నైష్కర్మ్య
సిద్ధి - 2
దుఃఖస్య చ దేహో పాదానైక హేతుత్వా
ద్దేహస్యచ
పూర్వోపచిత ధర్మాధర్మ మూలత్వా
దనుచ్చితిః: 2 శ్లో.
తా:
త్రివిధ తాప దుఃఖములు దేహము నేను, నాది అనే అభిమానము చేత కలిగినవి. ఈ
దేహాభిమానం, అహం, మమత్వ అభిమానము
నివృత్తి అగుటవల్ల మాత్రమే మనకు దుఃఖ నివృత్తి అగును. దహించబడేది దేహం. మరణించిన తరువాత మాత్రమే కాదు, జీవించి ఉండగనే ఈ మూడు విధములైన తాపముచే దహించబడుచున్నది.
తన స్మృతిలోని జ్ఞాపకముల వలన తనకు
కలిగిన దుఃఖం ఆథ్యాత్మికము.
ఉదా:
ఒక చిన్న పాపను తల్లిదండ్రులు ఇంటివద్ద విడచి, పని మీద బయటకు వెళ్ళారు. ఆ
పాప స్మృతిలో తల్లిదండ్రులు మెదిలారు, ఏడవటం మొదలు
పెడుతుంది. స్మృతిలో తల్లి తండ్రుల చిత్రం బలీయంగా ఉన్న యెడల, మరపించుటకు ఇంటిలోని వారు ప్రయత్నం చేసినప్పటికీ ఏడుపు ఆపదు. ఈ దుఃఖం తన
వల్ల తనకే
కలిగింది.
అజ్ఞానావస్థ లో జీవించువారికి ఎక్కువగా దీని వలనే దుఃఖం పొందుతూ ఉంటారు.
ఇతరులతో మనం వ్యవహరించేటప్పుడు వచ్చే
దుఃఖమంతా ఇదే. కానీ దీనినే ఆదిభౌతిక తాపంగా భావించడం జరుగుతుంది.
ఉదా:
మన పై అధికారి మనను తిట్టారు, సాధారణంగా మన పనిని మనం సక్రమంగా
నిర్వహించనపుడే కదా, మనం మాట పడవలసి వచ్చేది!
ఇక్కడ జ్ఞానికి, అజ్ఞానికి
భేదం స్పష్టంగా కనపడుతుంది. జ్ఞాని తనను కారణంగా పెట్టుకుని తనను తాను సరిదిద్దు కుంటాడు.
కారణము లేనియెడల ఉదాసీనముగా ఉంటాడు. అజ్ఞాని తన దుఃఖమునకు ఇతరులను కారణంగా చూస్తూ,
త్రిగుణాల ప్రభావమునకు వశుడై ప్రతి స్పందిస్తాడు.
మనలో అంతః సంఘర్షణ నిత్యం జరుగుతూనే
ఉంటుంది. మనో బుద్ధులలో జరిగే యీ చలనాలను ఆమోదింపక, తిరస్కరింపక సాక్షిగా
వున్న యెడల, అపుడు మన వల్ల మనకు కలిగే ఆధ్యాత్మిక తాపం నుండి
తప్పించుకోగలుగుతాము.
‘నేను ఆత్మ స్వరూపుడను’,
‘నేను సాక్షిని’ అని స్వరూప నిష్ఠలో
నిలబడియున్న యెడల యీ ఆథ్యాత్మిక తాపమును పరిష్కరించుకోగల్గుతాము.