శ్లోకాలు

1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | 35 | 36 | 37 | 38 | 39 | 40 | 41 | 42 | 43 | 44 | 45 | 46 | 47 | 48 | 49 | 50 | 51 | 52 | 53 | 54 | 55 | 56 | 57 | 58 | 59 | 60 | 61 | 62 | 63 | 64 | 65 | 66 | 67 | 68 | 69 | 70 | 71 | 72 | 73 | 74 | 75 | 76 | 77 | 78 | 79 | 80 | 81 | 82 | 83 | 84 | 85 | 86 | 87 | 88 | 89 | 90 | 91 | 92 | 93 | 94 | 95 | 96 | 97 | 98 | 99 | 100 |

updates

"నైష్కర్మ్య సిద్ధి" త్వరలో ఈ బ్లాగు మరింత ముస్తాబు కాగలదు. అప్పటి వరకూ సాధక మిత్రులు అనుభూతి ప్రకాశము అక్షరీకరణ కొనసాగించగలరని మనవి. మంగళకరమగు ఈ కార్యక్రమం నిర్విఘ్నంగా జరుగును గాక!! అక్షర యజ్ఞంలో తొలి అధ్యాయం నందలి 100 శ్లోకాల అవతారిక, దం.ఆ, తాత్పర్యాదుల అక్షరీకరణ దిగ్విజయముగా పూర్తికాబడినది.జయగురుదేవ!!

1-49


అభ్యుపగతప్రామాణ్యవేదార్థవిజ్జైమిన్యనుశాసనాచ్చ

1-49

3 comments:

  1. అవ. వేదములన్నియు కర్మపరములే గాని జ్ఞానపరములు గావని మేము చెప్పినది కేవల యుక్తుల చేతనే గాదు,వేదతాత్పర్యములు చక్కగా తెలిసినవారియొక్క వచనములచేత గూడ చెప్పితిమని వచించుచున్నాడు.____

    ReplyDelete
  2. దం-అ. అంగీకరింపబడిన యథార్థవాదిత్వముగలిగి వేదతాత్పర్యము నెఱింగిన జైమినిమహామునియొక్క వచనమువలనను వేదము కర్మపరమని నిశ్చయించితిమి.

    తా. అనంతశాఖాత్మకంబైన వేదమును విభజించి లోకములో బ్రవర్తింపజేసిన వేదవ్యాసులనెడు ప్రసిద్ధినొందిన కృష్ణద్వైపాయనమహర్షి యొక్క శిష్యుండును సకల లోకములలో యథార్థవాదియని సకలజనులచేత నంగీకరింపబడినవాడును స్వాచార్యుడైన కృష్ణద్వైపాయనుని యనుగ్రహముచేతను తనయొక్క తపఃప్రభావముచేతను సకలవేదములయొక్క తాత్పర్యమును నిస్సంశయముగాదెలిసినవాడునైన జైమినిమహాముని తాజేసిన మీమాంసాశాస్త్రములో వేదములన్నియు కర్మపరములని చెప్పియున్నాడు. ఆకారణముచేతగూడ వేదములు కర్మపరములేగాని జ్ఞానపరములుగావని నిశ్చయింపవలయునని భావము.

    ReplyDelete
  3. జై గురుదేవ

    @ ప్రూఫ్ రీడ్ వెర్షన్.


    అవ. వేదములన్నియు కర్మపరములే గాని జ్ఞానపరములు గావని మేము చెప్పినది కేవల యుక్తుల చేతనే గాదు, వేదతాత్పర్యములు చక్కగా తెలిసినవారియొక్క వచనములచేత గూడ చెప్పితిమని వచించుచున్నాడు.____


    దం-అ. అంగీకరింపబడిన యథార్థవాదిత్వముగలిగి వేదతాత్పర్యము నెఱింగిన జైమినిమహామునియొక్క వచనమువలనను వేదము కర్మపరమని నిశ్చయించితిమి.


    తా. అనంతశాఖాత్మకంబైన వేదమును విభజించి లోకములో బ్రవర్తింపజేసిన వేదవ్యాసులనెడు ప్రసిద్ధినొందిన కృష్ణద్వైపాయనమహర్షి యొక్క శిష్యుండును సకల లోకములలో యథార్థవాదియని సకలజనులచేత నంగీకరింపబడిన వాడును స్వాచార్యుడైన కృష్ణద్వైపాయనుని యనుగ్రహము చేతను తనయొక్క తపఃప్రభావము చేతను సకలవేదములయొక్క తాత్పర్యమును నిస్సంశయముగా దెలిసినవాడు నైన జైమినిమహాముని తాజేసిన మీమాంసాశాస్త్రములో వేదములన్నియు కర్మపరములని చెప్పియున్నాడు. ఆ కారణము చేత గూడ వేదములు కర్మపరములే  గాని జ్ఞానపరములు గావని నిశ్చయింపవలయునని భావము.

    ReplyDelete

గురు స్మరణతో, రామకార్యంగా తలచి, ఆత్మభావనలో స్థిరపడేందుకు కావల్సిన చిత్తశుద్ధికై, ఈ నిష్కామ కర్మ రూప అక్షరయజ్ఞాన్ని, శ్లోక తాత్పర్యాది భావాన్ని చక్కగా అవగాహన చేసికొనుచు చేయ ప్రయత్నిద్దాము..

పైనున్న శ్లోకము యొక్క అవతారికను, తాత్పర్యమును ఈ దిగువ టైపు చేసిన చాలును. శ్లోకము టైపు చేయవలసిన అవసరము లేదు.

సంఖ్యలో ఎన్ని ఎక్కువ చేశాము అనేకంటే, అక్షర దోషములు ఏ ఒక్కటి తలెత్తకుండా రోజుకు ఒక్కరు కనీసం ఒక్కశ్లోకం పూర్తిగా చేసినా చాలును. త్వరితగతిన ఈ గురుకార్యం సఫలీకృతమగునని విన్నవించడమైనది.