శ్లోకాలు
1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | 35 | 36 | 37 | 38 | 39 | 40 | 41 | 42 | 43 | 44 | 45 | 46 | 47 | 48 | 49 | 50 | 51 | 52 | 53 | 54 | 55 | 56 | 57 | 58 | 59 | 60 | 61 | 62 | 63 | 64 | 65 | 66 | 67 | 68 | 69 | 70 | 71 | 72 | 73 | 74 | 75 | 76 | 77 | 78 | 79 | 80 | 81 | 82 | 83 | 84 | 85 | 86 | 87 | 88 | 89 | 90 | 91 | 92 | 93 | 94 | 95 | 96 | 97 | 98 | 99 | 100 |
updates
2 comments:
గురు స్మరణతో, రామకార్యంగా తలచి, ఆత్మభావనలో స్థిరపడేందుకు కావల్సిన చిత్తశుద్ధికై, ఈ నిష్కామ కర్మ రూప అక్షరయజ్ఞాన్ని, శ్లోక తాత్పర్యాది భావాన్ని చక్కగా అవగాహన చేసికొనుచు చేయ ప్రయత్నిద్దాము..
పైనున్న శ్లోకము యొక్క అవతారికను, తాత్పర్యమును ఈ దిగువ టైపు చేసిన చాలును. శ్లోకము టైపు చేయవలసిన అవసరము లేదు.
సంఖ్యలో ఎన్ని ఎక్కువ చేశాము అనేకంటే, అక్షర దోషములు ఏ ఒక్కటి తలెత్తకుండా రోజుకు ఒక్కరు కనీసం ఒక్కశ్లోకం పూర్తిగా చేసినా చాలును. త్వరితగతిన ఈ గురుకార్యం సఫలీకృతమగునని విన్నవించడమైనది.
Subscribe to:
Posts (Atom)
అవ. వేదములు కర్మపరములని జైమినిమహామునిచెప్పిన సూత్రమును శ్లోకముతో నుదాహరించుచున్నాడు.----
ReplyDeleteదం-అ. వేదము కర్మలే ప్రతిపాద్యములుగాగలిగియున్నందున దీనికంటె భిన్నమైనది అప్రమాణము. అని వేదములనెఱింగిన జైమినిమహాముని తాను సంకోచములేనటుల ప్రసిద్ధముగ చెప్పెను.
తా. జైమినిమహాముని సకలవేదములయొక్క తాత్పర్యమును నిస్సంశయముగ దెలియజేయుటకుగాను పండ్రెండధ్యాయములుగల మీమాంసాశాస్త్రమును రచించెను.
ఆశాస్త్రములలో మున్నుగా ధర్మమును విచారించెదనని ప్రతిజ్ఞ చేసి ధర్మమును ప్రతిపాదించెడి ప్రమాణము వేదమనిచెప్పి ఆవేదము పురుషులచే నిర్మింపబడినది కానందునను, అనాదిగురుశిష్యపరంపరగా నీలోకములో బ్రవర్తించుచున్నందున నిర్దోషమని నిత్యమని ప్రతిపాదించి ఇట్టివేదము సాకల్యముగా ధర్మమని చెప్పబడుకర్మలనే ప్రతిపాదించుచున్నదని కర్మప్రతిపాదకంబుగాని వేదభాగ మొక్కింతయైనను లేదనిచెప్పెను.
తరువాత వేదము కొంతభాగము విధిరూపముగ, కొంతభాగము మంత్రరూపముగ, మఱికొంతభాగము అర్థవాదరూపముగగదా యున్నవి.
అందులో విధిరూపమైన భాగము కర్మలను ప్రతిపాదించుచున్నప్పటికిని మంత్రార్థవాదములుగల భాగములు కర్మలను ప్రతిపాదింపలేవుగదా? కావున నాభాగము ప్రమాణముగాకపోవలయునని యాక్షేపించుకొని మంత్రార్థవాదములుకూడ కర్మప్రతిపాదకంబులైన విధివాక్యములతో నేకీభవించి కర్మలనే నిరూపించుచున్నందున విధివాక్యములతో సమానములుగా ప్రమాణములైయుండునని ప్రతిపాదించెను.
అతీంద్రియపదార్థములనెల్ల ప్రత్యక్షముగ జూడదగిన తపఃప్రభావముగలిగి సర్వవేదతాత్పర్యమును కరతలామలకముగా సాక్షాత్కరింపజేసికొనియున్న జైమినిమహాముని పూర్వపక్షసిద్ధాంతపూర్వకముగా సర్వలోకవిదితంబగునటుల వేదములు కర్మలనే ప్రతిపాదించుచున్నవనిచెప్పినందున వేదము కర్మప్రతిపాదకమేగాని తత్వజ్ఞానప్రతిపాదకముగాదని నిశ్చయింపవలయునని భావము.
అవ. వేదములు కర్మపరములని జైమినిమహామునిచెప్పిన సూత్రమును శ్లోకముతో నుదాహరించుచున్నాడు.----
ReplyDeleteదం-అ. వేదము కర్మలే ప్రతిపాద్యములుగాగలిగియున్నందున దీనికంటె భిన్నమైనది అప్రమాణము అని వేదములనెఱింగిన జైమినిమహాముని తాను సంకోచములేనటుల ప్రసిద్ధముగ చెప్పెను.
తా. జైమినిమహాముని సకలవేదములయొక్క తాత్పర్యమును నిస్సంశయముగ దెలియజేయుటకుగాను పండ్రెండధ్యాయములుగల మీమాంసాశాస్త్రమును రచించెను.
ఆ శాస్త్రములలో మున్నుగా ధర్మమును విచారించెదనని ప్రతిజ్ఞ చేసి ధర్మమును ప్రతిపాదించెడి ప్రమాణము వేదమనిచెప్పి ఆవేదము పురుషులచే నిర్మింపబడినది కానందునను, అనాది గురుశిష్య పరంపరగా నీలోకములో బ్రవర్తించుచున్నందున నిర్దోషమని నిత్యమని ప్రతిపాదించి ఇట్టివేదము సాకల్యముగా ధర్మమని చెప్పబడుకర్మలనే ప్రతిపాదించుచున్నదని , కర్మప్రతిపాదకంబుగాని వేదభాగ మొక్కింతయైనను లేదనిచెప్పెను.
తరువాత వేదము కొంతభాగము విధిరూపముగ, కొంతభాగము మంత్రరూపముగ, మఱికొంతభాగము అర్థవాదరూపముగ గదా యున్నవి.
అందులో విధిరూపమైన భాగము కర్మలను ప్రతిపాదించుచున్నప్పటికిని మంత్రార్థవాదములుగల భాగములు కర్మలను ప్రతిపాదింపలేవుగదా? కావున నాభాగము ప్రమాణముగాక పోవలయునని యాక్షేపించుకొని మంత్రార్థవాదములుకూడ కర్మప్రతిపాదకంబులైన విధివాక్యములతో నేకీభవించి కర్మలనే నిరూపించుచున్నందున విధివాక్యములతో సమానములుగా ప్రమాణములై యుండునని ప్రతిపాదించెను.
అతీంద్రియపదార్థములనెల్ల ప్రత్యక్షముగ జూడదగిన తపఃప్రభావముగలిగి సర్వవేదతాత్పర్యమును కరతలామలకముగా సాక్షాత్కరింపజేసికొనియున్న జైమినిమహాముని పూర్వపక్షసిద్ధాంతపూర్వకముగా సర్వలోక విదితంబగునటుల వేదములు కర్మలనే ప్రతిపాదించుచున్నవని చెప్పినందున వేదము కర్మప్రతిపాదకమేగాని తత్వజ్ఞాన ప్రతిపాదకముగాదని నిశ్చయింపవలయునని భావము.