శ్లోకాలు

1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | 35 | 36 | 37 | 38 | 39 | 40 | 41 | 42 | 43 | 44 | 45 | 46 | 47 | 48 | 49 | 50 | 51 | 52 | 53 | 54 | 55 | 56 | 57 | 58 | 59 | 60 | 61 | 62 | 63 | 64 | 65 | 66 | 67 | 68 | 69 | 70 | 71 | 72 | 73 | 74 | 75 | 76 | 77 | 78 | 79 | 80 | 81 | 82 | 83 | 84 | 85 | 86 | 87 | 88 | 89 | 90 | 91 | 92 | 93 | 94 | 95 | 96 | 97 | 98 | 99 | 100 |

updates

"నైష్కర్మ్య సిద్ధి" త్వరలో ఈ బ్లాగు మరింత ముస్తాబు కాగలదు. అప్పటి వరకూ సాధక మిత్రులు అనుభూతి ప్రకాశము అక్షరీకరణ కొనసాగించగలరని మనవి. మంగళకరమగు ఈ కార్యక్రమం నిర్విఘ్నంగా జరుగును గాక!! అక్షర యజ్ఞంలో తొలి అధ్యాయం నందలి 100 శ్లోకాల అవతారిక, దం.ఆ, తాత్పర్యాదుల అక్షరీకరణ దిగ్విజయముగా పూర్తికాబడినది.జయగురుదేవ!!

1-56




కర్మణోఽఙ్గాంగిభావేన స్వప్రధానతయాథవా
సంబంధస్యేహ సంసిద్ధేర్జ్ఞానే సత్యప్యదోషతః 20

1-56

2 comments:

  1. అవ. కారణమును శ్లోకముతో చెప్పుచున్నాడు.
    దం.అ. అంగాంగీభావముచేతగాని, లేక ముఖ్యముగాగాని మోక్షము
    నందు కర్మకు సంబంధము సిద్ధించున్నందున బ్రహ్మజ్ఞానము కలిగివున్నప్పటికిని దోషములేదు.
    తా. 'యదేవ విద్యయకరోతి శ్రద్ధయోపనిషదా తదేవ వీర్యవత్తరం భవతి' యను శృతికర్మయే ఫలమునిచ్చుననియు
    అకర్మ జ్ఞానముతోగూడియుండిన విశేషముగా ఫలమునిచ్చునని
    చెప్పుచున్నందున కర్మ ప్రధాన సాధనమని జ్ఞానము అకర్మకు అంగముగా నుండునని చెప్పవచ్చును.
    లేదా,' వేదయజ్ఞేన దానేనతపసానశకేన బ్రాహ్మణ వివిదిషంతి' యను శ్రుతి యజ్ఞ దానాది కర్మల ననుష్టించుటచే జ్ఞానము పుట్టునని చెప్పు న్నందున జ్ఞానము ప్రధాన సాధనమని అజ్ఞానమునకు కర్మ అంగమని చెప్పవచ్చును. లేనిచో 'విద్యాంచా విద్యాంచయ స్తద్వేదోభయగ్ంసహ'
    అను శ్రుతి జ్ఞాన కర్మలు రెండు మోక్షమును గూర్చి సమాన సాధనముల ని చెప్పుచున్నందున జ్ఞాన కర్మలు మోక్షఫలమును గూర్చి సమప్రధాన సాధనములనిగాని చెప్పవచ్చును. ఈ మూడుపక్షములలో గూడా కర్మలు మోక్ష సాధనములని కాన్పించుచున్నందున బ్రహ్మజ్ఞానము మోక్షసాధనమని చెప్పేడివారును కర్మలు జ్ఞానము అంగముగాగలవైగాని జ్ఞానమున కంగములు గా గాని జ్ఞానముతో సమానములైగాని మోక్షసాధనమని యంగీకరింపవలసి న్నందున కర్మలు మోక్షసాధనమని చెప్పినది దోషముకాదు. కేవల జ్ఞానము మోక్షసాధనమనుటయే అప్రమాణమని భావము. శ్రద్ధతో గూడుకుని రహస్యమైన జ్ఞానముతో గూడ ఏ కర్మ చేయబడునో ఆ కర్మ ఫలమును ఇచ్చెడి విషయములో విశేషసామర్ధ్యము కలదైయుండును.బ్రహ్మ భావమును (మోక్షమును) పొందదలచిన వారు యజ్ఞముచేతను, దానము చేతను, తపస్సుచేతను, హితమితపవిత్రాన్నభక్షణముచేతను బ్రహ్మ జ్ఞానమును సంపాదింపగోరెదరు.
    ఏ పురుషుడు జ్ఞానమును కర్మను సమానముగా తెలిసి అనుష్టించునో అని మూడు శృతులకు అర్థము.

    ReplyDelete
  2. అవ. కారణమును శ్లోకముతో చెప్పుచున్నాడు.


    దం.అ. అంగాంగీభావముచేతగాని, లేక ముఖ్యముగా గాని మోక్షము నందు కర్మకు సంబంధము సిద్ధించున్నందున బ్రహ్మజ్ఞానము కలిగివున్నప్పటికిని దోషములేదు.


    తా. 'యదేవ విద్యయకరోతి శ్రద్ధయోపనిషదా తదేవ వీర్యవత్తరం భవతి' యను శృతికర్మయే ఫలమునిచ్చుననియు అకర్మ జ్ఞానముతో గూడియుండిన విశేషముగా ఫలమునిచ్చునని

    చెప్పుచున్నందున కర్మ ప్రధాన సాధనమని జ్ఞానము అకర్మకు అంగముగా నుండునని చెప్పవచ్చును.

    లేదా,' వేదయజ్ఞేన దానేనతపసానశకేన బ్రాహ్మణ వివిదిషంతి' యను శ్రుతి యజ్ఞ దానాది కర్మల ననుష్టించుటచే జ్ఞానము పుట్టునని చెప్పు న్నందున జ్ఞానము ప్రధాన సాధనమని అజ్ఞానమునకు కర్మ అంగమని చెప్పవచ్చును. 

                 లేనిచో 'విద్యాంచా విద్యాంచయ స్తద్వేదోభయగ్ంసహ' అను శ్రుతి జ్ఞాన కర్మలు రెండు మోక్షమును గూర్చి సమాన సాధనముల ని చెప్పుచున్నందున జ్ఞాన కర్మలు మోక్షఫలమును గూర్చి సమప్రధాన సాధనములనిగాని చెప్పవచ్చును. ఈ మూడుపక్షములలో గూడా కర్మలు మోక్ష సాధనములని కాన్పించుచున్నందున బ్రహ్మజ్ఞానము మోక్షసాధనమని చెప్పేడివారును కర్మలు జ్ఞానము అంగముగా గలవైగాని జ్ఞానమున కంగములు గా గాని జ్ఞానముతో సమానములైగాని మోక్షసాధనమని యంగీకరింపవలసి న్నందున కర్మలు మోక్షసాధనమని చెప్పినది దోషముకాదు. 

                   కేవల జ్ఞానము మోక్షసాధనమనుటయే అ ప్రమాణమని భావము. శ్రద్ధతో గూడుకుని రహస్యమైన జ్ఞానముతో గూడ ఏ కర్మ చేయబడునో ఆ కర్మ ఫలమును ఇచ్చెడి విషయములో విశేషసామర్ధ్యము కలదైయుండును. బ్రహ్మ భావమును (మోక్షమును) పొందదలచిన వారు యజ్ఞముచేతను, దానము చేతను, తపస్సుచేతను, హితమిత పవిత్రాన్నభక్షణము చేతను బ్రహ్మ జ్ఞానమును సంపాదింపగోరెదరు.

    ఏ పురుషుడు జ్ఞానమును కర్మను సమానముగా తెలిసి అనుష్టించునో అని మూడు శృతులకు అర్థము.


    ReplyDelete

గురు స్మరణతో, రామకార్యంగా తలచి, ఆత్మభావనలో స్థిరపడేందుకు కావల్సిన చిత్తశుద్ధికై, ఈ నిష్కామ కర్మ రూప అక్షరయజ్ఞాన్ని, శ్లోక తాత్పర్యాది భావాన్ని చక్కగా అవగాహన చేసికొనుచు చేయ ప్రయత్నిద్దాము..

పైనున్న శ్లోకము యొక్క అవతారికను, తాత్పర్యమును ఈ దిగువ టైపు చేసిన చాలును. శ్లోకము టైపు చేయవలసిన అవసరము లేదు.

సంఖ్యలో ఎన్ని ఎక్కువ చేశాము అనేకంటే, అక్షర దోషములు ఏ ఒక్కటి తలెత్తకుండా రోజుకు ఒక్కరు కనీసం ఒక్కశ్లోకం పూర్తిగా చేసినా చాలును. త్వరితగతిన ఈ గురుకార్యం సఫలీకృతమగునని విన్నవించడమైనది.