శ్లోకాలు
1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | 35 | 36 | 37 | 38 | 39 | 40 | 41 | 42 | 43 | 44 | 45 | 46 | 47 | 48 | 49 | 50 | 51 | 52 | 53 | 54 | 55 | 56 | 57 | 58 | 59 | 60 | 61 | 62 | 63 | 64 | 65 | 66 | 67 | 68 | 69 | 70 | 71 | 72 | 73 | 74 | 75 | 76 | 77 | 78 | 79 | 80 | 81 | 82 | 83 | 84 | 85 | 86 | 87 | 88 | 89 | 90 | 91 | 92 | 93 | 94 | 95 | 96 | 97 | 98 | 99 | 100 |
updates
2 comments:
గురు స్మరణతో, రామకార్యంగా తలచి, ఆత్మభావనలో స్థిరపడేందుకు కావల్సిన చిత్తశుద్ధికై, ఈ నిష్కామ కర్మ రూప అక్షరయజ్ఞాన్ని, శ్లోక తాత్పర్యాది భావాన్ని చక్కగా అవగాహన చేసికొనుచు చేయ ప్రయత్నిద్దాము..
పైనున్న శ్లోకము యొక్క అవతారికను, తాత్పర్యమును ఈ దిగువ టైపు చేసిన చాలును. శ్లోకము టైపు చేయవలసిన అవసరము లేదు.
సంఖ్యలో ఎన్ని ఎక్కువ చేశాము అనేకంటే, అక్షర దోషములు ఏ ఒక్కటి తలెత్తకుండా రోజుకు ఒక్కరు కనీసం ఒక్కశ్లోకం పూర్తిగా చేసినా చాలును. త్వరితగతిన ఈ గురుకార్యం సఫలీకృతమగునని విన్నవించడమైనది.
Subscribe to:
Posts (Atom)
అవ. ఈ ప్రకారము ఇష్టసాధనములను అనిష్టసాధనములను తెలిసినందున రాగద్వేషములు కలుగుననియు రాగద్వేషములు కలుగుటచేత ప్రవృత్తినివృత్తులు సంభవించుననియు పూర్వ గ్రంథములో చెప్పిన అర్థమును సంగ్రహముగా ననువ దించుతున్నారు.--- దం-అ. ఈప్రకారము ప్రత్యక్షము అనుమానము శాస్త్రము అనుమూడు ప్రమాణముల నవలంబించుటచేత ఆత్మకు నిరవధికానందమను అనుకూలవిషయము తోడ అభేదము సిద్ధించినందువలన ప్రతికూలవిషయమగుదుఃఖము ఆరవప్రమాణమునకు గోచరించునట్టి అభావమువలె సహజముగ సంబంధింపకపోవుటవల్లను ఇట్టిస్వభావముగల ఆత్మస్వరూపమును తెలియకపోవుటచేతనే అనుకూలవిషయము తనకు కావలయునని ప్రతికూలవిషయము తనకు లేకపోవలయునని కలుగుమిథ్యాజ్ఞానము చవిటినేలను, ముత్యపుచిప్పను ఎరుగనందుచేత కలిగినమిథ్యాజ్ఞానమువలె ప్రవృత్తినివృత్తులకు నిమిత్తంబైయుండునని నిర్ణయింపబడినది. శాస్త్రమును పదార్థములయందు సామర్థ్యమును పుట్టించునది కాదనియు నిర్ణయింపబడినది. తా. ప్రత్యక్షానుమానాగమములను బట్టి విచారింపగా ఆత్మ నిత్యనిర్దుఃఖనిరతి శయపరమానంద స్వరూపుడనిగనుకనే ఈయాత్మకు పొందదగిన హితముగాని, నివర్తింపదగినదుఃఖము (అహితము) గాని లేశమైనను లేదనియు అయినను ఇట్టియాత్మయొక్క వాస్తవస్వరూపము నెరుంగమింజేసి, తనకొకహితము పొందవలసియున్నట్టును, అహితము నివర్తింపవలసియున్నట్టును తోచుచున్నదనియు ఇదియే మిథ్యాజ్ఞానమనియు ఈ మిథ్యాజ్ఞానమే హితప్రాప్తికిని అహితనివృత్తికిని సాధనములైన లౌకికవైదికకర్మలయందన్నిటియందు ప్రవర్తించుటకును కారణమైయున్నదనియు సూర్యు డాయాగ్రామంబులకు బోవదలంచినవారికి ఆయాగ్రామమార్గంబులను బ్రకాశింపజేయునటులు వేదమును, సుఖప్రాప్తి దుఃఖనివృత్తులను కోరువారీకి తత్సాధనములను ప్రకాశింపజేయును గాని చిదాత్మ యందు కర్తృత్వభోక్తృత్వవర్ణాశ్రమాదివిశేషశక్తిని స్వర్గాదులయందు సాధ్యత్వమును యాగాదులయందు సాధనత్వమును పుట్టించునది కాదనియు పూర్వశ్లోకము లోప్రతిపాదింపబడినదని భావము. ఆరవప్రమాణమనగా ననుపలబ్ధిప్రమాణము; ఇది అభావమును తెలియజేయును. అభావము ఏవిధమున సత్తకలది కానేరదో ఆవిధముననే దుఃఖము ఆత్మయందు సత్తకలదికాదని భావము. ఊషరభూమియొక్క స్వరూపము నెరుంగకపోవుటచే నచ్చట జలమనెడిభ్రాంతి కలుగును. ఇది యొకవస్తువునందు మరియొకవస్తువనెడు జ్ఞానమైనందున మిథ్యాజ్ఞాన మనబడును. ఈమిథ్యాజ్ఞానమేకదా జలపానరజితగ్రహణములయందు బ్రవర్తించుటకు నిమిత్తము అని దృష్టాంతవాక్యమునకు భావము.
ReplyDeleteఅవ. ఈ ప్రకారము ఇష్టసాధనములను అనిష్టసాధనములను తెలిసినందున రాగద్వేషములు కలుగుననియు రాగద్వేషములు కలుగుటచేత ప్రవృత్తినివృత్తులు సంభవించుననియు పూర్వ గ్రంథములో చెప్పిన అర్థమును సంగ్రహముగా ననువ దించుతున్నారు.---
ReplyDeleteదం-అ. ఈప్రకారము ప్రత్యక్షము అనుమానము శాస్త్రము అనుమూడు ప్రమాణముల నవలంబించుటచేత ఆత్మకు నిరవధికానందమను అనుకూలవిషయము తోడ అభేదము సిద్ధించినందు వలన ప్రతికూల విషయమగు దుఃఖము ఆరవ ప్రమాణమునకు గోచరించునట్టి అభావమువలె సహజముగ సంబంధింపకపోవుటవల్లను , ఇట్టిస్వభావముగల ఆత్మస్వరూపమును తెలియకపోవుటచేతనే అనుకూలవిషయము తనకు కావలయునని ప్రతికూలవిషయము తనకు లేకపోవలయునని కలుగుమిథ్యాజ్ఞానము చవిటినేలను, ముత్యపుచిప్పను ఎరుగనందుచేత కలిగిన మిథ్యాజ్ఞానము వలె ప్రవృత్తి నివృత్తులకు నిమిత్తంబై యుండునని నిర్ణయింపబడినది.
శాస్త్రమును పదార్థములయందు సామర్థ్యమును పుట్టించునది కాదనియు నిర్ణయింపబడినది.
తా. ప్రత్యక్షానుమానాగమములను బట్టి విచారింపగా ఆత్మ నిత్య నిర్దుఃఖ నిరతిశయ పరమానంద స్వరూపుడనిగనుకనే ఈయాత్మకు పొందదగిన హితముగాని, నివర్తింప దగిన దుఃఖము (అహితము) గాని లేశమైనను లేదనియు అయినను ఇట్టి యాత్మ యొక్క వాస్తవ స్వరూపము నెరుంగమింజేసి, తనకొక హితము పొందవలసి యున్నట్టును, అహితము నివర్తింప వలసి యున్నట్టును తోచుచున్నదనియు ఇదియే మిథ్యాజ్ఞానమనియు ఈ మిథ్యాజ్ఞానమే హితప్రాప్తికిని అహితనివృత్తికిని సాధనములైన లౌకిక వైదిక కర్మల యందన్నిటి యందు ప్రవర్తించుటకును కారణమై యున్నదనియు సూర్యు డాయా గ్రామంబులకు బోవదలంచిన వారికి ఆయా గ్రామమార్గంబులను బ్రకాశింప జేయునటులు వేదమును, సుఖప్రాప్తి దుఃఖనివృత్తులను కోరువారికి తత్సాధనములను ప్రకాశింపజేయును గాని చిదాత్మ యందు కర్తృత్వ భోక్తృత్వ వర్ణాశ్రమాది విశేషశక్తిని స్వర్గాదుల యందు సాధ్యత్వమును యాగాదులయందు సాధనత్వమును పుట్టించునది కాదనియు పూర్వశ్లోకము లోప్రతిపాదింపబడినదని భావము.
ఆరవప్రమాణమనగా ననుపలబ్ధి ప్రమాణము; ఇది అభావమును తెలియజేయును. అభావము ఏవిధమున సత్తకలది కానేరదో ఆ విధముననే దుఃఖము ఆత్మయందు సత్తకలది కాదని భావము. ఊషరభూమియొక్క స్వరూపము నెరుంగకపోవుటచే నచ్చట జలమనెడిభ్రాంతి కలుగును. ఇది యొక వస్తువు నందు మరియొక వస్తువనెడు జ్ఞానమై నందున మిథ్యాజ్ఞాన మనబడును. ఈమిథ్యాజ్ఞానమే కదా జలపాన రజిత గ్రహణముల యందు బ్రవర్తించుటకు నిమిత్తము అని దృష్టాంత వాక్యమునకు భావము.