శ్లోకాలు

1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | 35 | 36 | 37 | 38 | 39 | 40 | 41 | 42 | 43 | 44 | 45 | 46 | 47 | 48 | 49 | 50 | 51 | 52 | 53 | 54 | 55 | 56 | 57 | 58 | 59 | 60 | 61 | 62 | 63 | 64 | 65 | 66 | 67 | 68 | 69 | 70 | 71 | 72 | 73 | 74 | 75 | 76 | 77 | 78 | 79 | 80 | 81 | 82 | 83 | 84 | 85 | 86 | 87 | 88 | 89 | 90 | 91 | 92 | 93 | 94 | 95 | 96 | 97 | 98 | 99 | 100 |

updates

"నైష్కర్మ్య సిద్ధి" త్వరలో ఈ బ్లాగు మరింత ముస్తాబు కాగలదు. అప్పటి వరకూ సాధక మిత్రులు అనుభూతి ప్రకాశము అక్షరీకరణ కొనసాగించగలరని మనవి. మంగళకరమగు ఈ కార్యక్రమం నిర్విఘ్నంగా జరుగును గాక!! అక్షర యజ్ఞంలో తొలి అధ్యాయం నందలి 100 శ్లోకాల అవతారిక, దం.ఆ, తాత్పర్యాదుల అక్షరీకరణ దిగ్విజయముగా పూర్తికాబడినది.జయగురుదేవ!!

1-58




అతః సర్వాశ్రమాణాం హి వాఙ్మనఃకాయకర్మభిః
స్వనుష్ఠితైర్యథాశక్తి ముక్తిః స్యాన్నాన్యసాధనాత్ 21

1-58

2 comments:

  1. 58.అవ. చెప్పిన హేతువును పురస్కరించుకొని స్వాభిప్రాయమును విశద పఱచి పూర్వపక్షమును ముగించుచున్నాడు.
    దం.అ. కావున నన్ని యాశ్రమములయం దుండువారలకు మోక్షము చక్కగా ననుష్ఠింపబడిన మనోవాక్కాయకర్మలచేతనే సంభవించును; మఱియొకసాధనముచే సంభవింపదు.
    తా. ఇదివరలో చెప్పినప్రకారము బ్రహ్మజ్ఞానము నంగీకరించినను నంగీకరించకపోయినను అట్టికేవలజ్ఞానమువలన మోక్షము సిద్ధింపదుగావున బ్రహ్మచర్యాశ్రమములోగాని యేయాశ్రమములోనివారికైనను తమతమ యాశ్రమముల కనుకూలముగా శృతిస్మృతులచే విధింపబడిన మానస, వాచిక, కాయకకర్మలను యధావిధిగా నాచరించిన మోక్షముకలుగునుగాని కేవల జ్ఞానము వలన మోక్షము కలుగ నేరదు. మనోవాక్కాయములచే జేయదగినకర్మలు భగవద్గీతయొక్క.... యధ్యాయమునందు విశదముగ జెప్పబడియున్నవి. వాని నిచ్ఛోవ్రాసిన గ్రంథము విస్తరమగునని సంక్షేపించెదము.

    ReplyDelete
  2. అవ. చెప్పిన హేతువును పురస్కరించుకొని స్వాభిప్రాయమును విశద పఱచి పూర్వపక్షమును ముగించుచున్నాడు.


    దం.అ. కావున నన్ని యాశ్రమములయం దుండువారలకు మోక్షము చక్కగా ననుష్ఠింపబడిన మనోవాక్కాయకర్మలచేతనే సంభవించును; మఱియొకసాధనముచే సంభవింపదు.


    తా. ఇదివరలో చెప్పినప్రకారము బ్రహ్మజ్ఞానము నంగీకరించినను నంగీకరించకపోయినను అట్టికేవలజ్ఞానము వలన మోక్షము సిద్ధింపదు గావున బ్రహ్మచర్యాశ్రమములోగాని యేయాశ్రమములోని వారికైనను తమతమ యాశ్రమముల కనుకూలముగా శృతిస్మృతులచే విధింపబడిన మానస, వాచిక, కాయకకర్మలను యధావిధిగా నాచరించిన మోక్షము కలుగునుగాని కేవల జ్ఞానము వలన మోక్షము కలుగ నేరదు. మనోవాక్కాయములచే జేయదగినకర్మలు భగవద్గీతయొక్క17వ.... యధ్యాయమునందు విశదముగ జెప్పబడియున్నవి. వాని నిచ్చోట వ్రాసిన గ్రంథము విస్తరమగునని సంక్షేపించెదము.

    ReplyDelete

గురు స్మరణతో, రామకార్యంగా తలచి, ఆత్మభావనలో స్థిరపడేందుకు కావల్సిన చిత్తశుద్ధికై, ఈ నిష్కామ కర్మ రూప అక్షరయజ్ఞాన్ని, శ్లోక తాత్పర్యాది భావాన్ని చక్కగా అవగాహన చేసికొనుచు చేయ ప్రయత్నిద్దాము..

పైనున్న శ్లోకము యొక్క అవతారికను, తాత్పర్యమును ఈ దిగువ టైపు చేసిన చాలును. శ్లోకము టైపు చేయవలసిన అవసరము లేదు.

సంఖ్యలో ఎన్ని ఎక్కువ చేశాము అనేకంటే, అక్షర దోషములు ఏ ఒక్కటి తలెత్తకుండా రోజుకు ఒక్కరు కనీసం ఒక్కశ్లోకం పూర్తిగా చేసినా చాలును. త్వరితగతిన ఈ గురుకార్యం సఫలీకృతమగునని విన్నవించడమైనది.