నైష్కర్మ్య సిద్ధి - 1
సర్వ
వేదాంతసార సంగ్రహము లేక నైష్కర్మ్యసిద్ధి
శ్రీ
సురేశ్వరాచార్య కృతము.
(శ్రీమద్ శంకరభగవత్పాదుల వారి శిష్యులు)
వీటియందు
అధికారిని నిరూపించుచున్నారు.
శ్లో: బ్రహ్మ స్తంబ పర్యంతై
సర్వప్రాణి,
సర్వ ప్రకారస్యాది దుఃఖస్య
స్వరసత ఏవ జిహాసి తత్త్వా త్తన్ని
వృత్య ర్ధా ప్రవృత్తి రస్తి స్వరసత
ఏవ::
తా:
బ్రహ్మ మొదలు చీమ వరకు ఈ లోకంలోని
జీవులన్నియూ త్రివిధ తాప దుఃఖముచే బాధింపబడకూడదని సహజముగా కోరును. కాబట్టి శాస్త్ర
ఙ్ఞానము కోరక పోయినా,
ఆ దుఃఖ నివృత్తి కొరకు ప్రయత్నం చేయుచునే యుందురు.
అనుబంధ
చతుష్టయమునకు సాధనను కూడా కలిపి చెప్పుచున్నారు. ఈ గ్రంథమును చదువ యోగ్యుడైన
పురుషుడు అధికారియని,
ప్రయోజనమనిన ఆ పురుషునకు కలుగు ఫలమని, సాధనమనిన
ఆ ఫలము లభించుటకు తగు ఉపాయమనియు, విషయమనిన ఈ గ్రంథము చేత
తెలియజేయబడిన అర్థమనియు, సంబంధమనిన అధికార, విషయ, ప్రయోజన, సాధనములకు గల
అవినాభావ సంబంధము.
దుఃఖం
మూడు విధములు.
తన
దేహ మనస్సు ల వల్ల పొందు దుఃఖం ఆధ్యాత్మికము.
ఇతర
ప్రాణుల చేత కలిగే దుఃఖం ఆధిభౌతికము.
దైవికంగా
(వాతావరణము వల్ల) కలుగు దుఃఖం ఆది దైవికం.
ఇవి
మరల మూడు విధములుగా నుండును.
1.
గతించిన దుఃఖం - యతీతము.
2.
రాబోవు దుఃఖం - అనాగతము.
3.
ఇప్పుడు అనుభవించుచున్న దుఃఖం - వర్తమానము అని చెప్పబడును.