శ్లోకాలు

1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | 35 | 36 | 37 | 38 | 39 | 40 | 41 | 42 | 43 | 44 | 45 | 46 | 47 | 48 | 49 | 50 | 51 | 52 | 53 | 54 | 55 | 56 | 57 | 58 | 59 | 60 | 61 | 62 | 63 | 64 | 65 | 66 | 67 | 68 | 69 | 70 | 71 | 72 | 73 | 74 | 75 | 76 | 77 | 78 | 79 | 80 | 81 | 82 | 83 | 84 | 85 | 86 | 87 | 88 | 89 | 90 | 91 | 92 | 93 | 94 | 95 | 96 | 97 | 98 | 99 | 100 |

updates

"నైష్కర్మ్య సిద్ధి" త్వరలో ఈ బ్లాగు మరింత ముస్తాబు కాగలదు. అప్పటి వరకూ సాధక మిత్రులు అనుభూతి ప్రకాశము అక్షరీకరణ కొనసాగించగలరని మనవి. మంగళకరమగు ఈ కార్యక్రమం నిర్విఘ్నంగా జరుగును గాక!! అక్షర యజ్ఞంలో తొలి అధ్యాయం నందలి 100 శ్లోకాల అవతారిక, దం.ఆ, తాత్పర్యాదుల అక్షరీకరణ దిగ్విజయముగా పూర్తికాబడినది.జయగురుదేవ!!

1-48



అంతరేణ విధిం మోహాద్యః కుర్యాత్సాంపరాయికం
న తత్స్యాదుపకారాయ భస్మనీవ హుతం హవిః 16

1-48

2 comments:

  1. శ్లో . అంతరేణ విధిం మోహాద్యః కుర్యా త్సాంపరాయికమ్,
    న త త్స్యా దుపకారాయ భస్మనీవ హుతం హవిః

    దం-అ. ఏపురుషుడు విధినివిడిచి మోహమువలన పరలోకఫలమునకు సాధనమైన కర్మను చేయునో భస్మమునందు హోమముచేయబడిన హవిస్సువలె ఆ కర్మలుపకారము (ఫలము) కొఱకు కాదు.

    తా. అజ్ఞాననివృత్తి మాత్రమే మోక్ష మని చెప్పెడుపక్షమందు ఆయజ్ఞాన నివృత్తికి దృష్టఫలమైనందున గదా జ్ఞానమే సాధన మని లోక ప్రమాణముచే దెలియందగు. అజ్ఞాననివృత్తి మాత్రమే మోక్షము కానేరదు. ఆత్మస్వరూపావస్థానరూపమైన మోక్షము వర్తమానదేహము నశించినపిదప సంభవించుచున్నందున స్వర్గాదులవలె అదృష్ట ఫలమైయుండును. అట్టి మోక్షమునకు ఆత్మజ్ఞానము సాధన మని లోక ప్రమాణముచేత నిశ్శయించుటకు శక్యము కానేరదు. దృష్టఫలసాధనమును లోక ప్రమాణముచే నిశ్చయింపనగునుగాని అదృష్ట ఫలసాధనమును లోకప్రమాణముచే నిశ్శయింపదగదు. మోక్షము అదృష్టఫలమే గాని దృష్టఫలముగాదు. తత్వజ్ఞానముకలవారు శరీరముతోనుండియు అజ్ఞాననివృత్తి కలవారై జీవన్ముక్తిని బొందియున్నారు గదా ! కావున మోక్షము దృష్టఫలమే గాని యదృష్టఫలము కాదనినచో నది న్యాయము కాదు. జీవన్ముక్తిని మీరు కల్పించుకొని సంతోషించుచున్నారుగాని అది యేప్రమాణమునందును గాన్పించదు కావున మోక్ష మదృష్టఫలమని నిశ్శయము. అట్టి యదృష్టఫలమైన మోక్షమునకు సాధనమును శాస్త్రమున విధించిన ప్రకారముగ ననుష్టించిన ఫలించును. లేనిచో బూడిదలోబోసిన హవిస్సుంబోలే వ్యర్థ మగును. (శృతిస్మృతిశాస్త్రములు కర్మను మోక్షాదిఫలసాధనము లని విధించుచున్నది. కావున కర్మలనుష్టించిన మోక్షము గలుగును గాని జ్ఞానముచే గలుగఁదు. 'బుద్ధీ చే త్కేమప్రాపణం త చ్ఛాస్త్రె ర్విప్రతిషిధ్ధం' అని యాసస్తంబ మహర్షియును జ్ఞానము మోక్షసాధనము గాదని చెప్పియున్నారు) అని భావము.

    ReplyDelete
  2. శ్లో . అంతరేణ విధిం మోహాద్యః కుర్యా త్సాంపరాయికమ్,

    న త త్స్యా దుపకారాయ భస్మనీవ హుతం హవిః


    దం-అ. ఏ పురుషుడు విధిని విడిచి మోహమువలన పరలోకఫలమునకు సాధనమైన కర్మను చేయునో భస్మమునందు హోమముచేయబడిన హవిస్సువలె ఆ కర్మలుపకారము (ఫలము) కొఱకు కాదు.


    తా. అజ్ఞాననివృత్తి మాత్రమే మోక్ష మని చెప్పెడుపక్షమందు ఆ యజ్ఞాన నివృత్తికి దృష్టఫలమైనందున గదా జ్ఞానమే సాధన మని లోక ప్రమాణముచే దెలియందగు. అజ్ఞాననివృత్తి మాత్రమే మోక్షము కానేరదు. ఆత్మస్వరూపావస్థానరూపమైన మోక్షము వర్తమానదేహము నశించిన పిదప సంభవించుచున్నందున స్వర్గాదులవలె అదృష్ట ఫలమైయుండును. 

           అట్టి మోక్షమునకు ఆత్మజ్ఞానము సాధన మని లోక ప్రమాణముచేత నిశ్శయించుటకు శక్యము కానేరదు. దృష్టఫలసాధనమును లోక ప్రమాణముచే నిశ్చయింపనగునుగాని అదృష్ట ఫలసాధనమును లోకప్రమాణముచే నిశ్శయింపదగదు. మోక్షము అదృష్టఫలమే గాని దృష్టఫలముగాదు. తత్వజ్ఞానముకలవారు శరీరముతోనుండియు అజ్ఞాననివృత్తి కలవారై జీవన్ముక్తిని బొందియున్నారు గదా ! 

           కావున మోక్షము దృష్టఫలమే గాని యదృష్టఫలము కాదనినచో నది న్యాయము కాదు. జీవన్ముక్తిని మీరు కల్పించుకొని సంతోషించుచున్నారుగాని అది యేప్రమాణమునందును గాన్పించదు కావున మోక్ష మదృష్టఫలమని నిశ్శయము. అట్టి యదృష్టఫలమైన మోక్షమునకు సాధనమును శాస్త్రమున విధించిన ప్రకారముగ ననుష్టించిన ఫలించును. లేనిచో బూడిదలోబోసిన హవిస్సుంబోలే వ్యర్థ మగును. (శృతిస్మృతిశాస్త్రములు కర్మను మోక్షాదిఫలసాధనము లని విధించుచున్నది. కావున కర్మలనుష్టించిన మోక్షము గలుగును గాని జ్ఞానముచే గలుగఁదు. 'బుద్ధీ చే త్కేమప్రాపణం త చ్ఛాస్త్రె ర్విప్రతిషిధ్ధం' అని యాసస్తంబ మహర్షియును జ్ఞానము మోక్షసాధనము గాదని చెప్పియున్నారు) అని భావము.

    ReplyDelete

గురు స్మరణతో, రామకార్యంగా తలచి, ఆత్మభావనలో స్థిరపడేందుకు కావల్సిన చిత్తశుద్ధికై, ఈ నిష్కామ కర్మ రూప అక్షరయజ్ఞాన్ని, శ్లోక తాత్పర్యాది భావాన్ని చక్కగా అవగాహన చేసికొనుచు చేయ ప్రయత్నిద్దాము..

పైనున్న శ్లోకము యొక్క అవతారికను, తాత్పర్యమును ఈ దిగువ టైపు చేసిన చాలును. శ్లోకము టైపు చేయవలసిన అవసరము లేదు.

సంఖ్యలో ఎన్ని ఎక్కువ చేశాము అనేకంటే, అక్షర దోషములు ఏ ఒక్కటి తలెత్తకుండా రోజుకు ఒక్కరు కనీసం ఒక్కశ్లోకం పూర్తిగా చేసినా చాలును. త్వరితగతిన ఈ గురుకార్యం సఫలీకృతమగునని విన్నవించడమైనది.