శ్లోకాలు
1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | 35 | 36 | 37 | 38 | 39 | 40 | 41 | 42 | 43 | 44 | 45 | 46 | 47 | 48 | 49 | 50 | 51 | 52 | 53 | 54 | 55 | 56 | 57 | 58 | 59 | 60 | 61 | 62 | 63 | 64 | 65 | 66 | 67 | 68 | 69 | 70 | 71 | 72 | 73 | 74 | 75 | 76 | 77 | 78 | 79 | 80 | 81 | 82 | 83 | 84 | 85 | 86 | 87 | 88 | 89 | 90 | 91 | 92 | 93 | 94 | 95 | 96 | 97 | 98 | 99 | 100 |
updates
2 comments:
గురు స్మరణతో, రామకార్యంగా తలచి, ఆత్మభావనలో స్థిరపడేందుకు కావల్సిన చిత్తశుద్ధికై, ఈ నిష్కామ కర్మ రూప అక్షరయజ్ఞాన్ని, శ్లోక తాత్పర్యాది భావాన్ని చక్కగా అవగాహన చేసికొనుచు చేయ ప్రయత్నిద్దాము..
పైనున్న శ్లోకము యొక్క అవతారికను, తాత్పర్యమును ఈ దిగువ టైపు చేసిన చాలును. శ్లోకము టైపు చేయవలసిన అవసరము లేదు.
సంఖ్యలో ఎన్ని ఎక్కువ చేశాము అనేకంటే, అక్షర దోషములు ఏ ఒక్కటి తలెత్తకుండా రోజుకు ఒక్కరు కనీసం ఒక్కశ్లోకం పూర్తిగా చేసినా చాలును. త్వరితగతిన ఈ గురుకార్యం సఫలీకృతమగునని విన్నవించడమైనది.
Subscribe to:
Posts (Atom)
అవ. ఈప్రకారము కర్మకును జ్ఞానమునకును ప్రతిపాద్యభేదముచేత కలిగియున్నవైలక్షణ్యమును ప్రతిపాదించి మఱియొకవైలక్షణ్యమును ప్రతిపాదించుచున్నారు. -------
ReplyDeleteదం-అ. ఆత్మజ్ఞానము తనయొక్క ఉత్పత్తి (పుట్టుక) యందే శాస్త్రము మొదలయినవానిని యపేక్షించును. పుట్టినదై అవిద్యను నివర్తింపజేయుటయందు అపేక్షింపదు. కర్మ అన్ననో తనస్వరూపముయొక్క పుట్టుకయందును పుట్టినదై ఫలమును ఇచ్చుటయందును భేదమును అపేక్షించియుండును.
తా. యాగదానాదికర్మకలాపము తాను పుట్టునప్పుడు కర్త కరణము మొదలగు అవిద్యాకల్పితభేదపదార్థముల నవలంబించి పుట్టును. పుట్టినతరువాతనుగూడ కర్తృకరణాదిభేదముల నపేక్షించియే ఫలము నిచ్చును. అనగా ఒకపురుషుడు తనకు స్వర్గాదిఫలము కావలయుననికోరి దేశకాలద్రవ్యములను జేర్చుకొని మనోవాక్కాయములచేత శాస్త్రోక్తవ్యాపారము నాచరించినగాని యాగదానాదికర్మలు పుట్టవుగనుక, కర్మలు తాము పుట్టువిషయమై కర్త్రాదిభేదవస్తువుల నపేక్షించుచున్నవి. పుట్టినతర్వాత స్వర్గాదిఫలముల నిచ్చునప్పుడును, మరణానంతరకాలమును చంద్రలోకాదిదేశమును, విలక్షణ భోగ్యవస్తువులను, వానిని అనుభవించెడిభోక్తను, ఈలాటిభేదవస్తువుల నపేక్షించియుండును గావున కర్మలు పుట్టునప్పుడు ఫలముల నిచ్చునప్పుడునుగూడ అవిద్యాకల్పితకర్తృభోక్తాదివస్తువుల నపేక్షించియుండును. ఆత్మజ్ఞానము, గురువు, శిష్యుడు, వేదాంతమహావాక్యములు మొదలగుభేదము నపేక్షించినప్పటికిని పుట్టినతరువాత అవిద్యానాశమనుఫలము నిచ్చునపుడు గురుశిష్యాదిభేదము నపేక్షింపదు. గురుశిష్యాదిభేదమును ఈభేదమును కల్పించిన అజ్ఞానమును నిశ్శేషముగా నశింపజేయును. కనుక ఇట్టివైలక్షణ్యము కర్మలకును ఆత్మజ్ఞానమునకును కలిగియున్నది.