శ్లోకాలు
1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | 35 | 36 | 37 | 38 | 39 | 40 | 41 | 42 | 43 | 44 | 45 | 46 | 47 | 48 | 49 | 50 | 51 | 52 | 53 | 54 | 55 | 56 | 57 | 58 | 59 | 60 | 61 | 62 | 63 | 64 | 65 | 66 | 67 | 68 | 69 | 70 | 71 | 72 | 73 | 74 | 75 | 76 | 77 | 78 | 79 | 80 | 81 | 82 | 83 | 84 | 85 | 86 | 87 | 88 | 89 | 90 | 91 | 92 | 93 | 94 | 95 | 96 | 97 | 98 | 99 | 100 |
updates
3 comments:
గురు స్మరణతో, రామకార్యంగా తలచి, ఆత్మభావనలో స్థిరపడేందుకు కావల్సిన చిత్తశుద్ధికై, ఈ నిష్కామ కర్మ రూప అక్షరయజ్ఞాన్ని, శ్లోక తాత్పర్యాది భావాన్ని చక్కగా అవగాహన చేసికొనుచు చేయ ప్రయత్నిద్దాము..
పైనున్న శ్లోకము యొక్క అవతారికను, తాత్పర్యమును ఈ దిగువ టైపు చేసిన చాలును. శ్లోకము టైపు చేయవలసిన అవసరము లేదు.
సంఖ్యలో ఎన్ని ఎక్కువ చేశాము అనేకంటే, అక్షర దోషములు ఏ ఒక్కటి తలెత్తకుండా రోజుకు ఒక్కరు కనీసం ఒక్కశ్లోకం పూర్తిగా చేసినా చాలును. త్వరితగతిన ఈ గురుకార్యం సఫలీకృతమగునని విన్నవించడమైనది.
Subscribe to:
Posts (Atom)
x
ReplyDeleteఅవ. ఓయీ! అజ్ఞానము జ్ఞానము కలిగిన నివర్తించును. ఈయర్థము లోకములో ననుభవసిద్ధమై యున్నదిగదా! కావున నజ్ఞాననివర్తకమైన జ్ఞానమునందు శృతిస్మృతులలో విధివచనము లేకపోయిన నేమియని సిద్ధాంతవాదివలె మఱియొకడు శంకించుచున్నాడు.___
ReplyDeleteవాక్య. స్యాత్ప్రవృత్తి రంతరేణాపి విధిం లోకవత్.
దం-అ. విధివచనము లేకపోయినను లోకమునందువలె జ్ఞానమునందు ప్రవృత్తి కలుగవచ్చును.
తా. లోకములో శుక్తికాదులవిషయమై కలిగినయజ్ఞానము శుక్తికాదిస్వరూపజ్ఞానము కలిగిన నివర్తించుచున్నది. అట్టి యజ్ఞానము కలవరాయజ్ఞానము నివర్తింపవలయునని కోరి జ్ఞానమును సంపాదించుటకు ప్రయత్నమును స్వయముగనే చేయుచున్నారుగదా. ఆప్రకారమే యాత్మస్వరూపమునందుగల యజ్ఞానమును నివర్తింపజేయంగోరిన వారాత్మస్వరూపజ్ఞానమును సంపాదింపంగోరి స్వయముగనే ప్రవర్తించెదరు. శృతిస్మృతులయందు జ్ఞానమును గూర్చి విధిలేకపోయిన నేమిహానికలుగును? ప్రత్యక్షానుమానాది ప్రమాణాంతరములచే దెలియబడని యర్థమునేగదా శృతిస్మృతులు విధింపవలసియుండెడును. అజ్ఞానము జ్ఞానముచే నివర్తించునని అజ్ఞాననివృత్తి కాముడు జ్ఞానమును సంపాదింపవలయుననే యర్థము ప్రత్యక్షప్రమాణమైన లోకమువలన సిద్ధించుచుండగా శృతిస్మృతులు విధింపవలసిన యవసరంలేదని భావము.
అవ. ఓయీ! అజ్ఞానము జ్ఞానము కలిగిన నివర్తించును. ఈయర్థము లోకములో ననుభవసిద్ధమై యున్నదిగదా! కావున నజ్ఞాననివర్తకమైన జ్ఞానమునందు శృతిస్మృతులలో విధివచనము లేకపోయిన నేమియని సిద్ధాంతవాదివలె మఱియొకడు శంకించుచున్నాడు.___
ReplyDeleteవాక్య. స్యాత్ప్రవృత్తి రంతరేణాపి విధిం లోకవత్.
దం-అ. విధివచనము లేకపోయినను లోకమునందువలె జ్ఞానమునందు ప్రవృత్తి కలుగవచ్చును.
తా. లోకములో శుక్తికాదులవిషయమై కలిగిన యజ్ఞానము శుక్తికాది స్వరూపజ్ఞానము కలిగిన నివర్తించుచున్నది. అట్టి యజ్ఞానము కలవారా యజ్ఞానము నివర్తింపవలయునని కోరి జ్ఞానమును సంపాదించుటకు ప్రయత్నమును స్వయముగనే చేయుచున్నారుగదా.
ఆప్రకారమే యాత్మస్వరూపమునందుగల యజ్ఞానమును నివర్తింపజేయంగోరిన వారాత్మస్వరూపజ్ఞానమును సంపాదింపంగోరి స్వయముగనే ప్రవర్తించెదరు. శృతిస్మృతులయందు జ్ఞానమును గూర్చి విధిలేకపోయిన నేమిహానికలుగును?
ప్రత్యక్షానుమానాది ప్రమాణాంతరములచే దెలియబడని యర్థమునేగదా శృతిస్మృతులు విధింపవలసియుండును. అజ్ఞానము జ్ఞానముచే నివర్తించునని అజ్ఞాననివృత్తి కాముడు జ్ఞానమును సంపాదింపవలయుననే యర్థము ప్రత్యక్ష ప్రమాణమైన లోకమువలన సిద్ధించుచుండగా శృతిస్మృతులు విధింపవలసిన యవసరంలేదని భావము.