శ్లోకాలు
1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | 35 | 36 | 37 | 38 | 39 | 40 | 41 | 42 | 43 | 44 | 45 | 46 | 47 | 48 | 49 | 50 | 51 | 52 | 53 | 54 | 55 | 56 | 57 | 58 | 59 | 60 | 61 | 62 | 63 | 64 | 65 | 66 | 67 | 68 | 69 | 70 | 71 | 72 | 73 | 74 | 75 | 76 | 77 | 78 | 79 | 80 | 81 | 82 | 83 | 84 | 85 | 86 | 87 | 88 | 89 | 90 | 91 | 92 | 93 | 94 | 95 | 96 | 97 | 98 | 99 | 100 |
updates
1 comment:
గురు స్మరణతో, రామకార్యంగా తలచి, ఆత్మభావనలో స్థిరపడేందుకు కావల్సిన చిత్తశుద్ధికై, ఈ నిష్కామ కర్మ రూప అక్షరయజ్ఞాన్ని, శ్లోక తాత్పర్యాది భావాన్ని చక్కగా అవగాహన చేసికొనుచు చేయ ప్రయత్నిద్దాము..
పైనున్న శ్లోకము యొక్క అవతారికను, తాత్పర్యమును ఈ దిగువ టైపు చేసిన చాలును. శ్లోకము టైపు చేయవలసిన అవసరము లేదు.
సంఖ్యలో ఎన్ని ఎక్కువ చేశాము అనేకంటే, అక్షర దోషములు ఏ ఒక్కటి తలెత్తకుండా రోజుకు ఒక్కరు కనీసం ఒక్కశ్లోకం పూర్తిగా చేసినా చాలును. త్వరితగతిన ఈ గురుకార్యం సఫలీకృతమగునని విన్నవించడమైనది.
Subscribe to:
Posts (Atom)
అవ. పూర్వపక్షవాదిని పరిహాసముచేయుశ్లోకము నుదాహరించుచున్నారు.-------
ReplyDeleteదం-అ. మిగుల సంతోషచిత్తులును, తమబుద్ధిబలముచేతనే బలిమిచెందిన మనస్సుగలవారును యాగశాలయందు నిబిడమైనపొగచే వ్యాపింపబడిన హృదయములు గలవారునైన కర్మవాదులయొక్కవచనము లీప్రకారముగ ఘోషింపబడుచున్నవి గదా.
తా. పూర్వపక్షవాదిచెప్పిన అర్థము ఒకటియును యుక్తియుక్తముగగాని శృతిస్మృతుల కనుకూలముగగాని లేదు. ఈపూర్వపక్షవాది కర్మలయం దతిశ్రద్ధగలవాడై నిరంతరము 'జ్యోతిష్టోమ చాతుర్మాస్యాది' యాగములచేయుచు యాగశాలలయందే యున్నందున యతనిచిత్త మచ్చటి పొగచేత వ్యాపింపబడి మలినమైపోవుటచే విభ్రాంతుడై యీవిధమున చెప్పుచున్నాడు.
ఇదిగాక గృహక్షేత్రపుత్రకళత్రాది సకల పరికరంబులను బరిత్యజించి పరమహంసపరివ్రాజకాశ్రమం బవలంబించిననేతప్ప బ్రహ్మజ్ఞాననిష్ఠ గలుగదు. ఇట్టిమహాయాసమును సహించుటకు దగినబుద్ధి శుద్ధిలేనందున గృహక్షేత్రపుత్రకళత్రాదులను విడువంజాలక వారితో గూడి యుండి అనుష్ఠింపపదగిన కర్మలచేతనే మాకు స్వర్గములు అనాయాసముగ సిద్ధించునని తలచి సంతోషచిత్తులైయున్నారు.
ఈపూర్వపక్షవాదులు ప్రతిపాదించినయర్థమునందు వారికి వారి బుద్ధియే ప్రమాణముగా నున్నదిగాని మఱియొకశృతిస్మృతివాక్యము సహాయముగగాని ప్రమాణముగగాని లేదుగావున తమబుద్ధికి దోచినంత చెప్పిరిగావున, పూర్వపక్షవాదులచే జెప్పబడిన యర్థమంతయు భ్రాంతిసిద్ధమని నిశ్చయింపదగియున్నందున వారివచనములయం దనేకదోషములుకలవు.
కర్మవాదులు భ్రాంతులని "అగ్ని ముగ్ధోహ వై ధూమతాంతః స్వం లోకం న ప్రతి ప్రజానాతి, ప్లవాహ్యేతే అదృఢాః యజ్ఞరూపాః, అవిద్యాయా మంతరే వర్తమానాః, యా మిమాం పుష్టితాం వాచం ప్రవదంత్య విపశ్చితః" అను మొదలగుశృతిస్మృతివాక్యములు నిశ్చయించుచున్నవని భావము.
అగ్నిసాధ్యములైనకర్మలయం దత్యంతాసక్తికలవాడు పొగచే నావరింపబడిన చిత్తముగలవాడై స్వకీయమైన స్వరూపమును (ఆత్మ తత్త్వమును) యెఱుగజాలడు. యజ్ఞములనే యీసాధనములు ఓటియోడలు. అజ్ఞానములోబడి కర్మలనే నమ్మియుందురు. పుష్పించినవృక్షమువలె ఆపాతరమణీయంబైన కర్మప్రతిపాదక వేదవాక్యమును వివేకవిహీనులు దాని తాత్పర్యము నెఱుంగక చెప్పుచుందురని శృతిస్మృతివాక్యముల కర్థము.