారి వేదాంతములయందే నియతముగా ప్రవర్తింపవలసినపని యేమి యనిన చెప్పుచున్నారు.

    ReplyDelete
  3. దం అ. సర్వానర్థకారణమైన యాత్మస్వరూపాజ్ఞానమునకు గోచరమై యుండెడు నాత్మస్వరూపము వేదములకంటే భిన్నములగు ప్రత్యక్ష, అనుమానాది లౌకిక ప్రమాణంబులకు గోచరింపనందున వేదాంత శాస్త్రమునందున్న వాక్యమువలననే సమ్యక్ జ్ఞానము సంపాదింపదగియున్నది.

    ReplyDelete
  4. తా. ఆధ్యాత్మికాది దుఃఖరూపంబులగు సకలానర్థంబులకు కారణం ఆత్మ స్వరూపాజ్ఞానంబే యని ముందే చెప్పియున్నారము.అట్టి యజ్ఞానం దాత్మ స్వరూపము నాశ్రయించి ఆత్మ స్వరూపమునే విషయముగా గైకొని ప్రవర్తించుచుండు.

    ReplyDelete
  5. ఈ ప్రకారం అజ్ఞానగోచరంబ్యెన యాత్మస్వరూపము వేదవాక్యములచేతనే తెలియదగియున్నదిగాని ప్రత్యక్ష, అనుమానంబులకు గోచరింపదు. అది యెట్లనిన, రూపంబు గల పదార్థము నేత్రములకు గోచరమగును. ఆత్మకు రూపములేనందున ఆత్మస్వరూపము నేత్రములకు గోచరముకాదు. ఒక పదార్థమున నొక భాగము నేత్రములకు గన్పట్టి మరియొక భాగము నేత్రములకు గాన్పించనిచో, నాగాన్పించనిభాగము ననుమానముచే దెలియనగును.ఆత్మ స్వరూపమున నొక భాగము నేత్రములకు గన్పట్టదుగావున ఆత్మ స్వరూపం అనుమానముచే దెలియంబడదు; కావున నాత్మస్వరూపయాథార్ధ్యమును దెలియంజేయు సమ్యక్ జ్ఞానము వేదాంతవాక్యములుచే దెలియవలసియున్నందున సమ్యక్ జ్ఞాన సంపాదనేచ్ఛగల యధికారి వేదాంతములయందే నియమముగా బ్రవర్తింపవలయునని యభిప్రాయము.

    ReplyDelete
  6. ఇందుచేత యాత్మస్వరూప యాధాత్మ్య జ్ఞానమే సకలానర్థ నివృత్తి రూప ప్రయోజనంబునకు సాధనంబనియు, ఆత్మస్వరూపమే విషయమనియు జెప్పబడెను. సంబంధము యధాయధంబుగ నూహజేయవలసినది.అనగా ప్రయోజనమునకును దానిసాధనములకును సాధ్యసాధనభావసంబంధంబని,అధికారికిని ప్రయోజనములకును ప్రాప్య్తప్రాపకసంబంధమని, అధికారి సాధనంబులకు ప్రాప్య్తప్రాపకసంబంధంబని, అధికారివిషయములకు జ్ఞాత్రజ్ఞేయసంబంధంబని యీవిధముగా నూహింపవలయు.

    ReplyDelete
  7. అవ. ఆత్మ స్వరూపయాధార్థ్యజ్ఞానము గ్రహింపదగియుండుగాక! అయిన నట్టిజ్ఞానము ప్రమాణాంతరములచేతగలుగదా? సమ్యక్ జ్ఞాన సంపాదన కిచ్ఛగల యధికారి వేదాంతములయందే నియతముగా ప్రవర్తింపవలసినపని యేమి యనిన చెప్పుచున్నారు.



    దం అ. సర్వానర్థకారణమైన యాత్మస్వరూపాజ్ఞానమునకు గోచరమై యుండెడు నాత్మస్వరూపము వేదములకంటే భిన్నములగు ప్రత్యక్ష, అనుమానాది లౌకిక ప్రమాణంబులకు గోచరింపనందున వేదాంత శాస్త్రమునందున్న వాక్యమువలననే సమ్యక్ జ్ఞానము సంపాదింపదగియున్నది.


    తా. ఆధ్యాత్మికాది దుఃఖరూపంబులగు సకలానర్థంబులకు కారణం ఆత్మ స్వరూపాజ్ఞానంబే యని ముందే చెప్పియున్నారము.అట్టి యజ్ఞానం బాత్మ స్వరూపము నాశ్రయించి ఆత్మ స్వరూపమునే విషయముగా గైకొని ప్రవర్తించుచుండు.



    ఈ ప్రకారం అజ్ఞానగోచరంబైన యాత్మస్వరూపము వేదవాక్యములచేతనే తెలియదగియున్నదిగాని ప్రత్యక్ష, అనుమానంబులకు గోచరింపదు. అది యెట్లనిన, రూపంబు గల పదార్థము నేత్రములకు గోచరమగును. ఆత్మకు రూపములేనందున ఆత్మస్వరూపము నేత్రములకు గోచరముకాదు. ఒక పదార్థమున నొక భాగము నేత్రములకు గన్పట్టి మరియొక భాగము నేత్రములకు గాన్పించనిచో, నాగాన్పించనిభాగము ననుమానముచే దెలియనగును.

             ఆత్మ స్వరూపమున నొక భాగము నేత్రములకు గన్పట్టదుగావున ఆత్మ స్వరూపం అనుమానముచే దెలియంబడదు; కావున నాత్మస్వరూపయాథార్ధ్యమును దెలియంజేయు సమ్యక్ జ్ఞానము వేదాంతవాక్యములచే దెలియవలసియున్నందున సమ్యక్ జ్ఞాన సంపాదనేచ్ఛగల యధికారి వేదాంతములయందే నియమముగా బ్రవర్తింపవలయునని యభిప్రాయము.


    ఇందుచేత యాత్మస్వరూప యాధాత్మ్య జ్ఞానమే సకలానర్థ నివృత్తి రూప ప్రయోజనంబునకు సాధనంబనియు, ఆత్మస్వరూపమే విషయమనియు జెప్పబడెను. సంబంధము యధాయధంబుగ నూహజేయవలసినది. అనగా ప్రయోజనమునకును దానిసాధనములకును సాధ్యసాధనభావసంబంధంబని, అధికారికిని ప్రయోజనములకును ప్రాప్య్తప్రాపకసంబంధమని, అధికారి సాధనంబులకు ప్రాప్య్తప్రాపకసంబంధంబని, అధికారివిషయములకు జ్ఞాత్రజ్ఞేయసంబంధంబని యీవిధముగా నూహింపవలయు.

    ReplyDelete
  8. ఆవ. ఇప్పుడు ప్రకరణలక్షణమునుజెప్పుచు నింతవరకు నుపపాదించిన ప్రకరణారంభ ప్రతిజ్ఞను ప్రారంభించుచున్నారు.

    ReplyDelete

గురు స్మరణతో, రామకార్యంగా తలచి, ఆత్మభావనలో స్థిరపడేందుకు కావల్సిన చిత్తశుద్ధికై, ఈ నిష్కామ కర్మ రూప అక్షరయజ్ఞాన్ని, శ్లోక తాత్పర్యాది భావాన్ని చక్కగా అవగాహన చేసికొనుచు చేయ ప్రయత్నిద్దాము..

పైనున్న శ్లోకము యొక్క అవతారికను, తాత్పర్యమును ఈ దిగువ టైపు చేసిన చాలును. శ్లోకము టైపు చేయవలసిన అవసరము లేదు.

సంఖ్యలో ఎన్ని ఎక్కువ చేశాము అనేకంటే, అక్షర దోషములు ఏ ఒక్కటి తలెత్తకుండా రోజుకు ఒక్కరు కనీసం ఒక్కశ్లోకం పూర్తిగా చేసినా చాలును. త్వరితగతిన ఈ గురుకార్యం సఫలీకృతమగునని విన్నవించడమైనది.